India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తనకు ఉన్న ‘ఛేజ్ మాస్టర్’ పేరును విరాట్ కోహ్లీ నిలబెట్టుకుంటున్నారు. నిన్న ఆసీస్‌పై 84 రన్స్ చేయడం ద్వారా వన్డేల్లో లక్ష్య ఛేదనలో అత్యంత వేగంగా 8,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. కింగ్ కేవలం 159 ఇన్నింగ్సుల్లోనే 8,063 రన్స్ చేశారు. ఇందులో 28 సెంచరీలుండటం విశేషం. సచిన్ 232 ఇన్నింగ్సుల్లో 8,720 రన్స్‌తో టాప్‌లో ఉండగా, రోహిత్(6,115 పరుగులు) మూడో స్థానంలో ఉన్నారు.

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన UTF అభ్యర్థి ఓడారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆ సంఘం ఖండించింది. UTFకు రాజకీయాలు అంటగట్టడం సరికాదంది. APTF, PRTU అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించింది. కూటమి మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి వారు విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టు అని పేర్కొంది.

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో బీపీటీ రైస్‌తో భోజనం అందించనున్నట్లు మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో తెలిపారు. వసతి గృహాల్లో ఆర్వో ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.

TG: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 4,88,448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్‌లపై నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఆ అమ్మాయి ఒకప్పుడు మహేశ్ బాబుతో నటించారు. పలు సీరియల్స్‌లోనూ తన లక్ పరీక్షించుకుంది. సక్సెస్ కాకపోవటంతో వేరే రంగాన్నిఎంచుకొని ఇప్పుడు పలువురికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. మయూరి కాంగో నటిగా స్థిరపడాలనుకున్నారు. సెట్ కాకపోవటంతో పెళ్లిచేసుకొని విదేశాలకు వెళ్లారు. న్యూయార్క్‌లో ఎంబీఏ చేసి పలు కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం ఏకంగా గూగుల్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

IAS కావాలన్నదే ఆయన కల. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 35 సార్లు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో విఫలమయ్యారు. ఆయనెవరో కాదు హరియాణాకు చెందిన విజయ్ వర్ధన్. UPSC 2018లో 104ర్యాంకుతో IPS, 2021లో 70 ర్యాంకు సాధించి IAS అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు. ఆత్మవిశ్వాసం ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తుందని ఈయన నిరూపించారు.

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కర్నూలు జైలుకు తరలించారు. ఈ నెల 18 వరకు ఆయన ఇక్కడే ఉండనున్నారు. కాగా ఆదోని పీఎస్‌లో నమోదైన కేసుపై కర్నూలు కోర్టులో వాదనలు జరిగాయి. ఆ సమయంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఆదోని జైలు వద్దని, కర్నూలు జైలుకు తరలించాలని జడ్జికి విన్నవించారు. దీంతో ఆయనను కర్నూలు కారాగారానికి తీసుకెళ్లారు.

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, వైసీపీ నేతల అరెస్టులపై ఆయన మాట్లాడనున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తీవ్ర విచారకరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చాత్తాపపడ్డారు. ట్రంప్ నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. ‘రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు మేం సిద్ధం. ఇందుకోసం USతో కలిసి పనిచేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. ఇప్పటివరకు US అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తున్నాం. అగ్రరాజ్యానికి ఉక్రెయిన్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.