India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు.. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ నంద్యాల(D) గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం(D) తుమ్మికపల్లిలో43.3 డిగ్రీలు, ఆముదాలవలసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది.
TG: బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలన టీవీ సీరియల్ ఎపిసోడ్‌లా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలేనని ఆరోపించారు.
వాంఖడే స్టేడియంలో చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది. రోహిత్ శర్మ సెంచరీ (63 బంతుల్లో 105 రన్స్) బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇషాన్ కిషన్ 23, తిలక్ వర్మ 31 రన్స్ చేయగా.. సూర్యకుమార్ (0), పాండ్యా (2) నిరాశపర్చారు. చెన్నై బౌలర్లలో పతిరణ నాలుగు వికెట్లతో చెలరేగారు. తుషార్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.
TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ధాన్యం పండించే రైతులకు రూ.500 బోనస్ ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు లాభం జరిగితే తాము సంతోషిస్తామని, ఈసీకి ఫిర్యాదు చేయబోమని స్పష్టం చేశారు. ప్రజలు కేసీఆర్, కాంగ్రెస్ పాలనకు తేడాను గమనించాలని కోరారు.
TG: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం తాము పోరాటం చేస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు సూచించారు. ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ BRS ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపునకు కృషి చేయాలని ఆదేశించారు.
టీ20 క్రికెట్(లీగ్+ఇంటర్నేషనల్)లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. 500 సిక్సర్లు బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ చెన్నైపై 3 సిక్సులు కొట్టడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఓవరాల్‌గా 1,056 సిక్సులతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పొలార్డ్(860), ఆండ్రూ రస్సెల్(678), కొలిన్ మున్రో(548) ఉన్నారు.
సెబీలో 97 ఆఫీసర్ గ్రేడ్-A ఉద్యోగాలకు నిన్న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని సంస్థ తెలిపింది. ఈ పోస్టులకు జనరల్, లీగల్, ఐటీ, ఇంజినీరింగ్, రీసెర్చ్ విభాగాల్లో UG/PG పూర్తిచేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా నియామకం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,49,000 జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఎంపీ అభ్యర్థి అప్పులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అరక్కోణం పార్లమెంట్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్.జగద్రక్షకన్ తనకు రూ.649.50 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో తర్వాతి స్థానాల్లో శివగంగై బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ.98.30కోట్లు, వేలూరు డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ రూ.51.61కోట్ల అప్పులున్నట్లు వెల్లడించారు.
ORMAX Media సర్వే ప్రకారం IPL-2024లో మూడో వారంలోనూ మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచారు. తొలి రెండు వారాలు కూడా ధోనీనే మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తనదైన స్టైల్‌లో సిక్సర్లు బాది ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందించారు. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారని, అలాగే మోదీ కూడా ప్రవర్తిస్తున్నారని శరద్ పవార్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఎవరూ గెలవొద్దని ఆయన కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో పుతిన్, మోదీ తీరు ఒకటేనన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ మాదిరే ప్రతిపక్షం కూడా ముఖ్యమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.