India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సన్నవడ్లకు మాత్రమే ₹500 బోనస్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 80% మంది దొడ్లు వడ్లనే పండిస్తారని, చాలా తక్కువ మంది సన్నవడ్లు పండిస్తారని పేర్కొన్నారు. దొడ్లు వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, వాటిని కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు.
AP: మాచర్ల YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన తన కారు వదిలి పరారైనట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని CEO, DGPని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
40ఏళ్ల వయసులో ఇల్లు కొనాలనుకునేవారు ఆర్థిక స్థిరత్వం, ఎమర్జెన్సీ ఫండ్స్ మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ మంజూరు సులభం అవుతుంది. లొకేషన్, ఇంటి రీసేల్ వాల్యూను పరిశీలించడమే కాక ఎన్‌కమ్బరెన్స్ సర్టిఫికెట్ ద్వారా ప్రాపర్టీలో లొసుగులు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. EMI భారం పడకుండా డౌన్‌పేమెంట్ 20% లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తే మంచిదనేది నిపుణుల సలహా.
AP: జూన్ 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని TDP నేతలు అన్నారు. వైజాగ్‌లో గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణం రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ‘సర్వేలన్నీ కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుంది. ఆ పార్టీ ఘోర ఓటమిని చూడబోతుంది. బటన్లు నొక్కారు కానీ అకౌంట్లలో డబ్బులు పడటం లేదు. సీఎస్‌ను మారిస్తే అన్నీ సర్దుకుంటాయి’ అని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కోల్‌కతాలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పదరీతిలో గుర్తించారు. ఈ నెల 12న చికిత్స నిమిత్తం అన్వరుల్ కోల్‌కతా వచ్చారు. తన ఫ్రెండ్ గోపాల్ బిశ్వాస్ ఇంట్లో బస చేశారు. కానీ రెండు రోజుల తర్వాత బయటకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగిరాలేదు. బంగ్లా దౌత్యవేత్తల సమాచారంతో కోల్‌కతా పోలీసులు గాలిస్తుండగా ఆయన మృతదేహం లభ్యమైంది.
AP ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆరోగ్య శ్రీ సీఈవో భేటీ అయ్యారు. నిన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇవాళ రూ.203 కోట్ల పెండింగ్ నిధులు విడుదల చేయడంతో సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరుతుండగా.. మిగతా నిధుల కోసం నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ <<13292317>>సేవలను<<>> నిలిపివేశాయి.
ఇండియాలో మరోసారి లేఆఫ్స్ వేవ్ మొదలైందని, చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. నైపుణ్యాలతో సంబంధం లేకుండా లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నాయని విమర్శలొస్తున్నాయి. ఓ కంపెనీలో 300 మందిని తొలగించగా.. ఓ MNCలోనూ వందల మంది లేఆఫ్‌కి బలైనట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ అప్‌గ్రేడ్ కావాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
యూజీసీ నెట్ జూన్-2024 దరఖాస్తుల సవరణకు రేపు రాత్రి 11:59 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు NTA ప్రకటించింది. ఏవైనా తప్పులు ఉంటే యూజీసీ నెట్ <
పాకిస్థాన్‌కు చెందిన పర్వతారోహకుడు సిర్బాజ్ ఖాన్ ఆక్సిజన్ సాయం లేకుండా ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ఇలా ఎవరెస్టును ఎక్కిన రెండో పాకిస్థానీగా నిలిచారు. ఈ మౌంటెన్‌ను అధిరోహించడం ఇతనికిది రెండోసారి కాగా.. మొదటిసారి ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఎక్కారు. 8,848 మీటర్ల ఎత్తున్న 11 శిఖరాలను ఆక్సిజన్ సాయం లేకుండా అధిరోహించడం విశేషం.
అఫ్గానిస్థాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన జట్టుతో కలిసి ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రావో బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా 40 ఏళ్ల బ్రావో టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టారు.
Sorry, no posts matched your criteria.