India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* బ్యాడ్మింటన్: 16వ రౌండ్‌కు పీవీ సింధు అర్హత
* బ్యాడ్మింటన్: 16వ రౌండ్‌కు లక్ష్య సేన్ అర్హత
* టేబుల్ టెన్నిస్: 16వ రౌండ్‌కు శ్రీజ ఆకుల అర్హత
* షూటింగ్: ఫైనల్స్‌కు చేరిన స్వప్నిల్
* బాక్సింగ్: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన లవ్లీనా
* ఆర్చరీ: 16వ రౌండ్‌కు దూసుకెళ్లిన దీపికా కుమారి
* టేబుల్ టెన్నిస్: 16వ రౌండ్‌లో మనికా ఓటమి
<<-se>>#Olympics2024<<>>
కేరళలోని వయనాడ్ వరద బాధితులకు Airtel తన వంతు సాయాన్ని ప్రకటించింది. రీఛార్జ్ వాలిడిటీ ఎక్స్‌పైర్ అయిన ప్రీపెయిడ్ కస్టమర్లకు 3 రోజులపాటు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించనుంది. పోస్ట్ పెయిడ్ యూజర్లకు బిల్ పేమెంట్ గడువును 30రోజులు పొడిగించింది. అప్పటివరకూ బిల్ చెల్లించకపోయినా సేవల్లో అంతరాయం ఉండదని తెలిపింది. తమ రిటైల్ స్టోర్లను రిలీఫ్ మెటీరియల్ కలెక్షన్ పాయింట్లుగా మార్చనున్నట్లు పేర్కొంది.
ఇండియాలోని 300 చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సపోర్ట్ అందిస్తోన్న C-Edge Technologiesపై ‘ransomware’ (మాల్‌వేర్) అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఆయా బ్యాంకుల RTGS, యూపీఐ, ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో ఎక్కువ సంఖ్యలో RRBలు, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. అయితే దీనిపై C-Edge Technologies ఇంకా స్పందించలేదు. ransomware వల్ల పెద్ద బ్యాంకులపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
AP: పిఠాపురంలో వృద్ధురాలి ఆవేదనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన ఇంటిని ఆక్రమించుకోవాలని కొందరు యత్నిస్తున్నారని వృద్ధురాలు చంద్రలేఖ సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి పవన్ దృష్టికి వెళ్లింది. దీనిపై డిప్యూటీ సీఎం ఆదేశాలతో కాకినాడ ఆర్డీవో చంద్రలేఖ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇంటికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున వృద్ధురాలిని ఇబ్బంది పెట్టరాదని అవతలి పక్షానికి స్పష్టం చేశారు.
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మాజీ స్పీకర్, MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను పోచారం విందుకు ఆహ్వానించినట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
తాను నటించిన ‘పూజా మేరీ జాన్’ చిత్ర నిర్మాతలతో గొడవ పడ్డానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ఈ కథ కోసం మరో నటిని ఎంచుకోవడమే ఇందుకు కారణమట. ‘ఈ మూవీలో పాత్ర నాకెంతో నచ్చింది. నా నిజ జీవితానికి ఈ కథతో దగ్గర సంబంధం ఉంది. ఇలాంటి రోల్‌లో నటించాలని ఎదురుచూస్తున్నా. అయితే వేరే నటి కోసం చూస్తున్నారని తెలిసి గొడవ పడ్డా. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఇందులో నటించా’ అని ఓ ఇంటర్వ్వూలో చెప్పారు.
నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 165.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఏకంగా 21 టీఎంసీల నీరు చేరింది. ఎగువన ఉన్న ఆల్మట్టితో పాటు తుంగభద్ర డ్యాంలకు భారీ వరద కొనసాగుతోంది. ఆ నీరంతా సాగర్ జలాశయానికి రానుంది.
AP: పార్టీ ఎంపీలు, MLAలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారని జనసేన తెలిపింది. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారని పేర్కొంది. ఒక్కో ప్రజాప్రతినిధి రెండ్రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారంది. ఈ మేరకు జనసేన కార్యాలయంలో అందుబాటులో ఉండే నేతల వివరాలను పార్టీ వెల్లడించింది. పైన ఫొటోల్లో ఆ జాబితా చూడొచ్చు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ మనికా బాత్రా ఓడిపోయారు. రౌండ్ 16లో 6-11, 9-11, 14-12, 8-11, 6-11 తేడాతో జపాన్ ప్లేయర్ హిరానో మియో చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఒలింపిక్స్‌లో 16వ రౌండ్ వరకూ చేరిన తొలి భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా మనికా నిన్న రికార్డు సృష్టించారు. <<-se>>#Olympics2024<<>>
AP: ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. రూ.1,29,972 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. నవంబర్ 30 వరకు ఈ బడ్జెట్ అమలులో ఉంటుంది. ఇందులో అన్నక్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా పలు అత్యవసర విభాగాలకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కాగా గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నేటితో ముగిసింది.
Sorry, no posts matched your criteria.