news

News April 25, 2024

అందుకే ఓడిపోయాం: KCR

image

తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల ప్రజలను ఆదుకున్నామని KCR అన్నారు. ‘మేం అన్ని రకాల స్కీములు తెచ్చాం. ప్రజల కడుపు నింపాం. అయితే.. కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. వాటిని నమ్మి 2-3శాతం ప్రజలు అటువైపు చేయి చాచారు. కాంగ్రెస్ కూడా మరికొన్ని అదనంగా ఇస్తుందనే ఉద్దేశంతో అటువైపు ఓట్లు వేశారు. అందుకే మేం ఓడిపోయాం. మేం మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని కేసీఆర్ అన్నారు.

News April 25, 2024

‘గేమ్ ఛేంజర్‌’ కోసం చెర్రీకి భారీ రెమ్యునరేషన్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్‌’ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నటించినందుకు చరణ్ భారీ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుందని, అందుకు ఆయన మొత్తంగా కలిపి రూ.120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News April 25, 2024

మూడో దశ ఎన్నికల బరిలో ఎంతమంది అంటే?

image

మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ పేర్కొంది. కాగా ఈ స్థానాలకు మే 7న ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి 95 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నిన్న గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.

News April 25, 2024

రిజ్వాన్‌ను బ్రాడ్‌మన్‌తో పోల్చిన అఫ్రీదీ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

image

పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌.. T20 క్రికెట్లో అభినవ డాన్ బ్రాడ్‌మన్ అని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీదీ కొనియాడారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అఫ్రీదీని ఏకిపారేస్తున్నారు. ‘జోక్ ఆఫ్ ద ఇయర్’ అని కొంతమంది ఎద్దేవా చేశారు. ‘అతడు బ్రాడ్‌మన్ కాదు.. బ్రెడ్ మ్యాన్’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘రిజ్వాన్‌ను బ్రాడ్‌మన్‌తో పోల్చి.. ఆయన గౌరవాన్ని తగ్గించొద్దు’ అని ఫైర్ అవుతున్నారు.

News April 25, 2024

ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీకి బెయిల్ ఇవ్వరా?: కేసీఆర్

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వరా అని కేసీఆర్ ప్రశ్నించారు. వారు ఎక్కడికైనా పారిపోతారా అని అన్నారు. స్కామ్ విచారణ అంటూ అనవసరంగా అమాయకులను మోదీ శిక్షిస్తున్నారని దుయ్యబట్టారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై గెలిచే శక్తి లేకనే అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి, 700 మంది ప్రజాప్రతినిధులను బీజేపీలోకి లాక్కున్నారని మండిపడ్డారు.

News April 25, 2024

చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు

image

AP: తాము అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఆమదాలవలస ప్రజాగళంలో మాట్లాడిన ఆయన.. ‘ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశారు? నాగావళి, వంశధార ఇసుక విశాఖకు వెళ్తోంది. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రాష్ట్రం AP. అప్పులు ఎక్కువ ఉన్న రైతులు కూడా ఏపీలోనే ఉన్నారు. అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ప్రకటించారు.

News April 25, 2024

పీవీసీయూలో అన్ని ఇండస్ట్రీల స్టార్ నటులు: ప్రశాంత్ వర్మ

image

‘హనుమాన్’ మూవీ 100 రోజుల విజయోత్సవ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లో కొత్తవారిని పరిచయం చేస్తామని చెప్పారు. దీని కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ నటులను ఎంపిక చేస్తామన్నారు. తన సినిమా నచ్చి పలువురు నటులు యూనివర్స్‌లో భాగమవ్వాలని అడిగినట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోనూ ‘జై హనుమాన్’ మరో స్థాయిలో ఉంటుందన్నారు.

News April 25, 2024

శివమ్ దూబేకు WC టికెట్ కన్ఫామ్?

image

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్ శివమ్ దూబే (66) మరో అర్ధసెంచరీతో చెలరేగారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 311 రన్స్ బాదారు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా దూబే మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తుండటంతో అభిమానులు అతడికి టీ20 వరల్డ్ కప్‌కు టికెట్ కన్ఫామ్ అయినట్లేనని కామెంట్లు చేస్తున్నారు. తప్పకుండా టీ20 జట్టులో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

News April 25, 2024

‘KGF 1’ రీరిలీజ్

image

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ‘KGF 1’ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 27న ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. అర్చన జోయిస్, వశిష్ట ఎన్ సింహ, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు.

News April 25, 2024

ఏపీ సీఎస్‌పై చర్యలు తీసుకోవాలి: కోటంరెడ్డి

image

AP: సీఎస్ జవహర్‌రెడ్డిపై EC చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల విధులు చూడాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ <<13110732>>సీతారామాంజనేయులు <<>>గతంలో నాకు ఫోన్ చేసి పరోక్షంగా బెదిరించారు. పెన్షన్లపై ఈసీ ఆదేశాలను సీఎస్ సరిగా అమలు చేయలేదు. జవహర్ రెడ్డిని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి. వైసీపీని వీడాక నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు’ అని ఆరోపించారు.