India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లోని తాషీగంగ్‌లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లున్నారు. ఆ రాష్ట్రంలో 10 వేల నుంచి 12 వేల అడుగుల ఎత్తులో ఏకంగా 65 పోలింగ్ కేంద్రాలు, 12 వేల అడుగులకు పైగా ఎత్తులో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు అధికారులు రెండు రోజుల మందుగానే చేరుకుంటారు.
<<-se>>#ELECTIONS2024<<>>
తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆఫీసులు భవనాలను, అతిథి గృహాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కొనసాగించాలనుకుంటే అద్దె కట్టక తప్పదు. ఖాళీ చేయడమా లేక అద్దె చెల్లించి ఉండటమా అనే అంశంపై ఏపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూన్ 2 నాటికి ఏపీలో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఛాన్స్ లేని నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
TG: ఇంటర్ పరీక్షల సమయంలో అదనంగా పనిచేసిన సిబ్బందికి ఓవర్ టైమ్(OT) అలవెన్స్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది దీన్ని నిలిపివేయగా, ఉద్యోగుల వినతితో ఈ ఏడాది నుంచి ఇవ్వడానికి అంగీకరించింది. పబ్లిక్ పరీక్షల సమయంలో 40 రోజులు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్‌లో 30 రోజులు కలిపి మొత్తం 70 రోజులకు బేసిక్ పే, డీఏతో ఓటీ అలవెన్స్ ఇవ్వనుంది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
TG: ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆత్రం సుగుణకు దక్కింది. ఉట్నూర్ జడ్పీ పాఠశాలలో SAగా పని చేసిన ఆమె.. మరో 13 ఏళ్ల సర్వీసు ఉండగానే రాజకీయాలపై ఆసక్తితో ఈ నెల 12న రాజీనామా చేశారు. టీచర్ కాకముందు MPTCగా పని చేశారు. సుగుణ భర్త కూడా టీచరే. ఈమె తెలంగాణ ఉద్యమంతో పాటు ఉపాధ్యాయ, ఆదివాసీ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారు. మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు టికెట్ దక్కడానికి కలిసివచ్చాయి.
ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్లు/ఫ్లాట్ల విక్రయాలు 14 శాతం వృద్ధి చెందినట్లు ‘అనరాక్’ వెల్లడించింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే సగటు ధరలు 10-32 శాతం పెరిగాయని తెలిపింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 38 శాతం వృద్ధి నమోదవగా, ఆ తర్వాత ముంబై(24%), పుణె(15%), బెంగళూరు(14%) ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఢిల్లీలో 9 శాతం, చెన్నైలో 6 శాతం తగ్గుదల నమోదైంది.
తూర్పు ఆఫ్రికా నుంచి 14-17 శతాబ్దాల్లో ‘సిద్దీలు’ అనే తెగకు చెందిన వారు మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో వీరు జంజీరా ద్వీపాన్ని పాలించారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, గుజరాత్‌లోని జఫ్రాబాద్, కఠియవాడ్ వీరి అధీనంలో ఉండేవి. వారి వారసుల్లో దాదాపు 3,500 మంది ఓటర్లున్నారు. వీరికోసం గుజరాత్ సోమనాథ్ జిల్లాని గిర్ అడవుల్లో అధికారులు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు.
<<-se>>#ELECTIONS2024<<>>
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. జమ్మూకశ్మీర్‌లో APR 6న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, మిగతా రాష్ట్రాల్లో 5వ తేదీనే స్క్రూటినీ నిర్వహిస్తారు. అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, యూపీ, బెంగాల్, మణిపుర్, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా ₹3,975 కోట్ల రాబడి సాధించి విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2018-19లో ₹3,875 కోట్ల ఆదాయం సాధించగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయ్యింది. సరకు రవాణాలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా 19.36 మి.టన్నుల బొగ్గు, 6.68 మి.టన్నుల ఎరువులను రవాణా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
TG: రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 3 నెలల పాటు ట్రైనింగ్, 45 రోజుల ఫీల్డ్ శిక్షణ ఉంటుందని చెప్పారు. మొత్తం 614 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 555 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. వీరికి ఫిబ్రవరి 14న నియామక ఉత్తర్వులు ఇవ్వగా, ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనా కంటే వేగంగా వ్యాపించే ఫేక్ న్యూస్‌ను వెంటనే అడ్డుకుందాం. Way2News లోగోతో కొందరు ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. మా వార్తల వెరిఫికేషన్ చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను యాప్‌లో/ fc.way2news.comలో ఎంటర్ చేస్తే మీకు వచ్చిన ఆర్టికల్ కన్పించాలి. లేదంటే ఫార్వర్డ్ అయ్యే వార్త ఫేక్. Way2News పేరుతో వైరల్ అయ్యే ఫేక్ వార్తలను grievance@way2news.comకు పంపండి.
Sorry, no posts matched your criteria.