India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 23,071 (-309), సెన్సెక్స్ 76,293 (-1018) వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.10L CR ఆవిరయ్యాయి. ఆటో, మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G సూచీలు 2-3% మేర పతనమయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్, ట్రెంట్, ఎయిర్‌టెల్, బ్రిటానియా టాప్ గెయినర్స్. ఐచర్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫిన్, కోల్ఇండియా, BEL టాప్ లూజర్స్.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్ ప్లస్ 12 ఫోన్ వాడుతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా ఆయన ఈ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. కాగా ఈ ఫోన్ ధర రూ.58 వేల నుంచి రూ.61 వేలుగా ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఇంత పెద్ద క్రికెటర్ ఈ ఫోన్ వాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

పప్పు ధాన్యాలు పండించే రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుభవార్త చెప్పారు. వచ్చే నాలుగేళ్లూ కంది, మినప, మసూర్‌ను 100% కొంటామని తెలిపారు. వేరుశెనగ, సోయాబీన్ కొనుగోలు గడువును పొడిగించారు. మహారాష్ట్రలో 24, తెలంగాణలో 15 రోజులు సోయాబీన్ కొనుగోలు గడువును పెంచారు. దేశీయ పప్పుధాన్యాలు ఉత్పత్తి పెరుగుతోందని, దిగుమతులు తగ్గిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏరో ఇండియా-2025లో యుద్ధ విమానాన్ని నడిపారు. ‘యుద్ధ విమానాన్ని నడపడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది. HAL స్వదేశంలో తయారు చేసిన HJT-36 ‘యశస్’ అనే జెట్ విమానంలో ప్రయాణించే అవకాశం లభించింది. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న భారత శక్తికి స్వదేశీ పరిజ్ఞానం నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

‘VD12’ తెలుగు టీజర్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఒక్కచోటుకు చేరారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు స్టూడియోకు వచ్చిన ఫొటోను VD ట్వీట్ చేశారు. ‘నిన్న మొత్తం ఎన్టీఆర్ అన్నతో గడిపాను. జీవితం, సినిమా గురించి నవ్వుతూ మాట్లాడుకున్నాం. టీజర్ డబ్‌లో కూర్చున్నప్పుడు ఆయన నాలాగే ఎగ్జైట్ అయ్యారు. నా రోజును మరింత బ్యూటిఫుల్‌గా మార్చినందుకు ధన్యవాదాలు తారక్ అన్న’ అని విజయ్ రాసుకొచ్చారు.

లోక్‌సభ వ్యవహారాల్ని సంస్కృతంలోకి అనువదించడాన్ని DMK MP దయానిధి మారన్ సభలో వ్యతిరేకించారు. అది ప్రజాధనాన్ని వృథా చేయడమేనని అన్నారు. ‘2011 లెక్కల ప్రకారం దేశంలో సంస్కృతం మాట్లాడేవారు 73వేల మంది మాత్రమే ఉన్నారు. సభ వివరాల్ని సంస్కృతంలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు’ అని స్పష్టం చేశారు. ఆయన వాదనను స్పీకర్ బిర్లా తోసిపుచ్చారు. సంస్కృతంతో పాటు లోక్‌సభలో 22 భాషలకు గుర్తింపు ఉందని గుర్తుచేశారు.

AP: తూ.గో జిల్లా కానూరులో కోళ్లకు <<15420742>>బర్డ్‌ఫ్లూ<<>> నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు భారీగా పడిపోయింది. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. అయినా సరే ప్రజలు చికెన్ కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఎంతో మంది లెజెండరీ ప్లేయర్లు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. అందులో కొందరు క్రికెట్ ఉన్నన్ని రోజులు గుర్తుండిపోతారు. ఇప్పటివరకూ అన్ని ఫార్మాట్లలో 411 మంది ఆటగాళ్లు ఇండియా తరఫున ఆడగా వీరంతా కలిసి 897 సెంచరీలు చేశారు. అయితే, ఇందులో సచిన్ 100, విరాట్ కోహ్లీ 81, రోహిత్ శర్మ 49లతో 230 సెంచరీలు చేశారు. అంటే 25.6శాతం(పావలా వంతు) సెంచరీలు ఈ ముగ్గురి పేరిటే ఉన్నాయి.

TG: MRPS ఉద్యమానికి మొదటి నుంచీ రేవంత్ మద్దతిస్తున్నారని, సుప్రీం తీర్పు తర్వాత వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. SC వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై CMతో భేటీ తర్వాత మాట్లాడారు. ‘రిజర్వేషన్ శాతం, గ్రూపుల్లో కొన్ని లోపాలున్నాయి. కులగణన లోపాలను CM దృష్టికి తీసుకెళ్లాం. ఏ, బీ, సీ గ్రూపుల్లోని కులాల విషయంలో అభ్యంతరాలు తెలిపాం. 3 గ్రూపులను 4 చేయాలని అడిగాం’ అని చెప్పారు.

AP: ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొందరు విభాగాధిపతులు ఫైళ్లను 6 నెలలు, ఏడాది వరకు తమ వద్ద ఉంచుకోవడం సరికాదన్నారు. ఆలస్యానికి గల కారణాలపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థికేతర ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచరాదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.