news

News April 11, 2024

టీనేజర్ల రక్షణ కోసం ఏఐ: మెటా

image

ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్స్‌టార్షన్/లైంగిక వేధింపులు నుంచి టీనేజర్లకు రక్షణగా ఏఐ టూల్ లాంచ్ చేయనున్నట్లు మెటా వెల్లడించింది. న్యూడిటీ ప్రొటెక్షన్ అనే టూల్‌ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. మెసేజింగ్‌ ద్వారా మైనర్లకు అసభ్యకర ఫొటోలు వస్తే వాటిని గుర్తించి బ్లర్ చేసేలా టూల్‌ను డిజైన్ చేస్తున్నట్లు వివరించింది. దీంతో యూజర్లకు అనవసర కంటెంట్ కనపడదని, వారికి ఆ ఇమేజ్ చూడాలా? వద్దా అనే ఛాయిస్ ఉంటుందని తెలిపింది.

News April 11, 2024

టీటీడీ ఛైర్మన్ భూమనపై ఈసీకి ఫిర్యాదు

image

AP: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఛైర్మన్‌గా భూమనను తొలగించాలని కోరారు. టీటీడీ ఉద్యోగులను ఆయన స్థలాలు, అలవెన్సుల పేరుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో బీజేపీ, జనసేన నేతలు పేర్కొన్నారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలోని నకిలీ ఓట్లను తొలగించాలని కోరారు.

News April 11, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. 2 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

News April 11, 2024

వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

image

AP: రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము కూటమిగా ఏర్పడినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్‌ను ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తున్నాం. వాలంటీర్లలో కొందరే తప్పులు చేశారు. కొన్ని పండ్లు చెడిపోతే బుట్టలో మిగతా పండ్లు చెడిపోతాయి. వాలంటీర్లకు అధికారంలోకి రాగానే రూ.10వేలు వేతనం ఇస్తాం. వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’ అని పవన్ సూచించారు.

News April 11, 2024

నా 14ఏళ్ల నుంచి ఉపవాసం ఉంటున్నా: నోరా

image

తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం మాత్రం మానేయనని బాలీవుడ్ నటి నోరా ఫతేహీ అన్నారు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని, ఆ పాపాలను కడుక్కోవడానికే దేవుణ్ని ప్రార్థిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ‘నా 14ఏళ్ల నుంచి నేను రంజాన్ ఉపవాసం ఉంటున్నా. అది నాలో చొచ్చుకుపోయింది’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

News April 11, 2024

‘బ్యాడ్మింటన్ ఆసియా’లో ముగిసిన భారత్ ప్రయాణం

image

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణోయ్ ఓటమిపాలయ్యారు. చైనాకు చెందిన సిక్స్త్ సీడ్ హాన్ యువే చేతిలో సింధు పోరాడి 18-21, 21-13, 17-21 తేడాతో ఓడారు. దీనికి ముందు ఆమెతో 5సార్లు తలపడిన సింధు ఎప్పుడూ ఓడిపోలేదు. ఇక సెవెన్త్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణోయ్, తైపీకి చెందిన అన్‌సీడెడ్ లిన్ చున్-యీ చేతిలో 43 నిమిషాల్లోనే ఓడిపోయారు.

News April 11, 2024

నరసరావుపేటలో సమవుజ్జీల సమరం

image

AP: రాజకీయ హేమాహేమీలు పోటీ చేసి గెలుపొందిన పార్లమెంట్ స్థానం పల్నాడు(D) నరసరావుపేట. ఈసారి ఇక్కడ సమవుజ్జీల పోటీ ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్ యాదవ్‌ను YCP బరిలోకి దింపింది. గతంలోనూ నెల్లూరు జిల్లా నేతలు ఇక్కడ పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉంది. ఇటు TDP నుంచి లావు కృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు. విజయంపై ఇద్దరు నేతలూ ధీమాగా ఉండగా.. యాదవ వర్గం ఓట్లు కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 11, 2024

ఓ దశలో కెనడా వెళ్లిపోదాం అనుకున్నా: బుమ్రా

image

ప్రస్తుతం టీమ్‌ఇండియాకు కీలక బౌలర్‌గా ఉన్న బుమ్రా ఓ దశలో కెనడాలో స్థిరపడాలని అనుకున్నారట. ఆయన భార్య సంజనా గణేశన్‌తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నా కెరీర్ తొలినాళ్లలో క్రికెట్ కలిసి రాకుంటే ఫ్యామిలీతో సహా కెనడా వెళ్లిపోయి అక్కడ బంధువుల వద్ద ఉండి చదువుకుందామని అనుకున్నా. కానీ అమ్మ దేశాన్ని విడిచిపెట్టేందుకు ఇష్టపడలేదు. అదృష్టవశాత్తు నాకు అవకాశాలు వచ్చాయి’ అని తెలిపారు.

News April 11, 2024

మా అన్నయ్య స్కిల్స్ నేర్పించారు.. అందుకే ఇక్కడ నిలబడ్డా: పవన్

image

AP: తన అన్నయ్య చిరంజీవి మార్షల్ ఆర్ట్స్, నటన అనే స్కిల్స్ నేర్పించడం వల్లే ఇవాళ తాను ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని పవన్ చెప్పారు. ‘ఆ స్కిల్స్ నన్ను కోట్ల మంది ముందు నిలబెట్టాయి. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే యువత సొంతంగా సంపాదించుకుంటారు. అందుకే యువత నైపుణ్యాలు మెరుగుపర్చేలా కష్టపడుతున్నాం. సంక్షేమ పథకాలూ ఏవీ ఆపం. మరో పది రూపాయలు ఎక్కువే ఇస్తాం’ అని హామీనిచ్చారు.

News April 11, 2024

త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు: పవన్

image

AP: టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి త్రివేణి సంగమంలా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాయని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ‘యువతకు భరోసా ఇవ్వడానికి, ఈ ప్రాంతానికి కొబ్బరి బోర్డు తీసుకురావడానికి కృషి చేస్తాం. కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి. 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు, రైతు కన్నీరు తుడిచేలా కూటమి అండగా నిలుస్తుంది. రైతుభరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు.