India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్ర యోజన కింద లోన్ల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని, భవిష్యత్తులో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లు ఉచిత రేషన్ అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ‘సంకల్ప్ పత్ర’ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్‌నాథ్ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నాలుగు స్తంభాలతో ‘సంకల్ప్ పత్ర’కు పునాదులు వేసినట్లు చెప్పారు. ఇవాళ శుభదినమని.. ఐదు రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటున్నామన్నారు. గత పదేళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామన్నారు. అనేక మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. తక్షణమే హింసను విడనాడాలని కోరింది. యుద్ధ పరిస్థితిని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది.
TG: విద్యుత్ షాక్‌తో మరణిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంది. విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవడం, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు ఈ పరిహారం అందజేస్తుంది. ఎఫ్ఐఆర్, పంచనామా రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ సంబంధిత డాక్యుమెంట్లను విద్యుత్ కార్యాలయంలో సమర్పిస్తే ఏఈ, డీఈ విచారణ ఆధారంగా పరిహారాన్ని పొందవచ్చు. శాఖ పరమైన తప్పిదాల వల్ల మరణిస్తేనే పరిహారం చెల్లిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీ TVల్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 21న సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
బీజేపీ ‘సంకల్ప పత్ర’ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది.
* విశ్వబంధు *సురక్షిత భారత్ *సమృద్ధ భారత్ * గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ * ప్రపంచ స్థాయి మౌలిక వసతులు *ఈజ్ ఆఫ్ లివింగ్ * సాంస్కృతిక వికాసం *సుపరిపాలన * స్వస్థ భారత్ *అత్యుత్తమ శిక్షణ *క్రీడా వికాసం *సంతులిత అభివృద్ధి *సాంకేతిక వికాసం *సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.
పంజాబ్ కింగ్స్ వైస్ కెప్టెన్సీపై గందరగోళం నెలకొంది. తొలుత కెప్టెన్ శిఖర్ ధవన్ అందుబాటులో లేకపోవడంతో IPL ట్రోఫీ ఫొటోషూట్‌కు జితేశ్ శర్మను వైస్ కెప్టెన్‌గా పంపారు. నిన్న RRతో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ఆడలేదు. ఆయన స్థానంలో సామ్ కరన్ కెప్టెన్సీ చేపట్టారు. జితేశ్‌ను పక్కనబెట్టారు. దీనిపై కోచ్ బంగర్ స్పందించారు. ‘మా VC కరనే. ఫొటోషూట్ సమయంలో కరన్ అందుబాటులో లేకపోవడంతో జితేశ్‌ను పంపాం’ అని స్పష్టం చేశారు.
AP: సీఎం జగన్ మీద దాడి ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై దాడి వెనక టీడీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హింస ద్వారా TDP అధికారంలోకి రావాలని చూస్తోందని దుయ్యబట్టారు. సీఎంపై దాడి హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఈసీ సమగ్ర విచారణ జరపాలని కోరారు.
ప్రధాన పరిపాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ కోసం ప్రధాని మోదీ సమయాన్ని కేటాయిస్తారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. దేశ అభివృద్ధే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. అంబేడ్కర్ బాటలోనే తాము పయనిస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తామన్నారు.
AP: ఎన్నికల వేళ CM జగన్‌పై దాడి ఘటన YCP, TDP మధ్య మాటల మంటలు రాజేసింది. ఇది కచ్చితంగా తెలుగుదేశం కుట్రేనని, ఘటన జరిగిన ప్రాంతం దగ్గర్లోనే ఓ టీడీపీ నేత ఆఫీస్ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్.. ఇప్పుడు రాయితో తనపై తానే దాడి చేయించుకున్నారని టీడీపీ విమర్శిస్తోంది. వైసీపీ, టీడీపీ పరస్పర ట్వీట్లతో Xలో #JaganMohanReddy హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Sorry, no posts matched your criteria.