India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీని ఇప్పటివరకు 15 దేశాలు అక్కడి అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి. ఇటీవల రష్యా ప్రెసిడెంట్ ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు’ను PMకి అందించారు. ఈ జాబితాలో గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్, ఈజిప్టు ఆర్డర్ ఆఫ్ ది నైల్, US గవర్నమెంట్స్ లెజియన్ ఆఫ్ మెరిట్, UAE ఆర్డర్ ఆఫ్ జయేద్, సౌదీఅరేబియాస్ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజిజ్ అవార్డులున్నాయి.
AP: ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రభుత్వం పొదుపు చర్యలు చేపడుతోంది. సచివాలయాలు, కలెక్టరేట్లు, HOD ఆఫీసుల్లో అన్ని రకాల ఫర్నిచర్ కొనుగోలుపై మే 31, 2026 వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, కొత్తగా కట్టే ఆఫీసులు, రాజ్‌భవన్, హైకోర్టులకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సీఎం, డిప్యూటీ సీఎం చెబుతున్న విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ముగిశాయి. ఓ దశలో 400కుపైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా కోలుకుంది. 79,897 (-27) వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,315 వద్ద స్థిరపడింది. ONGC, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.
తల్లిదండ్రులు/ అత్తమామలతో గడపడానికి వీలుగా ఉద్యోగులకు 2 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్స్‌ను ఇవ్వనున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 6, 8 తేదీల్లో ఈ సెలవులు అందుబాటులోకి వస్తాయంది. 7న ఛత్ పూజ, 9న రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో వరుసగా 5 రోజులు లీవ్స్ వస్తాయని పేర్కొంది. వీటిని వ్యక్తిగత ఎంజాయ్‌మెంట్ కోసం ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. పేరెంట్స్, అత్తమామలు లేనివారికి ఈ సెలవులు ఉండవు.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జులై 31తో గడువు ముగుస్తుండటంతో చాలామంది ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలున్నాయని, ‘సర్వీస్ అనవైలబుల్’ అని వస్తోందని కొందరు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన IT శాఖ యూజర్లు తమ బ్రౌజర్‌లో క్యాచీని క్లియర్ చేసి మరోసారి ప్రయత్నించాలని సూచించింది.
AP: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు IPS అధికారుల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో రాయితీపై కందిపప్పు, బియ్యం అందించే రైతుబజార్ తొలి కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. ‘కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశాం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
భారతదేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం నిరంతరం పెరుగుతోందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ధనికులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని పేర్కొంది. మోదీ పేదల జేబుల్లోంచి డబ్బు కొల్లగొట్టి సంపన్నుల ఖజానా నింపుతున్నారని ఆరోపించింది. దేశంలో దాదాపు 70కోట్ల మంది నెలకు రూ.5,930, 1.4 కోట్ల మంది నెలకు రూ.4,41,666 చొప్పున సంపాదిస్తున్నారని పేర్కొంది.
TG: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. ‘నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం వారిని కింద పడేసి కొడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వాన్ని మార్చేసింది నిరుద్యోగులే అనే విషయం మర్చిపోవద్దు. కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. MP ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైంది’ అని పేర్కొన్నారు.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త కారులో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే ఖరీదైన కార్లను కలిగి ఉన్న రామ్ చరణ్ ‘Rolls Royce Spectre’ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని విలువ ఏకంగా రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే తండ్రి చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ ఉంది.
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విప్‌లు, సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.