news

News October 21, 2024

మితిమీరుతున్న ఆగడాలు.. కఠిన చట్టాలు కావాల్సిందేనా?

image

అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మితిమీరుతున్నాయి. చట్టమంటే భయం, భక్తి లేకుండా ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఆడబిడ్డల ఉసురుతీస్తున్న మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. అలాంటి నేరాలకు పాల్పడాలనే ఆలోచన వస్తేనే వణికేలా మరింత కఠిన శిక్షలు ఉండాలి. కేసుల విచారణ వేగవంతం చేసేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సభ్య సమాజం కోరుతోంది. మీరేమంటారు?

News October 21, 2024

‘ది హండ్రెడ్’ లీగ్‌లోకి IPL ఫ్రాంచైజీలు!

image

ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పెట్టుబడి పెట్టేందుకు IPL ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే CSK, SRH, LSG, MI, KKR, DC తమ బిడ్స్ సబ్మిట్ చేసినట్లు సమాచారం. రాజస్థాన్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తొలి రౌండ్ బిడ్డింగ్ మాత్రమే కావడంతో ఇప్పటికిప్పుడు ఆయా ఫ్రాంచైజీలు జట్లను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. IPL మెగావేలం తర్వాత జట్ల ఎంపిక ఉండొచ్చని తెలుస్తోంది.

News October 21, 2024

రైతు నేతకు షాకిచ్చిన రైతులు!

image

జాతీయ రైతు నేత రాకేశ్ టికాయత్‌కు వెస్ట్రన్ UP రైతులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. లోక్‌సభ, హరియాణా ఎన్నికల్లో ఆయన BJPకి వ్యతిరేకంగా, INDIA కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. వెస్ట్రన్ UP రైతుల్లో ఆయనకు గట్టి పట్టుంది. ఆయన చెప్పిందే చేస్తారు. అలాంటిది చెరకు రైతు సహకార ఎన్నికల్లో 151కి 148 సీట్లు BJP గెలవడంతో ఆయన నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మరి మీరేమంటారు?

News October 21, 2024

STOCK MARKETS: పతనం వైపు పయనం

image

స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 24,956 వద్ద ఆరంభమైన నిఫ్టీ 24,978 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 100 పాయింట్ల పతనంతో 24,754 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 169 పాయింట్ల నష్టంతో 81,054 వద్ద చలిస్తోంది. HDFC BANK, TECH M, HDFC LIFE, ASIAN PAINTS, WIPRO టాప్ గెయినర్స్. టాటా కన్జూమర్, KOTAK BANK, BPCL, INDUS IND, AIRTEL టాప్ లూజర్స్.

News October 21, 2024

వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

image

AP: మాజీ మంత్రి, YCP నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో(2022 జూన్ 6న) అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే YCP సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శ్రీకాంత్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు.

News October 21, 2024

దివ్వెల మాధురికి పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన మాధురి అక్కడ ఫొటోషూట్స్, రీల్స్ చేశారంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు<<14326522>> కేసు నమోదైంది<<>>. దీంతో తిరుమల వన్ టౌన్ పోలీసులు టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెకు నోటీసులిచ్చారు.

News October 21, 2024

సేవింగ్స్ ఖాతాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా..

image

IDFC బ్యాంక్: రూ.5లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3% వడ్డీ, రూ.5 లక్షల- రూ.100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే అత్యధికంగా 7.25% వడ్డీ అందిస్తోంది.
HDFC, ICICI: రూ.50 లక్షల లోపు 3% వడ్డీ, ఆపై బ్యాలెన్స్ ఉంటే 3.5% వడ్డీ అందిస్తున్నాయి.
SBI: రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌పై 2.70 %, ఆపై ఉంటే 3% వడ్డీ అందిస్తోంది
PNB: రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్‌కు 2.70%, రూ.10 లక్షల- రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75% చెల్లిస్తుంది.

News October 21, 2024

జియోకు కోటి మంది యూజర్లు గుడ్ బై!

image

రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత రిలయన్స్ జియోకు యూజర్లు షాక్ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.

News October 21, 2024

బాంబు బెదిరింపు కాల్స్: రూల్స్ మారుస్తున్న కేంద్రం

image

బెదిరింపు కాల్స్‌తో విమానాలకు అంతరాయాలు కలగకుండా కేంద్రం రూల్స్‌ మారుస్తోంది. ప్యాసింజర్, కార్గో సహా సెకండరీ లాడార్ పాయింట్ల వద్ద హ్యాండ్ బ్యాగుల చెకింగ్ ముమ్మరం చేయనుంది. మెసేజులు పెడుతున్న వారిని పట్టుకొనేందుకు VPN ప్రొవైడర్లతో కలిసి పనిచేయనుంది. SMలో ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ మెసేజెస్ పెట్టి గంటల్లోనే డిలీట్ చేయడాన్ని గమనించిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ టీమ్స్‌ను అలర్ట్ చేసింది.

News October 21, 2024

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.. త్వరలో నియోజకవర్గాలకు నిధులు!

image

TG: వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,320KM మేర మరమ్మతులు చేయాల్సి ఉండగా రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేసింది. R&B పరిధిలో 2,555KM రోడ్లు ధ్వంసం కాగా రూ.2,500 కోట్లు కావాలని తేల్చింది. నియోజకవర్గాల వారీగా ఆ నిధులను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు కేంద్ర సహకారమూ కోరనుంది.