news

News July 20, 2024

ఓడినా మీకు ఎందుకింత అహంకారం: షా

image

గెలిచిన వారిలో అహంకారం చూస్తుంటామని, కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాహుల్ గాంధీ అహంకారం ప్రదర్శిస్తున్నారని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఓడిన వారు అహంకారం చూపించడాన్ని తాను తొలిసారి చూస్తున్నానని అన్నారు. ఝార్ఖండ్‌లో JMM-కాంగ్రెస్ కూటమి అవినీతిలో కూరుకుపోయిందని BJP వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో షా అన్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన వారికి ఎందుకింత అహంకారం అని ఆయన ప్రశ్నించారు.

News July 20, 2024

కమీషన్ల కోసమే కాళేశ్వరం చేపట్టారు: ఉత్తమ్

image

TG: కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 16లక్షల ఎకరాలకు నీరిచ్చేలా రూ.38వేల కోట్ల అంచనాతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందన్నారు. అయితే ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయని గత ప్రభుత్వం భావించి కాళేశ్వరం చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదని ఉత్తమ్ అన్నారు.

News July 20, 2024

అనంత్ అంబానీ పెళ్లి ప్రమోషన్‌ని తిరస్కరించిన ఇన్‌ఫ్లుయెన్సర్

image

అంబానీ ఇంట పెళ్లి ప్రమోషన్స్ పుణ్యమా అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బాగానే లాభపడ్డారు. అయితే తనకు రూ.3.6 లక్షలకు ప్రమోషన్ ఆఫరొచ్చినా తిరస్కరించానంటోంది ఇన్‌ఫ్లుయెన్సర్ కావ్యా కర్ణాటక్. ‘గుంపుతో కలిసి వెళ్లడం నాకు నచ్చదు. వైవిధ్యమైన నా కంటెంట్‌లో రాజీ పడను. జియో ఛార్జీలు పెంచిన వేళ అంబానీ వంటి కార్పొరేట్‌ని ప్రోత్సహించడం సరికాదు. హై ప్రొఫైల్ వెడ్డింగ్స్‌పై సరైన అభిప్రాయం లేదు’ అని తెలిపారు.

News July 20, 2024

NCA హెడ్‌గా విక్రమ్ రాథోడ్?

image

నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత NCA హెడ్ VVS లక్ష్మణ్ కాంట్రాక్టు మరో 2 నెలల్లో పూర్తి కానుంది. దీంతో రాథోడ్‌ను నియమించాలని BCCI భావిస్తోందట. కాగా మరోసారి NCA బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా ఉండేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

News July 20, 2024

‘గ్రే డివోర్స్’ అంటే ఏంటో తెలుసా?

image

ఇన్‌‌స్టాలో ఓ యూజర్ చేసిన ‘గ్రే డివోర్స్’ పోస్టుకు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టగా ఆ పదం సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. 50ఏళ్లు పైబడిన దంపతులు తీసుకునే విడాకులనే గ్రే డివోర్స్ అంటారు. జుట్టు రంగు మారిన వయసులో తీసుకుంటుండటంతో ఈ పేరు వచ్చింది. విడాకులు తీసుకునే వారిని ‘సిల్వర్ స్ప్లిటర్స్’ అని పిలుస్తారు. ఈ మధ్య ఈ తరహా డివోర్స్ ఎక్కువయ్యాయని మ్యారేజ్ కౌన్సిలర్లు చెబుతున్నారు.

News July 20, 2024

వర్షం వస్తోంది.. వేడిగా ఏమైనా తింటున్నారా?

image

వర్షం ముసురేస్తుంటే ఇంట్లో ఏదో ఒకటి వేడివేడిగా తినాలని అనిపిస్తుంది. ప్రాంతాలను బట్టి వేర్వేరు రెసిపీలు చేసుకొని తింటుంటారు. మొక్కజొన్న కంకులు కాల్చి వాటిపై నిమ్మరసం, కాస్త ఉప్పు-కారం చల్లి తింటే ఆ టేస్టే వేరు. పాప్ కార్న్, ఆనియన్ పకోడి, మిరపకాయ/ఆలూ బజ్జీలు, పప్పు గారెలు బయటివి కాకుండా ఇంట్లో చేసుకుంటే బెటర్. వీటిలోకి కాంబినేషన్‌గా టీ మరిచిపోవద్దండోయ్. ఇంతకీ వర్షం వస్తే మీరేం తింటారు?

News July 20, 2024

విడాకుల రాజధానిలో ‘50వ వార్షికోత్సవం’

image

ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్న కారణంగా నైజీరియాలోని కానో నగరానికి ‘విడాకుల రాజధాని’ అనే పేరుంది. అయితే అలాంటి నగరంలో తాజాగా మహమూద్ కబీర్ యకసయ్, రబియాతు తాహిర్ 50ఏళ్ల వివాహ వార్షికోత్సవం చేసుకున్నారు. సుదీర్ఘకాలం నిలిచిన జంటగా వీరు రికార్డు సృష్టించారు. దీంతో వీరిని అందరూ అభినందిస్తున్నారు. అక్కడ పేపర్ మీద రాయడం, నోటితో చెప్పడం, ఫోన్‌కు మెసేజ్ పెట్టడం ద్వారా సులభంగా విడాకులు ఇస్తుండటం గమనార్హం.

News July 20, 2024

టీటీడీలో లోపాలు గుర్తించాం.. సరిచేస్తాం: ఈవో

image

AP: టీటీడీలో లోపాలను గుర్తించామని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులకు క్యూ లైన్లలో అన్నప్రసాద వితరణలో సమస్యలు, ఉద్యోగుల కొరత, దళారుల మోసాలు, ఓకే ఐడీతో టికెట్ల బుకింగ్, IT వ్యవస్థలో లోపాలున్నట్లు గుర్తించామన్నారు. లడ్డూ, అన్నప్రసాదంలో నాణ్యత పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. వారానికి 1.65 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

News July 20, 2024

IPL: ఢిల్లీ క్యాపిటల్స్ మరో సంచలన నిర్ణయం?

image

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిషభ్ పంత్‌ను వేలానికి వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మళ్లీ వేలంలో కొనడానికి కూడా ఆసక్తిచూపడం లేదని టాక్. మరోవైపు పంత్‌ను దక్కించుకోవాలని సీఎస్కే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలోకి రాకముందే ట్రేడింగ్ ద్వారా ఆయనను సొంతం చేసుకునేందుకు DCతో ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.

News July 20, 2024

శ్రీశైలానికి 82వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదులకు భారీ వరద వస్తోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 82వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఉత్తర తెలంగాణలో గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. కడెం ప్రాజెక్టుకు సైతం వరద పోటెత్తుతోంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుంచి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది.