India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను కేంద్రం అనుమతిచ్చిన రూ.47,000 కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. దీంతో కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ.7,000 కోట్ల అప్పునకు ఓకే చెప్పింది. ఇది అడ్వాన్స్ మాత్రమేనని, మిగిలింది ఇంకా ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. కాగా ఈ FYలో సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల అప్పు చేసింది.
TG: వచ్చే నెల 6 నుంచి మొదలయ్యే కులగణనకు టీచర్లను వినియోగించుకోవాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. స్కూల్ ముగిసిన తర్వాత ఒక్కో ఉపాధ్యాయుడు రోజూ 5-7 ఇళ్లలో వివరాలు సేకరించాలన్నారు. ఇందులో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు మంచి వేతనం ఇస్తామని చెప్పారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
అఫ్గానిస్థాన్‌లో మహిళల చదువు, ప్రయాణాలు, బహిరంగంగా మాట్లాడటంపై నిషేధం విధించిన తాలిబన్లు తాజాగా మరో క్రూర నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా వేళల్లో ఒక స్త్రీ గొంతు మరో మహిళకు వినిపించకూడదని, బిగ్గరగా ప్రేయర్ చేయకూడదని మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఆంక్షలు విధించారు. వారు పాటలు కూడా పాడకూడదని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలపై మానవ హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
TG: HYD రెండో దశ మెట్రో ప్రాజెక్టులో అత్యాధునిక విధానాలు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవర్ రహిత ఫోర్త్ జనరేషన్ కోచ్‌లను ప్రతిపాదించింది. ప్లాట్‌ఫామ్‌లపై స్క్రీన్ డోర్లు, స్టేషన్ల వద్ద ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్, ప్రతి కారిడార్‌కు ఒక డిపో ఉండేలా నిర్దేశించింది. రెండో దశలో 5 కారిడార్లలో ₹24,269Cr వ్యయంతో 76.4KM మేర <<14462321>>మెట్రో<<>> మార్గానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
AP: రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. జనవరి నుంచి కొత్తగా 10,82,841 మంది ఓటర్లు చేరారు. నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే జనవరి 6న తుది జాబితాను ఈసీ ప్రచురించనుంది.
ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రిటెన్షన్స్ చాలా కష్టమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎవర్ని అట్టిపెట్టుకోవాలన్నది నిర్ణయించుకోవడం ఇబ్బందేనని పేర్కొన్నారు. ‘సీజన్ అంతా అద్భుతంగా ఆడిన KKRకి కొంతమందినే రిటెయిన్ చేసుకోవడం ఈజీ కాదు. కానీ నా దృష్టిలో శ్రేయస్, ఫిల్ సాల్ట్, నరైన్, రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్‌ను ఆ జట్టు కొనసాగిస్తుంది’ అని అంచనా వేశారు.
TG: రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడకుండా అడ్డుకున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని దీనిపై ఈఆర్సీని ఒప్పించగలిగామన్నారు. విజయసూచికగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో ఇవాళ సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. 2 సాంగ్స్, 6 రోజుల టాకీ మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపాయి. హీరోహీరోయిన్లతో డైరెక్టర్ వెంకీ కుడుముల ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశాయి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. NOV మొదటి వారంలో టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
KKR బౌలర్ హర్షిత్ రాణా టెస్టులకు ఎంపికైనా రంజీ ట్రోఫీలో ఆడటం వెనుక మాస్టర్ మైండ్ ఉన్నట్లు తెలుస్తోంది. కివీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆయన ఆడాల్సి ఉంది. కానీ ఆడితే క్యాప్‌డ్ ప్లేయర్ లిస్టులో చేరేవారు. అందుకే టెస్టులకు బదులు రంజీల్లో ఆడించారు. ఎల్లుండి ఆయన పేరును రిటెన్షన్ లిస్టులో పంపుతారు. ఆ మరుసటి రోజు ఆయన మూడో టెస్టు ఆడతారు. అప్పుడు రూ.12 కోట్లకు బదులు రూ.4 కోట్లకే KKR దక్కించుకోనుంది.
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన అంటువ్యాధుల్లో కొవిడ్-19 స్థానంలో క్షయ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. గత ఏడాది కొత్తగా 82 లక్షలమంది క్షయ బారిన పడ్డారని పేర్కొంది. ‘టీబీని సమూలంగా అంతం చేయడం అంత సులువు కాదు. ఏటా ఆ వ్యాధికి ఎంతోమంది పేద దేశాల ప్రజలు బలవుతున్నారు. దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాలి’ అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.