news

News February 3, 2025

ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు

image

AP: నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా TDP అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమెకు 41 ఓట్లు, YCP అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు పడ్డాయి. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా TDP అభ్యర్థులు దుర్గాభవానీ, ఉమా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో వారు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తిరుపతిలో YCP కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ MP గురుమూర్తి, MLC సుబ్రహ్మణ్యం నిరసనకు దిగారు.

News February 3, 2025

67వ గ్రామీ అవార్డ్స్-2025 విజేతలు వీరే

image

ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్- కౌబాయ్ కార్టర్(బియాన్స్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ – ‘నాట్ లైక్ అస్’ (కేండ్రిక్ లామర్)
బెస్ట్ కంట్రీ ఆల్బమ్- ‘కౌ బాయ్ కార్టర్ (బియాన్స్)
బెస్ట్ అమెరికానా పర్ఫార్మెన్స్ – ‘అమెరికన్ డ్రీమింగ్’ (సియెర్రా ఫెర్రెల్)
బెస్ట్ మెలోడిక్ రాప్ పర్ఫార్మెన్స్ – ‘3’ (రాప్సొడీ ఫీచరింగ్ ఎరికా బాడు)
బెస్ట్ రాక్ ఆల్బమ్ – హాక్నీ డైమండ్స్ (ది రోలింగ్ స్టోన్స్)

News February 3, 2025

సుప్రీంకోర్టులో KTR పిటిషన్.. 10న విచారణ

image

TG: పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను గతంలో దాఖలైన పిటిషన్‌కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని వెల్లడించింది.

News February 3, 2025

రోహిత్‌తో విభేదాల వార్తలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్

image

BGT సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు, కోచ్ గంభీర్‌కు మధ్య మనస్పర్థలొచ్చాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తలపై తాజాగా గంభీర్ స్పష్టతనిచ్చారు. ‘జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు చాలా వార్తలు గుప్పుమంటుంటాయి. పుకార్లు షికారు చేస్తుంటాయి. మ్యాచులు గెలుస్తుంటే అవే సమసిపోతాయి. జట్టులోని ఆటగాళ్లందరూ ఎన్నో మ్యాచులు ఆడారు. పరిణతి కలిగినవారు. విభేదాలేం లేవు. అందరూ కలిసే ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి TDPదే

image

AP: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 23 ఓట్లు పడగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. దీంతో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

News February 3, 2025

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్

image

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ అయింది. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. డార్లింగ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 3, 2025

సౌతాఫ్రికాకు నిధుల్ని నిలిపేసిన ట్రంప్

image

దక్షిణాఫ్రికాకు తమ దేశం ఇచ్చే నిధులన్నింటినీ ఆపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘కొన్ని వర్గాల ప్రజలపై సౌతాఫ్రికా చాలా ఘోరంగా వివక్ష చూపిస్తోంది. వారి భూముల్ని లాక్కుంటోంది. అక్కడి వామపక్ష మీడియా దీన్ని బయటికి రాకుండా అడ్డుకుంటోంది. ఇలాంటివాటిని చూస్తూ ఊరుకోం. అక్కడేం జరుగుతోందో పూర్తి నివేదిక వచ్చే వరకూ ఆ దేశానికి మా నిధుల్ని పూర్తిగా ఆపేస్తున్నా’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

సినిమాల్లోకి మోనాలిసా.. కొత్త PHOTO

image

కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన మోనాలిసా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పుష్ప-2 మూవీ పోస్టర్ ముందు ఆమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇప్పుడు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం’ అంటూ ఆమె Xలో చెప్పుకొచ్చింది. కాగా <<15310417>>‘ది డైరీ ఆఫ్ మణిపుర్’<<>> చిత్రంలో మోనాలిసా నటించనుంది.

News February 3, 2025

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 620 పాయింట్ల నష్టంతో 76,895 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు నష్టపోయి 23,260 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.16గా ఉంది.

News February 3, 2025

శక్తిమంతమైన టూల్‌ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

image

ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయగల డీప్ రీసెర్చ్ అనే శక్తిమంతమైన టూల్‌ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. అత్యంత కష్టమైన పరిశోధనను కూడా ఈ టూల్ సమర్థంగా పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ‘మనిషి గంటల తరబడి చేసే పనిని డీప్ రీసెర్చ్ కేవలం నిమిషాల వ్యవధిలో చేయగలదు. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెట్టింట సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి నివేదికను రిసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో తయారుచేసి మీకు అందిస్తుంది’ అని పేర్కొంది.