India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: AI స్టార్టప్‌లకు సొల్యూషన్స్ అందించే ట్రైజిన్ టెక్నాలజీస్ HYDలో AI ఇన్నోవేషన్, డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మూడేళ్లలో 1000 మందికి ఉద్యోగాలు, శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించింది. US పర్యటనలో ఉన్న CM రేవంత్, IT మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూసే భాగ్యం లభించదు. దీపాల వెలుగులో మెరిసిపోతున్న తిరుమలేశుని చూసి భక్తులు తరిస్తుంటారు. ఆయన ధరించే బంగారు ఆభరణాలేంటో తెలిపే ఫొటో ఒకటి వైరలవుతోంది. ఆయన ఆభరణాలివే.. కిరీటం, మకర కుండలం, చక్ర, శంఖు, వైజయంతి హారం, నాగాభరణం, దశావతార కంకణం, కటి హస్త, యజ్ఞోపవీతం, తులసీ మాల, సూర్య కటారి, వరద హస్త ఉంటాయి.
‘మథుర’ కేసులో హిందూ పక్షం లాయర్ విష్ణుశంకర్ జైన్ సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. ఒకవేళ అలహాబాద్ హైకోర్టు తీర్పును ముస్లిం పక్షం సవాల్ చేస్తే తమ వాదనలను వినకుండా ఎలాంటి వ్యతిరేక ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. శ్రీకృష్ణ మందిరం- ఈద్గా మసీదుపై 18 కేసుల మెయింటెనబిలిటీపై వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 1న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. మసీదు రిలీజియన్ క్యారెక్టర్ నిర్ధారించాల్సి ఉందని పేర్కొంది.
ఎండిన కొబ్బరి కాయ, కుడకలు(కొబ్బరి ముక్కల) విమానంలోని క్యాబిన్ బ్యాగేజ్‌లోకి సిబ్బంది అనుమతించరు. వాటికి మండే స్వభావమే ఇందుకు కారణం. అలాగే కొబ్బరి ప్రసాదాన్ని కూడా క్యాబిన్ బ్యాగేజ్‌లోకి అనుమతించరు. అయితే చెక్ ఇన్ లగేజ్‌లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. క్యాబిన్ బ్యాగేజ్ అంటే ఫ్లైట్‌లో ప్రయాణికులతో పాటు ఉంచుకునేది. చెక్ ఇన్ లగేజ్ అంటే సిబ్బందికి అప్పగించి, బెల్ట్ వద్ద తీసుకునేది.
AP: ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విస్మరించారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘రైతులకు పెట్టుబడి సాయం, విద్యార్థులకు అమ్మఒడి, వసతి దీవెన, మహిళలకు రూ.1800, సున్నా వడ్డీ మాఫీని సీఎం ఎగ్గొట్టారు. కానీ నేను సీఎంగా ఉన్నప్పుడు వారందరినీ ఆదుకున్నా. ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు బేషరతుగా అమలు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ అల్లకల్లోలం నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో హోంమంత్రి అమిత్ షా అత్యవసర భేటి నిర్వహించారు. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చించారు. భారత్, బంగ్లా బోర్డర్‌లో భద్రత పెంపు, ఢిల్లీలో షేక్ హసీనా భద్రత, బంగ్లా నుంచి అక్రమ వలసలు వంటి వాటిపై హోంమంత్రి సమీక్షించారు.
దేశంలోని పోస్టాఫీసుల్లోని 44,288 పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. నేటి నుంచి AUG 8 వరకు అభ్యర్థులు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఉదయం సర్వర్‌లో లోపం కారణంగా <
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె రియల్ ఫైటర్ అని కొనియాడుతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలో బ్రిజ్ భూషన్‌ను ఆరెస్ట్ చేయాలని ఢిల్లీ వీధుల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. ఎన్నో అవమానాలు, అరెస్టులను ఎదుర్కొన్నారని, ఒలింపిక్స్‌లో గోల్డెన్ గర్ల్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్ వాహనాల్లో ప్రయాణించేవారికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. రోడ్డుపై నీరు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దారిలో వెళ్లకపోవడమే మంచిదని తెలిపారు. ‘రెండడుగుల లోతు ఉన్న నీటిలో వెళ్లిన ఓ విద్యుత్ బస్సు బ్యాటరీలోకి నీరు వెళ్లిపోయి షార్ట్ సర్క్యూట్ అయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఈవీలు నడిపేవారు నీరు నిల్వ ఉన్న రోడ్లపై వెళ్లకండి’ అని స్పష్టం చేశారు.
AP: కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక నిఘా పెట్టారు. 8 విభాగాల పర్యవేక్షణలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ నుంచి ముంబై రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో నిన్న ఒక్కరోజే రీసైక్లింగ్ రేషన్ బియ్యం తరలిస్తున్న 6 లారీలను గుర్తించారు. దీంతో పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఇవాళ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.