news

News August 22, 2024

జొమాటో చేతికి పేటీఎం టికెట్ బుకింగ్

image

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మధ్య భారీ డీల్ కుదిరింది. పేటీఎంలోని తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని జొమాటోకు రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్97 కమ్యూనికేషన్ తెలిపింది. దీని ప్రకారం పేటీఎంలోని మూవీస్, స్పోర్ట్స్, ఈవెంట్స్ టికెట్ బుకింగ్ సేవలు జొమాటోలోకి వెళ్లనున్నాయి. ఈ బదిలీకి 12 నెలల సమయం పట్టే అవకాశముందని సమాచారం.

News August 22, 2024

పేలుడు జరిగిన ‘ఎసెన్షియా’ కంపెనీ నేపథ్యమిదే..

image

AP: అనకాపల్లి (D) అచ్యుతాపురంలోని <<13911204>>ఎసెన్షియా<<>> కంపెనీని 2019లో ఏర్పాటు చేశారు. ఇది అమెరికాకు చెందిన సంస్థ. USలోని కనెక్టికట్, ఇండియాలోని హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్వహిస్తోంది. అచ్యుతాపురంలోని సెజ్‌లో కమర్షియల్ తయారీ కేంద్రాన్ని నడుపుతోంది. ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడి సరుకులను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీలో నిన్న ప్రమాదం జరిగి 18 మంది మరణించారు.

News August 22, 2024

ఆఫ్‌లైన్ బుకింగ్ ఉంటేనే అనుమతించండి: CBN

image

AP: రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలవనుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు. స్టాక్ పాయింట్లలో ఇసుక ధర, దూరాన్ని బట్టి ఛార్జీలను ప్రకటిస్తారు. ఆఫ్‌లైన్ బుకింగ్ చేసుకున్నవారినే అనుమతించాలని అధికారులను CBN ఆదేశించారు. మరోవైపు వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.

News August 22, 2024

ఇది యుద్ధ శ‌కం కాదు: ప్రధాని మోదీ

image

ఇది యుద్ధ శ‌కం కాద‌ని, మానవాళికి ముప్పు తెచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయం అని ప్ర‌ధాని మోదీ పున‌రుద్ఘాటించారు. అందువల్ల భార‌త్‌ ఎల్ల‌ప్పుడూ దౌత్యం – చ‌ర్చ‌ల‌నే విశ్వసిస్తుందని పేర్కొన్నారు. పోలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ మోదీ అక్క‌డి భార‌తీయ క‌మ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌కు ముందు ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ఇదే విషయాన్ని వెలిబుచ్చారు.

News August 22, 2024

ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు

image

AP: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. వీరు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ జోతిర్మయి(తెనాలి) 2008లో జిల్లా జడ్జిగా ఎంపికై అంచెలంచెలుగా ఎదిగారు. జస్టిస్ గోపాలకృష్ణారావు(కృష్ణా-D చల్లపల్లి) 1994 నుంచి పలు హోదాల్లో పనిచేస్తూ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.

News August 22, 2024

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: CM రేవంత్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. AICC ముఖ్య నాయకులతో ఆయన భేటీ అవుతారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నియామకంతో పాటు AICCలోనూ పలు మార్పులు చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పిలిచినట్లు కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ను బెంగాల్‌కు పంపి, భూపేశ్ బఘేల్‌ను ఆమె స్థానంలో నియమించొచ్చని తెలుస్తోంది.

News August 22, 2024

అర్షద్ వార్సీపై సిద్ధూ జొన్నలగడ్డ ఆగ్రహం

image

కల్కిలో ప్రభాస్‌ లుక్‌పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యల పట్ల ‘డీజే టిల్లూ’ సిద్ధూ జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విమర్శించిన తీరు సరికాదంటూ తప్పుపట్టారు. ‘అభిప్రాయాల్ని తెలియజేసే హక్కు అందరికీ ఉంది. కానీ వాటిని ఎలా వ్యక్తీకరిస్తున్నామన్నది కీలకం. జోకర్ వంటి పదాలను ఉపయోగించడం సరికాదు. భారత సినీ పరిశ్రమ గర్వించే సినిమా ‘కల్కి 2898ఏడీ’’ అని స్పష్టం చేశారు.

News August 22, 2024

ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు: హోంమంత్రి

image

AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని హోంమంత్రి అనిత చెప్పారు. అది గ్యాస్ లీకేజీ వల్ల జరిగిన సంఘటన అని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఫార్మా కంపెనీలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు కంపెనీ బయట ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబాలను ఆమె పరామర్శించారు.

News August 22, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నా

image

TG: రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ BRS నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయనుంది. రైతులకు అండగా నిలిచేందుకు ఈ కార్యాచరణకు పిలుపునిచ్చింది. రుణమాఫీకి బడ్జెట్లో రూ.31వేల కోట్లకు ఆమోదం తెలిపి, రూ.18వేల కోట్లే ఖర్చు చేసిన విషయాన్ని రైతులకు వివరించాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News August 22, 2024

రియాక్టర్ పేలుడు.. మృతుల కుటుంబాలకు పీఎం పరిహారం

image

ఏపీలోని అనకాపల్లి(D) అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు <<13911204>>ఘటనపై<<>> ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు పీఎంవో తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించినట్లు పేర్కొంది. గాయపడినవారికి రూ.50వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

error: Content is protected !!