India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనకు రూ.36 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో రూ.20 కోట్లు చరాస్తులు కాగా రూ.16 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య సోనాల్ షా పేరిట రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా ఆమె వద్ద రూ.1.10 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. అమిత్ షా వార్షిక ఆదాయం రూ.75.09 లక్షలు కాగా రూ.15.77 లక్షల అప్పు ఉంది. ఆయనకు సొంత కారు లేదు. షాపై 3 క్రిమినల్ కేసులున్నాయి.
TG: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన నివాసంలో మౌన దీక్షకు దిగారు. తమ్ముడిగా భావించిన భట్టి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో రేవంత్ సీఎం అవుతారని మాట్లాడినందుకే తనపై కక్ష కట్టారన్నారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకు బయటి వారిని తీసుకొస్తున్నారని.. దీనిపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.
టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా X వేదికగా తెలియజేశారు. టెస్లాకు సంబంధించిన ముఖ్యమైన పనులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలోనే భారత్‌లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ఆసక్తి కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది.
చిలుకూరు బాలాజీ ఆలయంలో పంచే గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మి నిన్న 2లక్షల భక్తులు తరలి వచ్చారు. ప్రసాదం దొరక్క చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ప్రసాదం తింటే పిల్లలు పుడతారని నమ్ముతున్నారంటే ఆ తప్పు ప్రజలది కాదని, వాళ్లను అలా ఉంచిన పరిస్థితులదని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వరరావు అన్నారు. దీనిని దేశంలో విజ్ఞాన శాస్త్ర దారిద్య్రంగా అభివర్ణించారు.
USలో టిక్‌టాక్‌పై నిషేధానికి ఆ దేశ పార్లమెంటులో శనివారం ఓటింగ్ జరగనుంది. ఈ నిర్ణయాన్ని ట్విటర్ అధినేత మస్క్ తప్పుబట్టారు. టిక్‌టాక్‌ను నిషేధించడం వల్ల ట్విటర్‌కి ప్రయోజనం ఉన్నప్పటికీ అది సరికాదని పేర్కొన్నారు. ఇలా చేయడం వాక్‌స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం తమ పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్ ద్వారా చోరీ చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారాన్ని ఇస్తున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉండగా, బీబీ గృహనిర్బంధంలో ఉన్నారు. ‘విషపూరిత ఆహారం కారణంగా బీబీ పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తనకు ఏమైనా అయితే నేను బతికున్నంతకాలం జనరల్ అసీం మునీర్‌ను వదిలిపెట్టేది లేదు’ అని ఇమ్రాన్ పేర్కొన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.
AP: నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే.రోజా ఆస్తులు ఐదేళ్లలో 47% పెరిగాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2019లో రూ.9.3 కోట్ల ఆస్తులు ఉండగా, ఇప్పుడు రూ.13.7 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు రూ.5.9 కోట్లు, స్థిరాస్తులు రూ.7.8 కోట్లని తెలిపారు. రూ.కోటి విలువైన బెంజ్‌తో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదివానని చెప్పారు.
పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌ను పెళ్లి ఆచారాల్లో భాగంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 2015లో రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో పెళ్లి చేసుకున్న ఓ జంట ముంబైలో రిసెప్షన్ చేసుకుంది. 2020లో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది. పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా హైకోర్టుకు వెళ్లారు. అయితే.. పెళ్లి ఎక్కడ చేసుకున్నారో అక్కడే విడాకులకు దరఖాస్తు చేసుకోవాలని HC సూచించింది.
AP: కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేసే ముందు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సమయంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన వారి శుభాకాంక్షలు అందుకుని విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. నాన్న, బాబాయ్‌ని మరిచిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణంలో మార్పుల వల్ల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఇక వీకెండ్ కావడం, మరో మూడ్రోజుల పాటు వెదర్ చల్లగానే ఉంటుందని వాతావరణశాఖ చెప్పడంతో నగర ప్రజలు టూర్లు, షాపింగ్ వంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.