news

News August 11, 2024

ధోనీ విషయంలో అది పెద్ద ప్రశ్న: అశ్విన్

image

IPLలో ధోనీని CSK రిటెన్షన్ చేసుకునే అంశంపై ఆ టీమ్ మాజీ ప్లేయర్, ప్రస్తుత RR ఆటగాడు అశ్విన్ స్పందించారు. ‘ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడనున్నాడా అన్నది పెద్ద ప్రశ్న. అతడు కొన్నేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. కాబట్టి ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పేర్కొనడం కరెక్టే. కానీ ధోనీ లాంటి ఆటగాడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా అన్నది మరో చర్చ’ అని తన యూట్యూట్ ఛానల్‌లో అశ్విన్ అభిప్రాయపడ్డారు.

News August 11, 2024

4×400 మీ.రిలేలో దుమ్మురేపిన అమెరికా

image

పారిస్ ఒలింపిక్స్‌లో 4×400 మీ.రిలేలో అమెరికా దుమ్మురేపింది. పురుషులు, మహిళలు రెండు విభాగాల్లోనూ ఆ దేశం స్వర్ణ పతకాలు కొల్లగొట్టింది. పురుషుల టీమ్ 2:54.53 నిమిషాలు, మహిళల జట్టు 3:15.27 నిమిషాల్లో రన్నింగ్ ముగించాయి. మెన్స్ పోటీల్లో బోట్స్‌వానా వెండి, గ్రేట్ బ్రిటన్ కాంస్యంతో సరిపెట్టుకున్నాయి. అలాగే వుమెన్స్ కేటగిరీలో నెదర్సాండ్స్ వెండి, గ్రేట్ బ్రిటన్ కాంస్యం దక్కించుకున్నాయి.

News August 11, 2024

పరువు హత్య హింస కాదు.. అది ప్రేమ: నటుడి సంచలన వ్యాఖ్యలు

image

పరువు హత్యలపై తమిళ నటుడు, దర్శకుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరువు హత్య హింస కానే కాదు.. అది వారి పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమ. మన బైక్‌ను ఎంతో శ్రద్ధగా చూసుకుంటాం. దానికి ఏమైనా అయితే తట్టుకోలేం. అలాంటిది పిల్లల జీవితంపై ఎంత శ్రద్ధ పెడతాం. పిల్లలు దారి తప్పినప్పుడు తల్లిదండ్రులు కోపం చూపిస్తారు. అది హింస కాదు, పిల్లలపై ఉన్న శ్రద్ధ’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 11, 2024

థియేటర్‌లో పెళ్లి.. స్పందించిన డైరెక్టర్

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కృష్ణవంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మురారి’ మూవీ రీరిలీజ్‌లో దుమ్మురేపుతోంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మురారి ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. దీనిపై కృష్ణవంశీ ఘాటుగా స్పందించారు. ‘ఇది చాలా చెత్త నిర్ణయం. మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించడమే. దయచేసి ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News August 11, 2024

మూడు ఫార్మాట్లలో ఆడాలని ఉంది: సూర్య

image

భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాలని ఉందని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మనసులో మాట బయటపెట్టారు. టెస్టుల్లో ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ పనికొస్తుందని ఆయన చెప్పారు. కాగా T20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్య వన్డేల్లో మాత్రం తేలిపోతున్నారు. పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నారు. వన్డేలతోపాటు టెస్టులకూ ఆయనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవటం లేదు. SKY ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడారు.

News August 11, 2024

ఆగస్టు 11: చరిత్రలో ఈ రోజు

image

1908: స్వాతంత్య్ర సమరవీరుడు ఖుదీరాం బోస్ మరణం
1943: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ జననం
1949: ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు జననం
1960 – చాద్ స్వాతంత్ర్య దినోత్సవం
2000: సినీ నటుడు, నిర్మాత పైడి జైరాజ్ మరణం
2008: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అభినవ్ బింద్రా

News August 11, 2024

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో నిర్మాత ఎంగేజ్‌మెంట్

image

సినీ నిర్మాత, సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఒక్కటి కానున్నారు. తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు శ్రావ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటో పోస్ట్ చేశారు. కాగా డైరెక్టర్ ఆర్జీవీ మేనకోడలే శ్రావ్య. నాగార్జున, విజయ్ దేవరకొండ, విక్రమ్, వైష్ణవ్ తేజ్‌లకు ఆమె డ్రెస్సులు డిజైన్ చేశారు. అలాగే కీర్తి సురేశ్ హీరోయిన్‌గా ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమాను నిర్మించారు.

News August 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 11, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:42 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:58 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:44 గంటలకు
✒ ఇష: రాత్రి 8.00 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!