India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పవన్ కళ్యాణ్ ‘OG’తో పాటు ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్స్ ఇచ్చారు. ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘OG’ ఫస్ట్ సింగిల్ గురించి త్వరలో ఓ అప్డేట్ ఉంటుందని దీనికోసం డైరెక్టర్ సుజీత్‌తో కలిసి వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా మూవీ ఉంటుందని మూవీపై అంచనాలు పెంచేశారు. ‘రాజా సాబ్’ సినిమా ఫస్ట్ సింగిల్ జనవరిలో ఉండొచ్చని ట్వీట్ చేశారు.
TG: అసెంబ్లీలో ఖైరతాబాద్ కాంగ్రెస్ MLA దానం నాగేందర్ మాట్లాడిన <<13762351>>బూతులను<<>> BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తప్పుబట్టారు. ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని తిడుతుంటే CM రేవంత్ పైశాచికానందం పొందుతున్నారు. అందర్నీ ఉసిగొల్పుతున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు. చీప్ మినిస్టర్. యువత రేవంత్‌కు తగిన సమాధానం చెప్పే టైమ్ త్వరలోనే వస్తుంది’ అని KTR వ్యాఖ్యానించారు.
దేశంలోని దాదాపు 400కుపైగా చైనా కంపెనీల (లోన్ యాప్స్, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ etc) గుర్తింపును కేంద్రం రద్దు చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 700 చైనా కంపెనీలపై దర్యాప్తు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి. 300-400 సంస్థలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి కేంద్రం తొలగించనుందని తెలుస్తోంది. ఏపీ, కర్ణాటక, ఢిల్లీ సహా 17 రాష్ట్రాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి.
పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
TG: నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య చెప్పకుండా మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, ఆ ఉద్యోగాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ప్రజలు తంతారనే భయంతో జాబ్ క్యాలెండర్ పేరుతో ఓ కాగితాన్ని సభలో ప్రవేశపెట్టారని విమర్శించారు.
AP: వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డూ. ఎవరైనా తిరుమల వెళ్లొస్తే ముందుగా అడిగేది దీనినే. ఎంతో ప్రాముఖ్యత గల లడ్డూని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి నేటికి 308 ఏళ్లు పూర్తైంది. 1715 AUG 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆలయపోటులో స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరంతో ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని తయారుచేస్తారు.
పారిస్: ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్స్‌లో ధీరజ్ బొమ్మదేవర-అంకితా భకత్ జోడీ అదరగొట్టింది. స్పెయిన్‌పై 5-3 తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. వీరు సెమీస్‌లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్, కిమ్ జోడీతో తలపడనున్నారు. కాగా వీరు మెడల్ పక్కా చేసుకోవడానికి ఒక్క విజయం దూరంలో ఉన్నారు. <<-se>>#Olympics2024<<>>
టీమ్ ఇండియాతో జరుగుతున్న మొదటి వన్డేలో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 రన్స్ చేసింది. ఓపెనర్ నిస్సాంక (56), వెల్లలగే (66*) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
TG: *అక్టోబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కంల ఇంజినీరింగ్, ఏఈఈ పోస్టులకు <<13762082>>నోటిఫికేషన్<<>> *నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ *అక్టోబర్‌లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్ *2025 FEBలో గ్రూప్-1 ప్రిలిమ్స్ *2025 జులైలో గ్రూప్-1 మెయిన్స్ *2025 FEBలో డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ *2025 APRలో ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఆగస్టులో రాతపరీక్ష
*2025 JUNEలో గురుకుల లెక్చరర్ నోటిఫికేషన్ *2025 మేలో గ్రూప్-2 నోటిఫికేషన్
ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ఆరోపణలున్న నేపథ్యంలో దానిపై విచారణకు SIT ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌ను సుప్రీం <<13761265>>కొట్టేసింది<<>>. దీనిపై చర్యలు తీసుకునేందుకు సాధారణ చట్టం ద్వారా మార్గాలున్నాయని తెలిపింది. మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం అనుచితం అని పేర్కొంది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటవుతుందని అభిప్రాయపడింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.