India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త షరతులేవీ విధించకుండానే ఇజ్రాయెల్‌తో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. తాము కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నామని ఖతర్ PM షేక్ మొహమ్మద్ బిన్, ఈజిప్టు ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్‌ను మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. మరోవైపు త్వరలోనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య చర్చలు జరుపుతామని US CIA డైరెక్టర్ విలియమ్ బర్న్స్ తెలిపారు. ఇప్పటివరకు గాజా యుద్ధంలో 41,084 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తమ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ప్రముఖ టెక్ కంపెనీ డెల్ తెలిపింది. పర్సనల్ కంప్యూటర్‌లకు డిమాండ్ పెరగకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్‌ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఖర్చుల నియంత్రణ కోసం లేఆఫ్‌లు తప్పవని చెప్పింది. కాగా గత నెలలో డెల్ కంపెనీ 12,500 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపింది.
త్వరలో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కలిసి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్రో-ఆసియా కప్‌ను ICC తిరిగి పునరుద్ధరించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆసియా జట్టు తరఫున కోహ్లీ, రోహిత్, బాబర్, బుమ్రా, అఫ్రీది, రిజ్వాన్ వంటి ఆటగాళ్లు కలిసి ఆడనున్నారు. గతంలో ఆసియా జట్టులో సెహ్వాగ్, అఫ్రీది, సంగక్కర, జయవర్ధనే, ఇంజమామ్, నెహ్రా, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్ కలిసి ఆడారు.
హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న ‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచన సిరీస్‌లో ఇప్పటికే ముని, కాంచన 2, గంగా చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కబోయే కాంచన 4ను రూ.100 కోట్ల బడ్జెట్‌తో గోల్డ్ మైన్ మూవీస్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రూ.441 కోట్ల అంచనా వ్యయంతో ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 7 పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఢమరుకం, త్రిశూలం ఆకారాలతో అడుగడుగునా శివతత్వం ఉట్టిపడేలా BCCI, UPCA దీనిని నిర్మిస్తున్నాయి.
AP: రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా సదుం మండలం పెద్దూరులో జరిగిన ఎంపీ బర్త్ డే వేడుకల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వినాయక చవితి వేడుకల్లో సందడి చేశారు. తన ఇంట్లోనే గణపతి విగ్రహం ప్రతిష్ఠించి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నారు. ఎక్కువసేపు జిమ్, మైదానంలోనే ఆయన గడుపుతున్నారు.
ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా తుది జట్టు ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
1686: మొఘల్ సామ్రాజ్యంలో బీజాపూరు రాజ్యం విలీనం
1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం
1967: నటి అమల అక్కినేని జననం
1997: నటి శాన్వీ మేఘన జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం
2009: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.