India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కి చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులిచ్చారు. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులిచ్చారు.
తెలంగాణకు ప్రధానంగా ఆదాయం సమకూర్చే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో కొనసాగించడానికి ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతినెలా టార్గెట్ పెట్టుకుని రాబడి సాధించాలని.. జీఎస్టీ వసూళ్లను పెంచే మార్గాలను వెతకాలని, మద్యం అక్రమ సరఫరాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
తాను బ్యాడ్మింటన్‌కు బదులు టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఉంటే మరిన్ని ఘనతలు సాధించి ఉండేదాన్నని భారత షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడ్డారు. ‘మా పేరెంట్స్ నన్ను టెన్నిస్‌లో చేర్చి ఉంటే బాగుండేదని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. టెన్నిస్‌లో ఎక్కువ డబ్బు ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రారంభించినప్పుడు నాకు ఆదర్శం ఎవరూ లేరు. ఎందుకంటే నేను సాధించినవి అప్పటికి ఎవరూ అందుకోలేదు’ అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరిపైనా ఆ దేశ ప్రజలు పెదవి విరుస్తున్నారు. బైడెనూ వద్దు.. ట్రంపూ వద్దు అంటూ సర్వేలో తేల్చిచెప్పారు. ఆ నివేదిక ప్రకారం.. ట్రంప్ వస్తే ఏమవుతుందోనని పౌరులు భయపడుతున్నారు. అటు బైడెన్ పట్ల సానుకూలత ఉన్నా సమర్థమైన పాలన అందించలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. భారత సంతతిలో 46శాతం మంది మాత్రమే బైడెన్‌కు ఓటేస్తామంటున్నారు. మొత్తంగా ఓటర్లు ఇద్దర్నీ రిజెక్ట్ చేస్తుండటం గమనార్హం.
TG: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 23న కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రం కూడా పూర్తి స్థాయి బడ్జెట్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 25న లేదా 26న బడ్జెట్‌ను ప్రవేశపెట్టొచ్చని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు వారానికిపైగానే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్ని రోజులన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు తాను ఇండియా రావడం కుదరదని SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అధికారులకు చెప్పారు. గత నెల 23న ఆయన రాసిన లేఖ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. క్యాన్సర్, గుండె చికిత్సలు తీసుకుంటున్నానని అందులో తెలిపారు. ‘ట్యాపింగ్ కేసులో ఆరోపణల వల్ల నేను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇండియా వస్తాను. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు సిద్ధం’ అని తెలిపారు.
చట్టబద్ధంగా వివాహం కానప్పుడు భాగస్వామిపై 498ఏ కేసు పెట్టడం కుదరదని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓ వ్యక్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. సహజీవనంలోని భాగస్వామికి, చట్టబద్ధంగా జరిగిన పెళ్లిలో భర్త అన్న పదానికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషనర్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జాస్మిన్ పావోలినీ చరిత్ర సృష్టించారు. తన దేశం తరఫున వింబుల్డన్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళగా నిలిచారు. క్రొయేషియాకు చెందిన డొన్నా వెకిక్‌పై 2-6, 6-4, 7-6 (10/8) స్కోరుతో ఆమె చెమటోడ్చి గెలిచారు. గత నెలలో జరిగిన ఫ్రెంచి ఓపెన్‌లోనూ రన్నరప్‌గా నిలిచారు. శనివారం జరిగే ఫైనల్‌లో 2022 వింబుల్డన్ ఛాంపియన్ ఎలీనా రైబకీనాను లేదా 31వ సీడ్ బార్బొరా క్రెజ్సికోవాను జాస్మిన్ ఎదుర్కొంటారు.
ప్రధాని మోదీ ఇటీవల విజయవంతంగా రష్యా పర్యటన ముగించుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన పట్ల అమెరికా గుర్రుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పత్రిక ఓ నివేదికలో తెలిపింది. ఓవైపు నాటో సదస్సు జరుగుతుంటే పుతిన్ వద్దకు వెళ్లడమేంటంటూ బైడెన్ యంత్రాంగం తమ అసంతృప్తిని న్యూఢిల్లీకి తెలియజేసిందని వివరించింది. రష్యాను నమ్మడం భారత్‌కు అంత మంచిది కాదని అమెరికా జాతీయ భద్రత సలహాదారు సలివాన్ సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ కొవిడ్ విషయంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నేటికీ వారానికి 1700మంది కొవిడ్‌కు బలవుతున్నారని తెలిపారు. ‘టీకాలు ఆపొద్దు. ప్రధానంగా 60కి పైబడినవారిలో ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. వారు తమ చివరి డోసు వేయించుకున్న 12నెలలలోపు మరో డోసు తీసుకోవాలి. ప్రభుత్వాలు వైరస్‌పై నిఘాను కొనసాగించాలి. ప్రజలందరికీ చికిత్స అందుబాటులోకి తీసుకురావాలి’ అని సూచించారు.
Sorry, no posts matched your criteria.