India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘కల్కి 2898ఏడీ’లో ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాటిపై నటుడు ఆది సాయికుమార్ స్పందించారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ట్వీట్ చేశారు. వార్సీ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
APలో గ్రామసభల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నెల 23 నుంచి గ్రామ సభలను ప్రభుత్వం ప్రారంభించనుండటంతో అధికారులతో మాట్లాడనున్నారు. వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్, ఉపాధి హామీ పథకం, గ్రామసభల నిర్వహణ సహా మరికొన్ని అంశాలపై అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
క్రమం తప్పకుండా హాట్ వాటర్ తాగితే నరాల పనితీరు పెరిగి రక్తప్రసరణ మెరుగవుతుంది. బాడీ ఫ్యాట్ కరుగుతుంది. చర్మం తేమగా, వెచ్చగా ఉంటుంది. ముఖంపై మొటిమలు ఏర్పడవు. దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలకు ఇదో మంచి హోం రెమెడీ. తేనె, నిమ్మరసం కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య తీరుతుంది. బద్ధకం తగ్గి ఉల్లాసంగా ఉంటారు.
TG: సీఎం రేవంత్ రెడ్డిని అవమానిస్తూ ఆదిలాబాద్(D) రుయ్యాడిలో ఆందోళన చేసిన 11 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రుణమాఫీ అమలు కాలేదంటూ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. సీఎం శవయాత్ర పేరిట నిరసన చేపట్టారు. దీంతో సీఎంను కించపరిచేలా వ్యవహరించడం అప్రజాస్వామికమని వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాగే కొనసాగితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
TG: బీజేపీలో BRS విలీనం కాబోతోందంటూ కథనాన్ని ప్రసారం చేసిన RTV, ఆ ఛానల్ చీఫ్ రవిప్రకాశ్‌కు BRS లీగల్ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా BRS, KCRపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ తప్పుడు కథనాల లింకులను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు TGలోని ADB, మంచిర్యాల, సిరిసిల్ల, KRMR, ములుగు, భద్రాద్రి, WL, జనగామ, HYD, MDK సహా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
*స్మార్ట్ వాచ్: హెల్త్ ట్రాకర్ సహా ఎన్నో ఫీచర్స్ ఉంటాయి.
*మొక్కలు: ఓ ఇండోర్ ప్లాంట్ ఇచ్చి ఆశ్చర్యపర్చండి. పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది.
*బంగారం: ఇయర్ రింగ్స్, చైన్, రింగ్స్ బహుమతిగా ఇస్తే ఎప్పటికీ గుర్తుంటుంది.
*హెల్త్ ఇన్సూరెన్స్: అత్యవసర సమయాల్లో ఇది ఆర్థిక భద్రతను ఇస్తుంది. మెడికల్ బిల్లుల బాధ తప్పుతుంది.
*ఫిక్స్‌డ్ డిపాజిట్: వడ్డీతో అవసరాలకు డబ్బు వాడుకోవచ్చు.
AP: CM చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో నేడు పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. సీఎంవో వివరాల ప్రకారం ఉండవల్లి నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీసిటీకి చేరుకుని పలు పరిశ్రమల్ని ప్రారంభిస్తారు. 7 కొత్త సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అనంతరం మధ్యాహ్నం నెల్లూరులోని సోమశిలకు చేరుకుని జలాశయాన్ని పరిశీలిస్తారు.
TG: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వగా, మరికొన్ని హాలిడే ఇవ్వలేదు. బాలికలు, ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీపండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే కూడా లేదు.
AP: ఇవాళ నుంచి ఈనెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీ వెరిఫికేషన్ జరగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ రూ.5.66లక్షలు చెల్లించారు. ఈసీఐ ఆదేశాలతో అధికారులు 6 రోజులపాటు రీ వెరిఫికేషన్ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.