India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రంజీ క్వార్టర్ ఫైనల్ 3లో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో ముంబై కెప్టెన్ అజింక్య రహానే (108) సెంచరీతో సత్తా చాటారు. 180 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో ఆయన శతకం బాదారు. 100/3తో జట్టు కష్టాల్లో ఉండగా రహానే తన సెంచరీతో ఆదుకున్నారు. ఇదే మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ (70) ఫామ్‌లోకి వచ్చారు. ఈ మ్యాచులో సెంచరీ చేయడంతో రహానేను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లోనే మొదలయ్యాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ టారిఫ్స్ విధించడమే ఇందుకు కారణం. మరోవైపు డాలర్ విలువ పెరుగుదల సెంటిమెంటును దెబ్బతీసింది. నిఫ్టీ 23, 293 (-88), సెన్సెక్స్ 77,025 (-285) వద్ద ట్రేడవుతున్నాయి. IT షేర్లు బలం ప్రదర్శిస్తున్నాయి. ఫైనాన్స్, BANK, మీడియా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G షేర్లు ఎరుపెక్కాయి. ADANIENT, GRASIM, APSEZ టాప్ గెయినర్స్.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.80,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరగడంతో తొలిసారి రూ.87,930లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.

మద్యం ధరలను పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాలు మందు బాబులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్ ధరలు తప్ప అన్ని బ్రాండ్ల మద్యం బాటిళ్లపై రూ.10లను ఎక్సైజ్ శాఖ పెంచింది. అటు తెలంగాణలో కేవలం బీర్ల ధరలనే పెంచారు. అన్నిరకాల బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 15% ధరలు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

TG: ‘రోడ్లు వేయిస్తా, డ్రైనేజీలు, ట్యాంకులు కట్టిస్తా’ అనేది పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పాత మాట. ‘కోతులు లేకుండా చేస్తా’ అనడం కొత్త మాట. పంటలను ధ్వంసం చేయడం, తమను గాయపరుస్తున్న వాటిని తరలిస్తేనే గెలిపిస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంలో 35లక్షలకు పైగా కోతులున్నట్లు అంచనా. గతంలో కోతుల బెడద నివారిస్తానంటే జగిత్యాల(D) కొడిమ్యాలలో ఒకరిని సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించారు.

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తం నో వెహికల్ జోన్‌గా మారుస్తామని తెలిపారు. కాగా కుంభమేళాలో రోజూ దాదాపు 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారుల అంచనా.

AP: పదేళ్ల బాలుడు తాను చనిపోతూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసకు చెందిన యువంత్ ఆరో తరగతి చదువుతున్నాడు. జనవరి 29న పుట్టిన రోజు చేసుకున్న తర్వాతి రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. వైద్యులు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ GBS) సోకిందని చెప్పారు. నిన్న బ్రెయిన్ డెడ్ కావడంతో తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. బాలుడి రెండు కళ్లు, లివర్, రెండు కిడ్నీలను సేకరించారు.

IPL: గుజరాత్ టైటాన్స్ జట్టును టొరెంట్ గ్రూప్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఆ ఫ్రాంచైజీ వాటాలో 67 శాతం మెజారిటీ స్టేక్ దక్కించుకోనుంది. కాగా 2022లో లక్సెంబర్గ్‌కు చెందిన CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఈ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన 2022 సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించింది. 2023లో రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నారు.

తమ పిల్లలు భవిష్యత్‌లో మంచి స్థాయికి చేరుకోవాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. దీనిని సాధ్యం చేయాలంటే వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే వారికి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ అందించాలి. ఇది రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు సహకరిస్తుంది. చిన్నపాటి వ్యాయామాలు, ధ్యానం చేయించాలి. వారిలో క్రియేటివిటీకి పదును పెట్టే విషయాలు నేర్పాలి. పిల్లలకు తరచూ ఆత్మవిశ్వాసం నూరిపోయాలి.

AP: తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఇవాళ టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(నిన్న 15గంటలు) పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా, వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.