India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘అచ్యుతాపురం’ ప్రమాద ఘటనలో విపత్తు నిర్వహణ లోపం, సీఎం చంద్రబాబు పాలనలోని బేలతనాన్ని బయటపెట్టిందని వైసీపీ ట్విటర్లో విమర్శించింది. ఘటనపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని, ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత గానీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్‌మీట్ పెట్టలేదని విమర్శించింది. తప్పును తమపైకి నెట్టేలా పనికిమాలిన ఆరోపణలు చేశారంటూ మండిపడింది. బాబు 45 ఏళ్ల అనుభవంలో డొల్లతనం కనిపించిందని ఎద్దేవా చేసింది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాల సంతకాలు
1922: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి
1932: నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం
1955: మెగాస్టార్ చిరంజీవి జననం
1984: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు మరణం
1989: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జననం
2014: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి మరణం
* ప్రపంచ జానపద దినోత్సవం
తేది: ఆగస్టు 22, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:46 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:01 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
అసర్: సాయంత్రం 4:46 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:37 గంటలకు
ఇష: రాత్రి 7.52 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఆగస్టు 22, గురువారం
తదియ: మధ్యాహ్నం 01.46 గంటలకు
ఉత్తరాభాద్ర: రాత్రి 10.05 గంటలకు
వర్జ్యం: ఉదయం 09.10- 10.36 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 10.04- 10.54 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం 03.05- 3.56 గంటల వరకు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడు, 18 మంది మృతి
* ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, ఉన్నతాధికారులతో ఆరా
* సిబ్బంది వివరాలు ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్
* బాధితులకు రూ.కోటి ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిమాండ్
* TG:రుణమాఫీపై సిగ్గులేకుండా మమ్మల్ని అంటున్నారు: భట్టి
* కలెక్షన్ల కోసమే ‘హైడ్రా’: బండి సంజయ్
* బీజేపీ నేత కేటీఆర్ అనాలి: మంత్రి కోమటిరెడ్డి
* నాకు ఫామ్ హౌస్ లేదు: కేటీఆర్
2023లో దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 65 లక్షల మందికి పైగా విద్యార్థులు పాస్ కాలేదని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఇందులో సెంట్రల్ బోర్డు కంటే స్టేట్ బోర్డుల్లోనే ఫెయిల్యూర్ రేటు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. టెన్త్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలైన జాబితాలో మధ్యప్రదేశ్, బిహార్, యూపీ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక 12వ తరగతిలో యూపీ, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఫెయిలయ్యారు.
TG: అధిష్ఠానం పిలుపు మేరకు రేపు ఉ.10 గంటలకు అదానీకి వ్యతిరేకంగా TPCC నిరసన చేపట్టనుంది. ఇందులో CM రేవంత్‌రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, AICC ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్షీతో పాటు మంత్రులు, MPలు, MLAలు, MLCలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, SEBI చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
AP: అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 18 మంది మృతి తనను కలచివేసిందని అన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. మరోవైపు ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి, క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.