India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమని జనసేన నేత నాగబాబు Xలో విమర్శించారు. దీనికి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘సామాన్యులను చట్టసభలకు పంపే వ్యక్తి మా జగనన్న. పొత్తు లేనిదే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి నీ తమ్ముడు పవన్‌ది. నువ్వు అనకాపల్లి నుంచి పారిపోయావు. నీకు ఏం తెలుసని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావ్?’ అని కౌంటర్ ఇచ్చారు.
రెండు IPL మ్యాచ్‌లను BCCI రీ షెడ్యూల్ చేసింది. ఈ నెల 17న కోల్‌కతాలో జరగాల్సిన KKR, RR మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా నిర్వహించనుంది. ఈ నెల 16న ఇది జరగనుంది. ఈ మ్యాచ్ ఒక రోజు ముందుకు జరగడంతో ఈ నెల 16న GT, DC మధ్య జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ అయింది. దీనిని ఈ నెల 17న నిర్వహించనున్నారు. కాగా శ్రీరామ నవమి సందర్భంగా మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని బెంగాల్ పోలీసులు తెలపడంతో BCCI మ్యాచ్ తేదీలు మార్చింది.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక వంటిది. వెన్నెముక విరిగితే మనిషి పని చేయలేడు. మేడిగడ్డ పరిస్థితి కూడా అంతే. అక్కడి నుంచి నీళ్లు కిందికి వదిలింది కేసీఆర్ ప్రభుత్వమే. మిగతా పిల్లర్లకు ప్రమాదమని, నీళ్లు వదలాలని కేంద్ర బృందం చెప్పింది. అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది’ అని చెప్పారు.
AP: రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం(పరమేశ్వర్), పల్నాడు(రవిశంకర్ రెడ్డి), చిత్తూరు(జాషువా), అనంతపురం(అన్బురాజన్), నెల్లూరు(తిరుమలేశ్వర్) ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుని బదిలీ చేసింది. అలాగే ముగ్గురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఎస్పీలపైనా చర్యలు తీసుకుంది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 9కి చేరింది. గంగాలూరు పీఎస్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు మరణించారు. తుపాకులతో పాటు భారీ ఎత్తున ఆటోమెటిక్ వెపన్స్ సీజ్ చేశారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘పుష్ప-2’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక పుష్ప-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానుంది.
మహిళల క్రికెట్‌లో ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో బంగ్లాదేశ్ ప్లేయర్ ఫరీహా ఇస్లామ్ త్రిస్న హ్యాట్రిక్ సాధించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4, 5, 6 బంతులకు వికెట్లు తీశారు. మొత్తంగా 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. కెరీర్‌లో ఆమెకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. ఆసీస్ 161/8 స్కోర్ చేయగా, ఛేజింగ్‌లో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 103/9 స్కోర్ చేసి జట్టు ఓడిపోయింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో జరగనున్న తొలి లోక్‌సభ ఎన్నికలు కావడంతో అక్కడి ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొంది. జమ్మూలో పట్టు సాధించిన BJP కశ్మీర్‌లోనూ ఖాతా తెరవాలనుకుంటోంది. గుజ్జర్లు, ST వర్గంలో చేర్చినందుకు పహారీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేది బీజేపీ అంచనా. అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో వీరి ఓటు బ్యాంక్ ఎక్కువ. బారాముల్లాలో సైతం వీరి ఓటు బ్యాంక్ ఉంది.
<<-se>>#Elections2024<<>>
ఇక శ్రీనగర్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలు నేషనల్ కాన్ఫరెన్స్ గుప్పిట్లో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ మరోసారి ఇక్కడ గెలవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో NC, PDP భాగమైనా.. సీట్ల పంపిణీకి NC ససేమిరా అంటోంది. అనంతనాగ్ సీటు పీడీపీకి కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరి పోరుకు సిద్ధమైంది.
<<-se>>#Elections2024<<>>
ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పీడీపీ ఒంటరి పోరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ NC, PDPలు… సమర్థిస్తూ BJP కశ్మీర్‌లో పోటీకి దిగనున్నాయి. మరోవైపు జమ్మూలో ఈసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. లద్ధాక్‌లో స్థానికుల నిరసన ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రైట్స్‌పై స్థానికులు పోరాడుతున్నారు.
<<-se>>#Elections2024<<>>
Sorry, no posts matched your criteria.