India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్- బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలు అవామీ లీగ్‌పై ఆధారపడి లేవని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై బంగ్లాదేశ్‌లో వ్యతిరేకత రావడం సహజమే అని BNP సీనియర్ నేత ముషారఫ్ PTIతో అన్నారు. బంగ్లాకు భారత్ ఎంతో ముఖ్యమని, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభించడానికి ఇది సరైన సమయం అన్నారు. మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పడాన్ని ఆయన స్వాగతించారు.
తమిళ హీరో సూర్య తలకు గాయమైందని వస్తున్న వార్తలపై నిర్మాత రాజశేఖరన్ స్పందించారు. అది చిన్న గాయమేనని, సూర్య కోలుకున్నారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’ మూవీ షూటింగ్ ఊటీలో జరుగుతోంది. అక్కడే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు సమాచారం.
మణిపుర్, హరియాణా ఎక్కువ ఒలింపిక్ పతకాలు సాధించినా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ పేరుతో గుజరాత్‌కు ఎక్కువ ఫండ్స్ అందుతున్నాయని మాజీ క్రికెటర్, AITC MP కీర్తి ఆజాద్ ఆరోపించారు. ఈ మేరకు Xలో ఆయన ఓ రిపోర్ట్ పంచుకున్నారు. అందులో ఖేలో ఇండియా స్కీమ్ కింద UPకి రూ.438.27కోట్లు, గుజరాత్‌కు రూ.426.13కోట్లు వెచ్చించగా ఎక్కువ పతకాలు గెలుస్తున్న మణిపుర్‌కు రూ.46.71కోట్లు, హరియాణాకు రూ.66.59కోట్లు వెచ్చించినట్లు ఉంది.
AP: స్కూళ్లలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఆగస్టు 15, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్, ఆటల పోటీలు నిర్వహించాలని పంచాయతీల <<13816066>>సర్పంచ్‌లకు<<>> నిర్దేశించారు. పిల్లలకు చాక్లెట్లు అందించి పారిశుద్ధ్యంపై మహాత్మాగాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్‌లో గెలిచిన మెడల్స్ నాణ్యంగా లేవని USA స్కేట్‌బోర్డర్ నైజా హస్టన్ ఆరోపించారు. జులై 29న జరిగిన పురుషుల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్ ఫైనల్‌లో అథ్లెట్ హస్టన్ కాంస్య పతకాన్ని గెలిచారు. అయితే, వారం రోజుల్లోనే పతకం పాతదైపోయి రంగు మారిందని ఆయన ఫొటోను పంచుకున్నారు. ఈ మెడల్ యుద్ధానికి వెళ్లి తిరిగివచ్చినట్లు కనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు. నాణ్యతపై దృష్టిసారించాలని ఆయన కోరారు.
ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను ఎంపీలు పురందీశ్వరి, దగ్గుమళ్ల ప్రసాద్ కోరారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతులు సమర్పించారు. ‘తోతాపురి మామిడిని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చాలి. టన్నుకు రూ.25వేలు మద్దతు ధర ఇవ్వాలి’ అని కోరారు. ప్రధానితో చర్చించి మామిడి రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా 35 మెడికల్ కాలేజీల్లో 6,210 MBBS, 1,540 BDS సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 16 సా.6లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని, 3 విడతల్లో కౌన్సెలింగ్ జరుగుతుందని NTR హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. అన్ని కాలేజీల్లో EWS కోటా అమలు చేస్తామని, అక్టోబర్ 1 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. సీట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దని సూచించారు.
TG: టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 11న జరగనుంది. హనుమకొండలోని JNS ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ఉంటుందని మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈనెల 15న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా వరంగల్‌లోనే జరగడం విశేషం.
ఇయర్ ఫోన్స్, స్పీకర్లు, భారీ శబ్దాల కారణంగా కోట్లాదిమంది వినికిడి శక్తిని కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం 12-35 ఏళ్ల మధ్యవయసున్న వారిలో 100 కోట్ల మందికి 2050 నాటికి వినికిడి లోపాలు తలెత్తుతాయని అందులో స్పష్టం చేసింది. భారీ శబ్దాల కారణంగా శాశ్వతంగా వినికిడి కోల్పోతే దానికి పూర్తి చికిత్స లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 WC విజయం అనంతరం స్వదేశానికి చేరుకున్న తర్వాత సిరాజ్ సీఎం రేవంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. సిరాజ్‌ను అభినందించిన సీఎం, అతనికి ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
Sorry, no posts matched your criteria.