news

News August 21, 2024

మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

image

వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్నారు. రేపు మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేస్తారనే ప్రచారాన్ని వశిష్ఠ కొట్టిపారేశారు. తాము ప్లాన్ ప్రకారం ప్రచారం చేయాలని భావించినట్లు తెలిపారు. రేపు టీజర్ రావట్లేదని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఇందులో త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

News August 21, 2024

ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశం

image

AP: అచ్యుతాపురం <<13911204>>ఘటనపై<<>> సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. NDRF, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. శిథిలాల కింద మరింతమంది మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇంకా ఇళ్లకు చేరుకోని తమవారి కోసం ఉద్యోగుల కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు వచ్చి ఆరా తీస్తున్నారు.

News August 21, 2024

అసలు ఈ ‘సెజ్’ అంటే ఏంటి?

image

సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆర్థిక వృద్ధిని సృష్టించడానికి రూపొందించిన నిర్దిష్ట ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలకు పన్ను మినహాయింపులతో పాటు ప్రత్యేక రాయితీలు ఉంటాయి. ఇతర కంపెనీలతో పోల్చితే నిబంధనల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం పెట్టుబడులను ఆకర్షించడం. APలో మొత్తం 30 SEZ కంపెనీలకు అనుమతి రాగా 19 కంపెనీలు నిర్వహణలో ఉన్నాయి.

News August 21, 2024

BREAKING: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా

image

AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరగాల్సిన పరీక్షను APPSC వాయిదా వేసింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించనుంది. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమ్స్ నుంచి 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

News August 21, 2024

చాందీపురా వైరస్.. 28మంది చిన్నారులు మృతి

image

చాందీపురా <<13646193>>వైరస్<<>> బారిన పడి గుజరాత్‌లో ఇప్పటివరకు 28 మంది చిన్నారులు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిశికేశ్ పటేల్ తెలిపారు. జులైలో తొలి కేసు నమోదవ్వగా మరణించిన వారంతా 14 ఏళ్ల లోపేనని చెప్పారు. మెదడువాపు సంబంధిత వైరస్‌తో ఇప్పటివరకు 101 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వారం రోజులుగా ఎలాంటి కేసులు నమోదవ్వలేదన్నారు.

News August 21, 2024

208 కంపెనీలు.. ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్

image

AP: అనకాపల్లి(D) రాంబిల్లి(M) అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సెజ్‌లో మొత్తం 208 కంపెనీలు ఉంటే కేవలం ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్ ఉంది. తాజాగా జరిగిన ప్రమాదంలో మంటలను ఈ ఒక్క ఫైర్ ఇంజిన్ నియంత్రించలేకపోయింది. దీంతో చుట్టు పక్కల ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలు ఆర్పారు. ఈ సెజ్‌లో గత పదేళ్లలో 13 మంది మరణించారు.

News August 21, 2024

ఈ 3 ఉంటే జీవితం స్వర్గమే!

image

అస్తవ్యస్తమైన ఆలోచనలు లేని మెదడు, జీవితంలో భయం లేని గుండె, EMI లేని జీవనం.. ఈ మూడు ఉంటే జీవితం స్వర్గంలా మారుతుందని థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు డా.వేలుమణి అన్నారు. తన జీవితంలో ఎన్నడూ EMI కట్టలేదన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ప్రస్తుతం రూ.5000కోట్ల నికర ఆస్తితో సంపన్న వ్యాపారవేత్తగా ఉన్నారు. వేలుమణి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News August 21, 2024

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి: జగన్

image

AP: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు <<13910421>>ఘటనలో<<>> మరణాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మాజీ CM జగన్ ట్వీట్ చేశారు. గత YCP ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా తమ పార్టీ ఉంటుందని, ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు.

News August 21, 2024

కార్మికుల మరణాలు బాధాకరం: గవర్నర్

image

AP: అచ్యుతాపురం ఫార్మా <<13910421>>ఘటనపై<<>> గవర్నర్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు మరణించడం బాధాకరమని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మరోవైపు సీఎం ఆదేశాలతో వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు అనకాపల్లికి వెళ్లారు. బాధితులను KGHకు తరలిస్తామని చెప్పారు. మృతదేహాలకు వీలైనంత త్వరగా పోస్టుమార్టం చేయిస్తామన్నారు.

News August 21, 2024

ఆస్తులు కాదు.. వీటి గురించి తెలుసుకోండి!

image

పెళ్లికి చూడాల్సింది ఆస్తులు కాదు.. ఆరోగ్యం, దుర్వ్యసనాల గురించి తెలుసుకోవాలి. ఎక్కువ సంబంధాలు చూస్తే విసుగొస్తుంది. అందుకే సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలి. పెళ్లయ్యాక ఎలా ఉండాలో ఎవరూ నేర్పించరు. ముఖ్యంగా ఎవరి సలహాలు తీసుకోకుండా మీ సమస్యపై మీరిద్దరే మాట్లాడుకోవాలి. పెళ్లయ్యాక మీకు మీరు మాత్రమే తోడు. ఇంకా అమ్మకూచి అంటే కుదరదు. మూడో వ్యక్తిని రానివ్వకండి. భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించాలి. SHARE IT

error: Content is protected !!