India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడంలో తప్పులేదని, కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు ఏమాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. హామీల అమలుకు నిధులు లేక మళ్లీ అప్పులు చేయడం సరికాదని వెంకయ్య అన్నారు.
AP: ఈ ఏడాది పదో తరగతి విద్యార్థుల్లో చాలా మందికి టాప్ మార్కులు వచ్చాయి. దాదాపు 1,400 మందికి 590, ఆ పైన మార్కులు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇంత మందికి 590 మార్కులు రాలేదు. 18,000 మంది 570+ మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కూళ్లలో 104 మందికి 590 పైగా మార్కులు వచ్చాయి. ఇక అన్నమయ్య జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినికి 597 మార్కులు వచ్చాయి.
AP: సీఎం జగన్‌పై దాడి చేసిన కేసులో తీర్పును విజయవాడ కోర్టు రేపటికి రిజర్వ్ చేసింది. నిందితుడు సతీశ్‌ను ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు నేడు విచారణ చేపట్టింది.
ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్ కార్డు తప్పనిసరి. మరి అత్యవసరంగా పాన్ నంబర్ కావాలంటే ఎలా? దానికి ఐటీ విభాగం ఫ్రీగా ఇ-పాన్‌ను అందిస్తోంది. దీని కోసం https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ లింక్‌లోకి వెళ్లాలి. అక్కడి క్విక్ లింక్స్ సెక్షన్లో ఇన్‌స్టంట్ ఇ-పాన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తదనంతరం సూచించే విధంగా అనుసరిస్తే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే చాలు.. మీ పాన్ నంబర్ రెడీ.
గల్ఫ్ దేశాలను ఇటీవల వరదలు వణికించిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కాలంలో కురిసే వర్షం కొన్ని గంటల్లోనే కురవడంతో నీరు ముంచెత్తింది. ఉపగ్రహ చిత్రాల్లో ఆ తీవ్రత స్పష్టంగా కనిపించింది. నాసాకు చెందిన ల్యాండ్‌శాట్-9 తీసిన ఫొటోల్లో వరద గుంటలు నీలిరంగులో కనిపిస్తున్నాయి. కాగా.. దుబాయ్‌లో వర్షాలు కురవడం మిగిలిన ఖండాల పర్యావరణానికి అంత మంచిది కాదంటూ పర్యావరణ నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
AP: విశాఖపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది సిటీ ఆఫ్ డెస్టినీ. ఇది రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. సీఎం వచ్చి ఈ సిటీ నుంచి పరిపాలన ప్రారంభిస్తే.. ఈ నగరం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో వ్యాఖ్యానించారు.
హీరోయిన్ అపర్ణ దాస్, మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ దీపక్ పరంబోల్ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి వివాహం రేపు కేరళలోని వడక్కంచెర్రిలో జరగనుందని సమాచారం. తాజాగా అపర్ణ హల్దీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణ.. ఆదికేశవ, బీస్ట్, సీక్రెట్ హోమ్, మనోహరం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి వీరేశలింగం. పుస్తక పఠనం విజ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు పుస్తకంలోని ఒక పేజీ అయినా చదవాలని చెబుతుంటారు పెద్దలు. ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ‘బుక్స్‌ను మీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా చేసుకోండి’ అంటూ సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు.
#WorldBookDay
తప్పుడు ప్రకటనల కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడిన పతంజలిపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. బాబా రాందేవ్, బాలకృష్ణ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ ‘కోర్టును క్షమాపణ కోరుతూ పతంజలి రూ.10లక్షల ఖర్చుతో 67 న్యూస్ పేపర్లలో ప్రకటన ఇచ్చింది’ అని కోర్టుకు తెలిపారు. దీంతో ‘మీరిచ్చిన యాడ్స్ సైజ్, ఫాంట్ తరహాలోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా?’ అని SC ప్రశ్నించింది. తదుపరి విచారణను 30కి వాయిదా వేసింది.
ప్రస్తుతం దేశంలో చెలామణిలో ఉన్న యూకే, యూఎస్, యూరోపియన్ షూ సైజింగ్ సిస్టమ్స్‌ను త్వరలోనే ‘Bha’ (భా) అనే కొత్త వ్యవస్థ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష మందిపై కేంద్రం సర్వే చేసిందట. పశ్చిమ దేశాల కన్నా భారతీయుల పాదాలు కాస్త వెడల్పుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. UK/US/EU సైజులు సరిగ్గా సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. ఈ నేపథ్యంలో కొత్త సైజులతో వీటిని భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Sorry, no posts matched your criteria.