India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీయనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుతం సాధారణం కంటే 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు 55మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఆదివారం 44మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది’ అని తెలిపారు. శుక్రవారం గరిష్ఠంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలోగామ్ పోలింగ్ కేంద్రంలో 100% ఓటింగ్ నమోదైంది. అయితే అక్కడుంది ఒక్క ఓటరే. అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటే సామగ్రితో కొండకోనలు దాటుతూ 40km మేర నడవాల్సి ఉంటుంది. దీంతో అక్కడి ఓటర్లంతా వేరే పోలింగ్ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్నారు. సొకేలా తయాంగ్(44) మాత్రం ఇందుకు ససేమిరా అనడంతో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆమె ఓటు వేయగా 100% ఓటింగ్ నమోదైంది. <<-se>>#Elections2024<<>>
హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న సన్ రైజర్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ఢిల్లీ వేదికగా రా.7.30కి మ్యాచ్ జరగనుంది. 6మ్యాచుల్లో 4 గెలిచిన SRH 4వ స్థానంలో ఉండగా.. ఏడింట్లో 3 గెలిచిన DC 6వ స్థానంలో ఉంది. SRH చివరి 3 మ్యాచుల్లో CSK, PBKS, RCBపై గెలిచింది. బ్యాటర్లు మంచి టచ్‌లో ఉండటంతో మరోసారి భారీ స్కోర్ చేస్తుందని అంచనాలున్నాయి. SRH ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు?
TG: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల నియామక పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ (GR) జాబితాను TSPSC సైట్‌లో పొందుపొరిచారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని అధికారులు తెలిపారు. 247 లెక్చరర్ల పోస్టులకు డిసెంబర్, 2022న నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు రాత పరీక్షలు జరిగాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన తొలి దశ పోలింగ్ ముగిసింది. మొత్తం 62.37% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా మణిపుర్, బెంగాల్‌లో ఘర్షణలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. <<-se>>#Elections2024<<>>
AP: టీడీపీ నేత రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు అసెంబ్లీ సీటు ఖరారైంది. ప.గో. జిల్లా ‘ఉండి’ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ తనను ఆదేశించిందని రఘురామ తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పార్టీ నుంచి బీఫాం అందుకుని ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు.
TG: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ‘బ్యారేజీ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆ గడువు పెంచారు. కానీ నిర్మాణం మాత్రం నిర్దేశిత గడువులోనే అయిపోయిందని ఇంజినీర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిని పొరపాటుగా భావించాలని సంబంధిత ఇంజినీర్లు కోరారు’ అని నివేదికలో పేర్కొన్నారు.
TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 22 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. ఇందుకు అనుమతించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతో పాటు వివిధ వర్గాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘మన దేశం షరియా చట్టాలపై నడవాలా? వ్యక్తిగత చట్టాలపైన నడవాలా? ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ వ్యక్తిగత చట్టాలకు చోటు లేదు. మరి భారత్‌లో ఎందుకున్నట్టు? పలు ముస్లిం దేశాలే షరియా చట్టానికి దూరంగా ఉంటున్నాయి. మనమూ ముందడుగు వేయాలి’ అని తెలిపారు.
బలమైన సైన్యం ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదే సైబర్ సైన్యం. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్‌గా పిలిచే ఈ విభాగానికి యుద్ధాలను గెలిపించే సామర్థ్యం ఉందని డ్రాగన్ భావిస్తోంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.