news

News August 2, 2024

క్రోమోజోమ్‌లు అంటే ఏంటి?

image

మనుషుల్లో రెండు రకాల సెక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇవి వ్యక్తి లింగాన్ని నిర్ధారిస్తాయి. పురుషుల్లో అయితే ఒకటి X, మరొకటి Y క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఆడవాళ్లలో రెండు X క్రోమోజోమ్‌లు ఉంటాయి. తాజాగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇద్దరు మహిళా బాక్సర్లు ఖలీఫ్, లిన్ యూ.. పురుషుల్లో ఉండే XY క్రోమోజోమ్‌లు కలిగి ఉన్నట్లు తేలింది. జన్యు వారసత్వం, సంతానంలో జన్యుపరమైన వ్యాధుల సంభావ్యతను ఈ క్రోమోజోమ్‌లు తెలియజేస్తాయి.

News August 2, 2024

ఒలింపిక్స్‌లో జెండర్ వివాదం.. కారణం ఇదే!

image

మహిళా బాక్సర్లు ఇమానే <<13755882>>ఖలీఫ్<<>>(అల్జీరియా), లిన్‌యూ టింగ్(తైవాన్) గత ఏడాది జెండర్ టెస్టుల్లో ఫెయిలయ్యారు. వీరిద్దరూ XY క్రోమోజోములు కలిగి ఉన్నట్లు టెస్టుల్లో తేలింది. దీంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ చివరి మ్యాచులకు ముందు వీరిపై అనర్హత వేటు పడింది. ఇప్పుడు వీరి టెస్టోస్టిరాన్ లెవెల్ ఒలింపిక్ కమిటీ రూల్స్‌కు లోబడి ఉండటం, పాస్‌పోర్టుల్లో జెండర్ ఫిమేల్ అని ఉండటం వంటి కారణాలతో పోటీకి అనుమతించారు.

News August 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 2, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:38 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:50 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:49 గంటలకు
✒ ఇష: రాత్రి 8.06 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 2, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 2, శుక్రవారం
✒ త్రయోదశి: మధ్యాహ్నం 3.26 గంటలకు
✒ ఆరుద్ర: ఉదయం 10.58 గంటలకు
✒ వర్జ్యం: రాత్రి 11.28 నుంచి 1.08 వరకు
✒ దుర్ముహూర్తం1: ఉదయం 8.23 నుంచి 9.14 వరకు
✒ దుర్ముహూర్తం2: మధ్యాహ్నం 12.39 నుంచి 1.30 వరకు
✒ రాహుకాలం: ఉదయం 10.30 నుంచి 12.00 వరకు

News August 2, 2024

TODAY HEADLINES

image

* రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేయవచ్చు: సుప్రీంకోర్టు
* ఒలింపిక్స్: కాంస్యం సాధించిన భారత షూటర్ స్వప్నిల్
* రేపే జాబ్ క్యాలెండర్ విడుదల: TG ప్రభుత్వం
* TGలో కొత్త రేషన్ కార్డుల జారీకి క్యాబినెట్ ఆమోదం
* అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్, హరీశ్ అరెస్ట్
* ఏపీలో 96% పింఛన్ల పంపిణీ పూర్తి
* ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతించిన CBN, రేవంత్

News August 2, 2024

మంత్రి లోకేశ్‌ను అభినందించిన బీజేపీ ఎంపీ

image

AP: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో CPM, ప్రజాసంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల లోకేశ్ క్షమాపణలు తెలపడంపై BJP MP జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ‘లోకేశ్ గారు.. మీ శాఖలో జరిగిన తప్పు కాకపోయినా, పోలీసుల మితిమీరిన చర్యలకు మీరు క్షమాపణ చెప్పారు. అలాగే మీ విద్యాశాఖలో పథకాలకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టారు. రాజకీయాల్లో మంచి సంప్రదాయాలకు తెరతీసిన మీకు అభినందనలు’ అని కొనియాడారు.

News August 1, 2024

ఇలాంటి పంచ్ నేనెప్పుడూ ఎదుర్కోలేదు.. మహిళా బాక్సర్ కన్నీళ్లు

image

ఒలింపిక్స్‌లో ఇమానే ఖలీఫ్ చేతిలో <<13755882>>ఓడిన<<>> బాక్సర్ ఏంజెలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఇంత గట్టి పంచ్ నేనెప్పుడూ ఎదుర్కోలేదు. ఫైట్ కంటిన్యూ చేయలేకపోయాను. ఈ విషయాన్ని ఒలింపిక్ కమిటీకి వదిలేస్తున్నాను’ అని చెప్పారు. గత ఏడాది మరణించిన తన తండ్రి కోసం మెడల్ గెలవాలని ఏంజెలా కలలు కన్నారు. కానీ ఖలీఫ్ పంచ్‌ వల్ల ముక్కు విరగడంతో పోటీ నుంచి తనకు తానుగా వైదొలిగారు.

News August 1, 2024

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: మంత్రి నారా లోకేశ్

image

AP: శ్రీసత్యసాయి(D)లో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా CPM, ప్రజా సంఘాల నేతల్ని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటన పట్ల మన్నించాలని కామ్రేడ్లను కోరారు. ‘గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా కొందరు పోలీసుల తీరు మారలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం’ అని X వేదికగా తెలిపారు.

News August 1, 2024

ఒలింపిక్స్‌లో PV సింధు ఓటమి

image

బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ 19-21 తేడాతో వెనుకబడిన ఆమె తర్వాతి రౌండ్లో(14-21)నూ పోరాడి ఓడిపోయారు. దీంతో సింధు నిరాశతో ఇంటిబాట పట్టారు.
<<-se>>#Olympics2024<<>>