news

News August 10, 2024

తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఆలోచిస్తున్నా: చంద్రబాబు

image

తెలంగాణలో TDPని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని AP CM చంద్రబాబు హైదరాబాద్‌లోని NTR భవన్‌లో అన్నారు. దీనిపై రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. ‘టీడీపీ హైదరాబాద్‌లోనే పుట్టింది. ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశాం. ప్రజలకు, కార్యకర్తలకు పార్టీని ఎలా అందుబాటులోకి తేవాలనేదానిపై ఆలోచిస్తున్నా. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని క్లారిటీ ఇస్తా’ అని చంద్రబాబు వెల్లడించారు.

News August 10, 2024

బెల్లం ర‌మ్ వ‌చ్చేస్తోంది గురూ..

image

బెల్లంతో తయారు చేసిన మొట్టమొదటి దేశీయ ఒరిజిన‌ల్‌ రమ్ త్వరలో కర్ణాటక మార్కెట్‌లోకి విడుద‌ల‌కానుంది. హులి (టైగర్) పేరుతో ఆగ‌స్టు 15న‌ రానున్న ఈ మైసూర్ స్పెష‌ల్ బ్రాండ్ ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇంట్లోని ముఖ్య‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగించి త‌యారు చేసిన బెల్లం ర‌మ్‌ను ప్రీమియం ర‌మ్‌గా అభివృద్ధి చేశారు. 750ml బాటిల్ బేస్ ధర రూ.630 కాగా, పన్నులు కలుపుకొని రూ.2,800కి లభించనుంది.

News August 10, 2024

ప్రభాస్ ‘రాజా సాబ్’ చిన్న సినిమా కాదు: నిర్మాత

image

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ‘రాజాసాబ్’ను మాత్రం వీలైనంత సింపుల్‌గా, తక్కువ బడ్జెట్‌లో చేస్తారంటూ వార్తలు వచ్చాయి. వీటిని సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఖండించారు. అందరూ అనుకుంటున్నదానికంటే ఇది చాలా పెద్ద సినిమా అని ఆయన పేర్కొన్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుందని, పలు అంశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయని తెలిపారు.

News August 10, 2024

ఆర్మీ నిర్మించిన వంతెనపై ప్రధాని

image

వయనాడ్ (కేరళ)లో ప్రకృతి విధ్వంసాన్ని ప్రధాని మోదీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చూరల్మలా, ముండక్కై గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. అనంతరం ఆర్మీ నిర్మించిన వంతెనపై నడుస్తూ అక్కడ జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని భారత ఆర్మీకి చెందిన ‘మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’ 36 గంటల్లోనే నిర్మించింది. దీంతో చూరల్మలా-ముండక్కై గ్రామాల మధ్య సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.

News August 10, 2024

కుక్క కరిస్తే ఏం చేయాలి?

image

✒ ధారగా పడుతున్న నీటితో 15min గాయాన్ని కడగాలి. ఇలా చేస్తే కుక్క లాలాజలం శరీరంలోకి ప్రవేశించదు.
✒ గాయమైన చోటును యాంటిసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్ వేయించాలి.
✒ కరిచిన చోటును మూసి ఉంచొద్దు. నీరు, రక్తం కారుతున్నా అలాగే వదిలేయాలి.
✒ వైద్యుల సూచన మేరకు యాంటీ రేబిస్ టీకాను అవసరమైన (3లేదా5) మోతాదుల్లో తీసుకోవాలి.

News August 10, 2024

మరింత దృఢంగా పోరాడుతా: సోరెన్

image

కులం, మతం, రంగు, వస్త్రధారణ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల తరఫున మ‌రింత దృఢంగా పోరాడతానని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. తన పుట్టిన రోజు సంద‌ర్భంగా పోస్ట్ చేశారు. జైలు అధికారులు తన చేతిపై వేసిన ఖైదీ స్టాంప్‌ను చూపుతూ ఇది త‌న‌ గుర్తు మాత్ర‌మే కాద‌ని, ప్ర‌జాస్వామ్యం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌కు గుర్తు అని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సోరెన్ జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు.

News August 10, 2024

17,727 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భర్తీ చేయనున్న 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్(CGL) ఉద్యోగాలకు అప్లికేషన్ ఎడిట్‌ ఆప్షన్ రేపటితో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు <>ssc.gov.in<<>> వెబ్‌సైట్‌లో కరెక్షన్ చేసుకోవచ్చు. టైర్-1 ఎగ్జామ్ సెప్టెంబర్ 9 నుంచి 26 మధ్య జరగనుంది.

News August 10, 2024

భారతీయుల విడుదలకు చర్యలు: రష్యా ఎంబసీ

image

రష్యా ఆర్మీలో ప‌నిచేస్తున్న భార‌తీయుల విడుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఢిల్లీలో ర‌ష్యా ఎంబ‌సీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇప్పటికే పలువురు భార‌తీయులు ప్రాణాలు కోల్పోవ‌డంపై భారత ప్రభుత్వానికి, బాధిత కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించింది. ఏప్రిల్ నుంచి భార‌త పౌరులను సైన్యంలో చేర్చుకోవ‌డాన్ని ర‌ష్యా నిలిపివేసిన‌ట్టు వెల్ల‌డించింది.

News August 10, 2024

బంగారంపై పెట్టుబడులకు కేరాఫ్ ఆసియా

image

వరుసగా 17 నెలల నుంచి బంగారంపై పెట్టుబడులను ఆసియా ఆకర్షిస్తూనే ఉంది. జులైలో వీటి విలువ $438 మిలియన్లకు చేరింది. కస్టమ్స్ సుంకం 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో భారత్‌కే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. విదేశీయులు Gold ETFల్లో పెట్టుబడికి మొగ్గుచూపారు. జులైలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.65314కు చేరడంతో ఒక నెలలో 4.5%, YTD 17.5% రాబడి వచ్చింది. US పదేళ్ల బాండు ఈల్డులు, డాలర్ బలహీనతలు ఇందుకు దోహదపడ్డాయి.

News August 10, 2024

కొత్త రేషన్ కార్డులు.. అర్హతలు ఇవే!

image

TG: పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50ఎకరాలు, చెలక 7.5ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ప్రతిపాదించింది. 2 రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనుంది.

error: Content is protected !!