India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పెన్షన్ల పంపిణీ విషయంలోనూ జగన్ శవరాజకీయాలు చేశారని TDP చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి పాలిస్తున్నారు. మేము అన్యోన్యంగా ఉన్నా.. కావాలని కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. YCP MLC అనంతబాబు తన డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారు. YCP మళ్లీ వస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ చేస్తుంది. రాష్ట్రంలో విధ్వంసమే జరుగుతుంది’ అని ఆరోపించారు.
AP: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ పరీక్షకు 4,04,037 (87.17శాతం) మంది హాజరయ్యారు. కాగా జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈనెల 22న ప్రధాని మోదీతో మస్క్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం భారత్‌లో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై మస్క్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందట. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చివరగా మోదీ-మస్క్ గతేడాది జూన్‌లో కలిశారు. మరోవైపు మహారాష్ట్రలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జగన్ గొడ్డలి వేటుకు APలో బలి కానివారు ఉన్నారా? అని నిడదవోలు సభలో చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఒక్క రైతైనా బాగుపడ్డారా? పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా? పెట్రోల్, నిత్యావసరాలు, విద్యుత్ ధరలు పెంచారు. మా కూటమికి అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం. జగన్ చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి NDAకు ఉంది’ అని అభిప్రాయపడ్డారు.
భారత్-చైనా మధ్య సత్సంబంధాలు ఉండటం ఇరు దేశాలకే కాక ప్రపంచానికీ అవసరమన్నారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక చర్చలతో ఇరు దేశాల మధ్య తిరిగి శాంతిని నెలకొల్పవచ్చని ఆకాంక్షించారు. క్వాడ్ కూటమి ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసినది కాదన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించుకున్న మోదీ.. అక్కడి ప్రజలకు జీవితాలపై సరికొత్త ఆశలు చిగురించాయన్నారు. న్యూస్‌వీక్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి(24), బట్లర్(8) విఫలమయ్యారు. ఆ తర్వాత సంజూ శాంసన్ (68), రియాన్ పరాగ్(76) సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. చివర్లో హెట్మయిర్ రాణించడంతో(5 బంతుల్లో 13) రాజస్థాన్ 196 పరుగుల స్కోర్ సాధించింది. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.
AP: రాష్ట్రంలో రౌడీరాజ్యం పోవాలని, రామరాజ్యం రావాలని జనసేన అధినేత పవన్ ఆకాంక్షించారు. నిడదవోలు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ‘గోదావరి జలాలను ఈ ప్రాంతానికి అందిస్తాం. యువత కోసం ఇండోర్ స్టేడియం నిర్మిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి టిడ్కో ఇళ్లు నిర్మిస్తాం. ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం. ఐదుగురి చేతిలో రాష్ట్రం నలిగిపోతుంది. YCP పాలనలో జగన్ చెల్లెళ్లకే న్యాయం జరగడం లేదు’ అని ఫైరయ్యారు.
టెక్ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల్లో 31శాతం మంది మరో 12 నెలల్లో తమ ఉద్యోగాలకు రాజీనామా చేయనున్నట్లు స్కిల్‌సాఫ్ట్ సంస్థ నివేదిక వెల్లడించింది. కంపెనీ యాజమాన్యంపై 40% మంది, గ్రోత్ లేదా ట్రైనింగ్ లేకపోవడంతో 39%, మెరుగైన జీతం లేక 26% మంది అసంతృప్తితో ఉన్నారట. 85% మంది మహిళలు తాము లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారట. 2023 సెప్టెంబరు-2024 జనవరి మధ్య సంస్థ ఈ ఆన్‌లైన్ సర్వే చేపట్టింది.
AP: సిద్ధం అంటూ తాను చేసిన ట్వీట్‌పై క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టత ఇచ్చారు. ‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్దాం’ అని ట్వీట్ చేశారు. కాగా తొలుత వైసీపీలో చేరిన అంబటి.. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ పార్టీని వీడి జనసేన అధినేతను కలిశారు. ఆ తర్వాత సిద్ధం అని ట్వీట్ చేయడంతో తిరిగి వైసీపీ గూటికి వెళ్తారనే ప్రచారం జరగ్గా.. తన ట్వీట్‌తో రాయుడు క్లారిటీ ఇచ్చారు.
TG: దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా స్పందించడం లేదని.. త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.
Sorry, no posts matched your criteria.