news

News July 11, 2024

కెప్టెన్సీకి హసరంగ గుడ్ బై

image

టీ20 కెప్టెన్సీ నుంచి శ్రీలంక సారథి వనిందు హసరంగ తప్పుకున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు ఘోర ప్రదర్శన చేయడంతోనే ఆయన తన కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో సిరీస్‌కు ముందు ఆయన తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా గతేడాది హసరంగ టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు పది మ్యాచులకు ఈ ఆల్‌రౌండర్ సారథిగా వ్యవహరించారు.

News July 11, 2024

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఖరారు

image

FY2023-24కు ఈపీఎఫ్ నిల్వలపై 8.25 శాతం వడ్డీని ఖరారు చేసినట్లు EPFO వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతోపాటు FY2024-25 ప్రారంభంలో ఫైనల్ సెటిల్‌మెంట్(రిటైర్‌మెంట్) చేసుకున్న ఉద్యోగులకు ఈ రేటు చెల్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఖాతాదారులకూ ఇదే వడ్డీ అందుతుందని పేర్కొంది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యధిక వడ్డీ అని, స్మాల్ స్కేల్ సేవింగ్స్, GPF&PPF రేట్లతో పోలిస్తే అధికమని ట్వీట్ చేసింది.

News July 11, 2024

నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ప్రకటన

image

దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. UIDAI నెట్‌వర్కింగ్‌ ఢిల్లీలోని సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని ప్రభావం తెలంగాణపైనా పడింది. దీంతో ఆధార్ ఆధారిత OTP సేవలు, రిజిస్ట్రేషన్స్ వంటి సేవలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో గురువారం నిలిచిపోయిన సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

News July 11, 2024

క్యాండీ క్రష్‌కు బానిసైన టీచర్.. సస్పెండ్ చేసిన అధికారులు

image

విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా క్యాండీ క్రష్ గేమ్‌కు బానిసైన GOVT టీచర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన UPలోని సంభాల్‌లో జరిగింది. ఇటీవల మేజిస్ట్రేట్ రాజేంద్ర ఆ స్కూల్‌లో తనిఖీ చేశారు. విద్యార్థుల పుస్తకాల్లో అన్నీ తప్పులే ఉండటంతో టీచర్‌ ప్రియమ్‌ను ప్రశ్నించారు. అతను స్కూల్ టైమ్‌లో 2 గంటలు క్యాండీ క్రష్ ఆడి, అరగంట కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో టీచర్‌పై వేటు పడింది.

News July 11, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం

image

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కాప్రాలో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, అమీర్‌పేట్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. దీంతో ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News July 11, 2024

కేటీఆర్ లేఖకు బండి సంజయ్ కౌంటర్

image

TG: నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ తనకు KTR రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘KTRకు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా? సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా చేశారు. TGకి ప్రధాని మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రకటించినపుడు మీకు సిరిసిల్ల గుర్తురాలేదా?’ అని ప్రశ్నించారు.

News July 11, 2024

భారత్-శ్రీలంక షెడ్యూల్ ఖరారు

image

భారత్-శ్రీలంక షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి టీ20, వచ్చే నెల 1 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 26న తొలి టీ20, 27న రెండో మ్యాచ్, 29న మూడో టీ20 జరగనుంది. అలాగే ఆగస్టు 1న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది. కాగా ఈ సిరీస్‌లో భారత్ హెడ్‌ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

News July 11, 2024

‘తల్లికి వందనం’పై జీవోను సవరించాలి: అంబటి రాంబాబు

image

AP: మోసాలు చేయడం CM చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన GOను సవరించాలని, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

News July 11, 2024

రోజుకు 20 గంటలు పని చేస్తానన్న OLA సీఈవో.. వైద్యుడి రిప్లై ఇదే!

image

తాను రోజుకు 20గంటలు పనిచేస్తానన్న ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ వ్యాఖ్యలపై డా. సుధీర్ కుమార్ స్పందించారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం వారానికి 55+ గంటలు పని చేయడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35%ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఇలా ఏడాదికి 8 లక్షల మంది చనిపోతున్నట్లు తెలిపారు. అధిక బరువు, ప్రీడయాబెటిస్ వస్తాయన్నారు. CEOలు తమ కంపెనీ లాభాల కోసం వారి ఉద్యోగులకు సుదీర్ఘ పని గంటలు సిఫార్సు చేయడం సరికాదన్నారు.

News July 11, 2024

వింత రూల్.. అక్కడ రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే!

image

రోజులో ఒక్కసారైనా ప్రజలు నవ్వాల్సిందేనంటూ జపాన్‌లో వింత చట్టం తెచ్చారు. ఈ మేరకు నార్త్ జపాన్‌లోని యమగట అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులిచ్చింది. నవ్వితే గుండెపోటు ముప్పు తగ్గుతుందని పరిశోధనలో తేలడంతో ఈ రూల్ పాస్ చేసింది. నెలలో 8వ రోజుని నవ్వు దినంగా జరపనుంది. పని ప్రదేశంలో ఈ రూల్ తప్పక పాటించాలంది. కాగా నవ్వాలా వద్దా అనేది వ్యక్తిగత విషయమని దీనిపై బలవంతం సరికాదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.