news

News April 11, 2024

ఒక్క పోస్ట్.. కిరీటాన్ని కోల్పోయిన బ్యూటీ క్వీన్!

image

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఓ బ్యూటీ క్వీన్ తన కిరీటాన్ని కోల్పోయేలా చేసింది. 2023 మలేషియా అందాల పోటీల విజేత నికాహ్ టెరిన్సిప్. ఇటీవల హాలిడే ట్రిప్ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన ఈమె.. పొట్టి దుస్తులు ధరించి కొందరు వ్యక్తులతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె క్షమాపణలు తెలిపి టైటిల్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

News April 11, 2024

కవితకు నిరాశ

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై అత్యవసర విచారణ చేయాలని ఆమె లాయర్ సీబీఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తక్షణం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి మనోజ్ కుమార్ తెలిపారు. కేసు గురించి తనకు ఎలాంటి విషయాలు తెలియవన్న జడ్జి.. తన ఎదుట అత్యవసర తీర్పులపైనే వాదనలు జరుగుతాయన్నారు. రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేయాలని కవిత తరఫు లాయర్‌కు సూచించారు.

News April 11, 2024

మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

image

మెటా వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్‌బోట్‌తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. మరి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

News April 11, 2024

రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్

image

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌కి గౌరవ డాక్టరేట్ దక్కనుంది. చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా చరణ్ పాల్గొననున్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 11, 2024

ఏపీలో రూ.100కోట్ల విలువైన సొత్తు జప్తు

image

AP: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, సొత్తును జప్తు చేశామని ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. వీటిలో మద్యం, డ్రగ్స్, ఆభరణాలు వంటివి ఉన్నాయన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు పలు తనిఖీ కేంద్రాల ద్వారా నగదు రవాణాపై కన్నేసి ఉంచామని తెలిపారు. గడచిన 24 గంటల్లోనే రూ.1.97కోట్ల విలువైన సొత్తును జప్తు చేశామని పేర్కొన్నారు.

News April 11, 2024

జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలి: కూటమి నేతలు

image

AP: మద్యంపై సీఎం జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారని కూటమి నేతలు ఆరోపించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్.. దానినే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలైపోయారని ఘాటుగా విమర్శించారు. మద్య నియంత్రణను తమ కూటమి సాధ్యం చేస్తుందని బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు చెప్పారు.

News April 11, 2024

కవిత అరెస్టుపై కోర్టుకు వెళ్లనున్న లాయర్లు

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆమె లాయర్ మోహిత్ రావు కోర్టును ఆశ్రయించనున్నారు. ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రంజాన్ కారణంగా కోర్టుకు సెలవు ఉండటంతో డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ దాఖలు చేయనున్నారు.

News April 11, 2024

నార్మల్ వాటర్ ఇవ్వలేదని హోటల్‌కు రూ.5వేలు ఫైన్!

image

కస్టమర్‌కు ఉచితంగా నీరు అందించకపోవడంతో హైదరాబాద్‌లోని జిల్లా వినియోగదారుల కోర్టు రూ.5 వేలు ఫైన్ వేసింది. కస్టమర్ నార్మల్ వాటర్ ఇవ్వాలని కోరగా.. కేవలం వాటర్ బాటిల్స్ ఉంటాయని చెప్పారు. అతను వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయగా.. GST, సర్వీస్ ఛార్జీలతో పాటు రూ.5వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. GHMC పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఉచితంగా శుద్ధి చేసిన నీటిని అందించాలనే రూల్ ఉంది.

News April 11, 2024

RTI కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు చెప్పలేం: SBI

image

సమాచారహక్కు చట్టం కింద ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించడం కుదరదని SBI తెలిపింది. ఇందులో వ్యక్తిగత సమాచారం ఉన్నాయని తమపై విశ్వాసంతో ఇచ్చిన వివరాలను బహిర్గతం చేయడం సబబు కాదని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఈ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పలు వివరాలు బహిర్గతమయ్యాయి. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు SBI ఈసీకి ఆ వివరాలు సమర్పించింది.

News April 11, 2024

IPL.. మిగతా జట్లకు గిల్ వార్నింగ్

image

తాము బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ఇతర జట్లు గుర్తు పెట్టుకోవాలని గుజరాత్ కెప్టెన్ గిల్ హెచ్చరించారు. ‘లక్ష్యమెంతైనా చివరి వరకు పోరాడుతాం. ప్రత్యర్థులు GTని తేలిగ్గా తీసుకోవద్దు. నిన్నటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 45 రన్స్ చేయడం కష్టమేమీ కాదు. ఇద్దరు బ్యాటర్లు 9 బంతుల్లో 22 రన్స్ చేయాలి. ఓవర్‌లో 2 లేదా 3 బంతులను ఎటాక్ చేస్తే చాలు. రషీద్ ఖాన్, తెవాటియా అదే చేశారు’ అని కొనియాడారు.