news

News October 20, 2024

కాజీపేటలో రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి

image

TG:కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడే వ్యాగన్స్ తయారవుతాయన్నారు. సికింద్రాబాద్ నడుస్తున్న వందేభారత్ రైళ్ల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామన్నారు. 2025 డిసెంబర్‌లోపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పున:ప్రారంభిస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు MMTS సర్వీసులు పొడిగిస్తున్నామన్నారు.

News October 20, 2024

40 లక్షల మందికి రుణమాఫీ అన్న కాంగ్రెస్.. BRS ఫైర్

image

తెలంగాణలోని 40 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందారని, తాము చెప్పింది చేశామని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దీనిపై BRS మండిపడింది. ‘కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి. తెలంగాణలో 22 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని రేవంత్ రెడ్డి కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పుడు 40 లక్షల మందికి మాఫీ చేశామని కాంగ్రెస్ సిగ్గులేకుండా చెప్పుకుంటోంది’ అని ఫైర్ అయింది.

News October 20, 2024

‘పుష్ప-2’లో శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్ సెన్సేషనల్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్‌లో సమంత నటించగా ‘పుష్ప-2’లోనూ ఇలాంటి సాంగ్ ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, దీనికోసం జాన్వీ కపూర్‌ను తీసుకుంటారని గతంలో వార్తలొచ్చాయి. కానీ, జాన్వీకి బదులు శ్రద్ధా కపూర్‌ను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్‌ కోసం ఆమె రూ.4కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

News October 20, 2024

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆలపాటి, పేరాబత్తుల ఖరారు

image

AP: పట్టభద్ర MLC స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్(ఉ.గో) పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారుచేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఆలపాటి తెనాలి, రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానాలను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీట్లు జనసేనకు వెళ్లిన విషయం తెలిసిందే.

News October 20, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన: హరీశ్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. కరీంనగర్(D) మానుకొండూరు ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్యారంటీ పేరుతో రేవంత్ సర్కారు గారడీ చేస్తుందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలులో విఫలమైందన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక రేవంత్‌‌పై పోరాటానికి అంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.

News October 20, 2024

మూడోసారీ యోగినే యూపీ సీఎం: జ్యోతిషుడు అనిరుధ్

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి గెలుస్తుందని ప్రముఖ జ్యోతిషుడు అనిరుధ్ కుమార్ మిశ్రా అంచనా వేశారు. ‘ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2027 ఎన్నికల్లో విజయం సాధిస్తారు’ అని ఆయన ట్వీట్ చేయగా వైరలవుతోంది. అంతేకాకుండా మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ NDA విజయం సాధిస్తుందని చెప్పారు.

News October 20, 2024

ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

image

NZతో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అంత తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని ఊహించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ ముందు తాము విఫలమైనట్లు పేర్కొన్నారు. అయితే రెండో ఇన్నింగ్సులో బ్యాటర్లు మెరుగ్గా రాణించినట్లు మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. రిషభ్, సర్ఫరాజ్ భాగస్వామ్యంలో పరిణితి కనిపించిందన్నారు. ఇంగ్లండ్‌పై పుంజుకున్నట్లుగానే తిరిగి గాడిన పడుతామని హిట్ మ్యాన్ ధీమా వ్యక్తం చేశారు.

News October 20, 2024

36 ఏళ్ల తర్వాత..

image

తొలి టెస్టులో విజయంతో న్యూజిలాండ్ నిరీక్షణకు తెర పడింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఇండియాలో NZ విజయం సాధించింది. చివరిసారిగా 1988లో ఆ జట్టు గెలుపొందడం గమనార్హం. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 24న ముంబైలో జరగనుంది.

News October 20, 2024

బద్వేల్ ఘటన.. కీలక విషయాలు వెలుగులోకి

image

AP: <<14403526>>బద్వేల్ ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో యువతిని అడ్డు తొలగించేందుకు నిందితుడు విఘ్నేశ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో ప్రాథమికంగా తేల్చారు. ఆ యువతి అతనికి చిన్నతనం నుంచే పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విఘ్నేశ్‌‌కు వేరొకరితో వివాహమైంది. ఈ క్రమంలో పథకం ప్రకారమే యువతిని బైక్‌పై తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పేర్కొన్నారు.

News October 20, 2024

ప్రభాస్ బర్త్ డే.. CDP విడుదల

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ విడుదలైంది. ఈనెల 23న ఇదే ఫొటోను ప్రభాస్ అభిమానులంతా తమ సోషల్ మీడియా అకౌంట్ల డిస్ప్లే పిక్చర్‌గా పెట్టుకోనున్నారు. కల్కిలో విల్లుతో ఉన్న ప్రభాస్ ఫొటోతో పాటు ఆదిపురుష్, సలార్, బాహుబలి, రాజాసాబ్ లుక్స్‌ను ఉంచారు. ఇందులో ‘స్టారంటే రెబలేరా’ ట్యాగ్‌లైన్‌ హైలైట్‌. బర్త్ డే సందర్భంగా ‘సలార్’, ఈశ్వర్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు రీరిలీజవుతున్నాయి.