India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో. జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. దీంతో GVMC అప్రమత్తమైంది. 184 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, సాయం కోసం 180042500009 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.
NSA అజిత్ దోవల్ ఈ వారం రష్యాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్య పరిష్కారానికై శాంతి ప్రయత్నాలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో PM మోదీ ఫోన్ సంభాషణ సందర్భంగా, తన ఉక్రెయిన్ పర్యటన అనంతరం దోవల్ రష్యాలో పర్యటించి శాంతి ప్రయత్నాలపై చర్చిస్తారని మోదీ పేర్కొన్నట్టు తెలిసింది. బ్రిక్స్-NSA సమావేశంలో కూడా దోవల్ పాల్గొంటారని సమాచారం.
AP: జనం వరదల్లో ఉంటే జగన్ ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారని మంత్రి లోకేశ్ విమర్శించారు. బురద రాజకీయాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని దుయ్యబట్టారు. పాస్‌పోర్ట్ సమస్య లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. బుడమేరు ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం రూ.464 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
చైనాలో 58 ఏళ్ల వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. రాత్రి నిద్రపోతుండగా ముక్కు ద్వారా బొద్దింక గొంతులోకి వెళ్లింది. అసౌకర్యంగా అనిపించినప్పటికీ అలాగే నిద్రపోయాడు. 3 రోజుల తర్వాత శ్వాసలో దుర్వాసన వచ్చింది. దగ్గు పెరిగింది. ENT స్పెషలిస్టు దగ్గరకు వెళ్లగా పరీక్షల్లో ఏమీ కనిపించలేదు. బ్రోంకోస్కోపీ చేయగా శ్వాసనాళంలో కఫంతో నిండిన బొద్దింక కనిపించింది. వైద్యులు దాన్ని శుభ్రం చేసి డిశ్చార్జ్ చేశారు.
TG: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని ఇస్తామని తెలిపింది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
AP: రాష్ట్రంలో వరదల కారణంగా 45 మంది మరణించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరులో ఏడుగురు మరణించారని పేర్కొంది. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 3,913 KMల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిపింది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లు వెల్లడించింది.
ఒకప్పుడు సీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన JC దివాకర్ రెడ్డి (80) ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. దివాకర్ రెడ్డి తాజా ఫొటోను ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి Xలో షేర్ చేశారు. కుమారుడు పవన్ రెడ్డి, మనవడితో కలిసి దివాకర్ రెడ్డి కనిపించారు. గతంలో ఖరీదైన గ్లాసెస్, గంభీరంగా కనిపించే దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా డీలా పడ్డారు. ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిందని, నడవడం కూడా ఇబ్బందిగా ఉందని పలువురు చెబుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ఇవాళ ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న ముంబైలోని సిద్ది వినాయక ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఈమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, ఇవాళ డెలివరీ అయ్యారు. రణ్‌వీర్ సింగ్-దీపికా 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే
TMCకి ఆ పార్టీ రాజ్యసభ MP షాక్ ఇచ్చారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన తీరుకు నిరసనగా MP జవహర్ సిర్కార్ పదవికి రాజీనామా చేశారు. పార్టీలోని కొంత మంది వ్యక్తుల నియంత్రణ, అవినీతిని తప్పుబడుతూ CM మమతకు లేఖ రాశారు. మమత అపాయింట్మెంట్ దొరకని పరిస్థితులపై నిరాశ వ్యక్తం చేసిన సిర్కార్ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంలో పార్టీ విఫలమైందన్నారు.
అమెరికాలో ‘9/11’ కంటే భారీ ఉగ్ర దాడికి ప్లాన్ చేసిన పాక్ యువకుడు మహ్మద్ షాజెబ్ ఖాన్(20)ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ISIS మద్దతుదారుడైన ఇతడు కెనడా నుంచి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఏడాది అవుతున్నందుకు గుర్తుగా అక్టోబర్ 7న న్యూయార్క్ బ్లూక్లిన్‌లోని ఓ యూదుల కేంద్రంపై అటాక్ చేయడానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.