news

News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. BJP నేతలు బీఎల్ సంతోష్, తుషార్‌లకు నోటీసులు ఇచ్చేందుకు BRS నేతకు చెందిన విమానంలో అప్పటి సిట్ అధికారులు ఢిల్లీ, కేరళ వెళ్లినట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News April 4, 2024

అవనిగడ్డ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

image

AP: కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటించనున్న ఆయన.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు చేయనున్నారు. టీడీపీకి చెందిన బుద్ధప్రసాద్ ఇటీవలే జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.

News April 4, 2024

CM కేజ్రీవాల్‌కు ఊరట

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు కోర్టులో ఊరట లభించింది. జైలులో ఉన్న ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కేజ్రీవాల్‌కు కలిగింది.

News April 4, 2024

నాతో రేప్ సీన్ చేయనని హీరోయిన్ ఏడ్చింది: రంజిత్

image

అలనాటి నటి మాధురీ దీక్షిత్ తనతో రేప్ సీన్‌లో నటించలేనని బోరున ఏడ్చేశారని వెటరన్ యాక్టర్ రంజిత్ వెల్లడించారు. 1989లో వచ్చిన రొమాంటిక్ మూవీ ‘ప్రేమ్ ప్రతిజ్ఞ’లో మిథున్ చక్రవర్తి, మాధురి జంటగా నటించారు. ఈ సినిమాలో రంజిత్ హీరోయిన్‌ను తోపుడు బండిపై రేప్ చేసే సీన్ ఉంటుంది. అయితే.. ఆ సీన్ చేయమని డైరెక్టర్ అడగ్గా.. మాధురి ఏడ్చి, ఆ సీన్‌లో నటించలేనని వేడుకున్నారట. బతిమాలితే చివరికి ఒప్పుకున్నారట.

News April 4, 2024

FakeNews: వార్తల వెరిఫికేషన్ చాలా సులువు

image

Way2News లోగోతో కొందరు తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. వీటిని నమ్మినా, షేర్ చేసినా మనం ఇబ్బందులు పడవచ్చు. మేము పబ్లిష్ చేసే ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఫార్వర్డ్ ఆర్టికల్ కన్పించాలి. లేదంటే మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ మాది కాదు అని గ్రహించండి. మీరు Way2News లోగోతో ఫేక్ వార్తలు పొందితే ఈ-మెయిల్‌లో రిపోర్ట్ చేయండి. grievance@way2news.com -ధన్యవాదాలు

News April 4, 2024

పృథ్వీషాపై లైంగిక ఆరోపణలు.. విచారణకు ఆదేశం

image

క్రికెటర్ పృథ్వీ షాపై సప్న గిల్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన లైంగిక ఆరోపణలపై విచారణ చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. జూన్ 19లోపు నివేదిక అందజేయాలని తెలిపింది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను పృథ్వీషా గతంలోనే ఖండించారు. కాగా గతేడాది ఫిబ్రవరిలో షా, సప్నల మధ్య గొడవ జరిగింది. షాపై దాడి చేసినందుకు సప్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

News April 4, 2024

ఇది సిగ్గుపడాల్సిన విషయం: KTR

image

TG: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పరిధిలోని నందికొండ హిల్ కాలనీ మంచినీటి ట్యాంకులో కోతులు పడి <<12985788>>చనిపోయిన<<>> ఘటనపై కేటీఆర్ స్పందించారు. ‘మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన విషయం ఇది. మంచినీటి ట్యాంకుల శుభ్రత, సాధారణ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజారోగ్యం కంటే రాజకీయాలే ముఖ్యం. ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది’ అని దుయ్యబట్టారు.

News April 4, 2024

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ గుడ్ బై?

image

ఐపీఎల్-2024 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టును వీడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నారట. హార్దిక్ కెప్టెన్సీపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నారని ఓ MI ప్లేయర్ చెప్పినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న మెగా ఆక్షన్‌లో హిట్‌మ్యాన్ పాల్గొంటారని తెలిపాయి. 5 ట్రోఫీలు అందించిన రోహిత్‌ను కాదని పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడం పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

News April 4, 2024

ప్రపంచ ‘పెద్ద మనిషి’ ఇక లేరు

image

ప్రపంచంలో ‘పెద్ద మనిషి’గా పేరున్న జువాన్ విసెంటే పెరెజ్ మోరా కన్నుమూశారు. వెనిజులాకు చెందిన ఆయన వయసు 114ఏళ్లు. మోరా 112ఏళ్లప్పుడు ప్రపంచంలో బతికి ఉన్న ఓల్డెస్ట్ మ్యాన్‌గా 2022లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఆయనకు 11మంది సంతానం. 2022నాటికి అతడికి మనుమలు 41, మునిమనుమలు 18, మునిమనుమల పిల్లలు 12 మంది ఉన్నారు. 9ఏళ్ల వయసులోనే తండ్రితో వ్యవసాయం చేయడం ప్రారంభించారని గిన్నిస్ సంస్థ తెలిపింది.

News April 4, 2024

కూటమిలో విశాఖ లోక్‌సభ సీటు లొల్లి

image

AP: విశాఖ లోక్‌సభ స్థానంలో పోటీపై కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత రానట్లు తెలుస్తోంది. ఈ సీటును బీజేపీ తీసుకోవాలని, జీవీఎల్ నరసింహారావును అభ్యర్థిగా ప్రకటించాలని కమలం నేతలు ఢిల్లీలో పంచాయితీ పెట్టారు. ఈ మేరకు నిన్న జేపీ నడ్డాకు కూడా లేఖ రాసిన నేతలు.. విశాఖ సీటుపై రాష్ట్ర నాయకత్వం గట్టిగా పట్టుబట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఈ స్థానంలో టీడీపీ భరత్‌కు టికెట్ ఇచ్చింది.