India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏదో రోజు ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశమవుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న పోరాటం ఆ దిశగానే దేశాన్ని తీసుకెళ్తోందని, నాటోలో చేరేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఉక్రెయిన్‌ను నాటోలో త్వరగా చేర్చడమంటే రష్యా నుంచి అణుయుద్ధాన్ని ఆహ్వానించినట్లేనని అమెరికా, జర్మనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న చెన్నైలో రిసెప్షన్ జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లిని మాత్రం థాయ్‌ల్యాండ్‌లో ఓ బీచ్ రిసార్ట్‌లో అతి తక్కువమంది కుటుంబీకుల సమక్షంలో చేసుకున్నారు. దక్షిణ భారత సంప్రదాయంలో ఈ నెల 10న పెళ్లి జరగ్గా ఫొటోలు ఆలస్యంగా బయటికొచ్చాయి.
కారాగారంలో మరణించిన దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్యను రష్యా ప్రభుత్వం ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఏ పోరాటం కోసమైతే తన భర్త ప్రాణాలు అర్పించారో ఆ పోరాటాన్ని కొనసాగిస్తానని యూలియా నావల్నయా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టుకు రష్యా వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఆమె దేశానికి వెలుపల జీవిస్తున్నారు. ఆమె రష్యాలో అడుగుపెడితే వారెంట్ దృష్ట్యా ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయొచ్చు.
టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కీలక ఆటగాళ్లే. అయితే.. కోచ్‌గా గంభీర్‌ను ఎంపిక చేసిన సంగతిని బీసీసీఐ కోహ్లీకి చెప్పలేదట. టీ20 కెప్టెన్ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యకు, ఇటు రోహిత్‌కు మాత్రమే బీసీసీఐ విషయాన్ని చెప్పిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. విరాట్, గౌతీల మధ్య ఉన్న గత చరిత్ర, విరాట్ ఆటగాడు మాత్రమే కావడంతో చెప్పనక్కర్లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను ప్రతిపక్షాలకు 225 స్థానాల్లో విజయం దక్కుతుందని ఎన్సీపీ(sp) అధినేత శరద్ పవార్ పార్టీ అంతర్గత సమావేశంలో జోస్యం చెప్పారు. ‘రాష్ట్రం ఇప్పుడు తప్పుడు వ్యక్తుల చేతిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తేలింది. 2019లో 6 ఎంపీ సీట్లే గెలిచిన ప్రతిపక్షాలు, ఈ ఏడాది 31కి చేరుకున్నాయి’ అని గుర్తుచేశారు.
కన్నడ నాట యాంకర్‌గా, నటిగా పేరు తెచ్చుకున్న అపర్ణ వస్తారే(57) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. యాంకర్‌గానే కాక సీరియల్స్, సినిమాల నటిగా.. వివిధ భారతిలో రేడియో జాకీగా అపర్ణ సుప్రసిద్ధురాలు. బెంగళూరు మెట్రో అనౌన్స్‌మెంట్స్‌లో వినిపించే స్వరం ఆమెదే. అపర్ణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ నెల 14న రత్న భాండాగారం తెరవనున్నారు. 1978 తర్వాత ఇంతవరకూ ఆ రహస్య గదిని తెరవలేదు. ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.
‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మించనున్నట్లు సమాచారం. ఇదే సినిమాలో బాలకృష్ణ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్.
ఈ తరంలో ఆఖరి వివాహం కావడంతో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చుకు అంబానీల ఫ్యామిలీ ఏమాత్రం వెనుకాడట్లేదు. తాజాగా తమ సంస్థ ఉద్యోగులకు ప్రత్యేక కానుకల్ని అందించింది. ఎరుపు రంగు బాక్స్‌పై బంగారు రంగుతో వధూవరుల పేర్లు ఆ గిఫ్ట్‌పై ఉన్నాయి. లోపల ఆలూ భుజియా, మురుకులు, చిడ్వా వంటి తినుబండారాలతో పాటు ఓ వెండి నాణేన్నిఇచ్చారు. ఈ గిఫ్ట్‌లకు సంబంధించిన ఫొటోలను ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.