India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లు పంపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ‘ఆ రెండు పార్టీలకు పరివార్, పవరే ముఖ్యం. వారు వస్తే రామ్ లల్లాను టెంట్ కిందికి తీసుకువస్తారు. అయోధ్యపై సుప్రీం తీర్పును మార్చాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ ఎన్నికల తర్వాత కూటమి పేకమేడలా కూలిపోవడం ఖాయం. మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
AP: వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని గన్‌మెన్లు ఉన్నతాధికారులకు తెలియజేశారు. 144 సెక్షన్ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
దేశ వినియోగదారుల మార్కెట్ 2031 నాటికి రెండింతలు కానుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఐదేళ్లలో ప్రపంచవృద్ధిలో భారత్ వాటా 18% ఉండొచ్చని అంచనా వేశారు. తయారీ రంగాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో డిమాండ్‌ను చేరుకోవడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సదస్సు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. <
AP: రాష్ట్రంలో ఎన్నికల హింసపై CEC ఆదేశాలతో CS జవహర్‌రెడ్డి సిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఐజీ, డీఐజీ స్థాయి అధికారులతో సిట్ ఉంటుందని సమాచారం. రవి ప్రకాశ్, వినీత్ బ్రిజ్ లాల్, పీహెచ్‌డీ రామకృష్ణ పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై నమోదైన ప్రతి కేసునూ, FIRలను సిట్ పరిశీలించనుంది. 2 రోజుల్లో పూర్తి వివరాలతో CECకి నివేదిక సమర్పించనుంది.
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఈనెల 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి 272 సీట్ల కంటే తక్కువ వస్తే మీ వద్ద ఏమైనా ప్లాన్ బీ ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘మా పార్టీకి అలాంటి అవకాశమే లేదు. మోదీ వెనుక 60 కోట్ల బలమైన సైన్యం ఉంది. ‘ప్లాన్ ఏ’ సక్సెస్ అవుతుంది. ప్రధాని మోదీ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తారు. ప్లాన్ బీ ఆలోచనే లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీతో ఉన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఈనెల 18న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే అధికారులు ఆయన ఇంటికి వెళ్తే నోటీసులు తీసుకోవడానికి కుటుంబసభ్యులు నిరాకరించారని, దీంతో ఆయన ఇంటి గేటుకు నోటీసులను అతికించినట్లు మహిళా కమిషన్ ట్వీట్ చేసింది.
చిన్నస్వామి స్టేడియంలో సబ్-ఎయిర్ సిస్టమ్ ఉండటంతో RCB, CSK మ్యాచ్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. రాత్రి 10 తర్వాత వర్షం తెరిపిచ్చినా కొన్ని నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. అప్పుడు 5 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశముంది. అదే జరిగి బెంగళూరు 5 ఓవర్లలో 80 రన్స్ చేస్తే చెన్నైని 62 పరుగులకే నియంత్రించాలి. ఛేదనలో అయితే మ్యాచ్‌ను 3.1 ఓవర్లలో ముగించాలి. ఇవి రెండూ సాధ్యంకాకపోతే చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.
Sorry, no posts matched your criteria.