news

News May 22, 2024

ధోనీ వచ్చే ఏడాదీ ఆడతారు: రాయుడు

image

సీఎస్కే ఆటగాడు ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతారని ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశారు. చెన్నైని క్వాలిఫయర్స్‌కు తీసుకెళ్లాలని ఎంఎస్ భావించి ఉంటారని, ఆ మ్యాచ్‌లో ఔటయ్యాక కనిపించినంత నిరుత్సాహంగా మునుపెన్నడూ ఆయన్ను చూడలేదని వివరించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా వచ్చే సీజన్ కూడా ధోనీ ఆటను చూసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కొనసాగించాలని బీసీసీఐని ఆయన కోరారు.

News May 22, 2024

దేశ వ్యతిరేక శక్తులతో AAPకి సంబంధాలు: నడ్డా

image

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నడ్డా.. AAPకి టెర్రరిస్టుల నుంచి ఫండ్స్ అందుతున్నాయని అన్నారు. పార్టీకి వచ్చే ఫండింగ్‌పై కేజ్రీవాల్ ఒక్కసారి కూడా స్పందించలేదని, అర్బన్ నక్సలిజానికి ఇదే ఉదాహరణ అని నడ్డా పేర్కొన్నారు.

News May 22, 2024

నైజీరియాలో సాయుధమూకల కాల్పులు.. 40 మంది మృతి

image

నైజీరియాలోని పీట్లా రాష్ట్రంలో సాయుధమూకలు నరమేధం సృష్టించాయి. వాసే జిల్లాలోని జురాక్ మైనింగ్ గ్రామంపై విరుచుకుపడి కాల్పులు జరపడంతో పాటు ఇళ్లను తగులబెట్టారు. ఈ ఘటనలో 40 మంది మృతి చెందారు. కాగా గనులకు ప్రసిద్ధి చెందిన పీట్లా రాష్ట్రంలో వనరులపై ఆధిపత్యం కోసం తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గ్రామాలపై దాడులు చేసి దోచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ల దాడిలో వేల మంది చనిపోయారు.

News May 22, 2024

మే 22: చరిత్రలో ఈరోజు

image

2010: సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణం
2015: మార్క్సిస్టు నాయకుడు పర్సా సత్యనారాయణ మరణం
2023: నటుడు శరత్ కుమార్ మరణం
2023: ప్రసిద్ధ తెలుగు రచయిత కేతు విశ్వనాథరెడ్డి మరణం
1822: ప్రముఖ తెలుగు కవి పరవస్తు వెంకట రంగాచార్యులు జననం
1955: కథా రచయిత చంద్రశేఖర ఆజాద్ జననం
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

News May 22, 2024

ENGLISH LEARNING: IDIOMS

image

Burn bridges: Do something to spoil relationships
When pigs fly: When something uncanny or impossible happens
Come rain or shine: No matter what happens
As right as rain: Something is perfect
Get wind of something: To have information about something secret
Go down in flames: To fail terribly

News May 22, 2024

నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

image

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ నాలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 11 మంది అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కాగా ఈ ఘటనలో కీలక సూత్రధారి అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాతోపాటు మరో నిందితుడిని ఇప్పటికే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

News May 22, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 22, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు అసర్: సాయంత్రం 4:46 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:44 గంటలకు
ఇష: రాత్రి 08.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 22, 2024

క్వాలిఫయర్-2లో విజయం సాధిస్తాం: కమిన్స్

image

కేకేఆర్‌తో క్వాలిఫైయర్ మ్యాచులో ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తామని SRH కెప్టెన్ కమిన్స్ అన్నారు. క్వాలిఫయర్‌-2 మ్యాచ్ జరిగే చెన్నై వికెట్ తమకు సరిగ్గా సరిపోతుందని.. అక్కడ గెలుస్తామనే నమ్మకముందన్నారు. ‘కేకేఆర్ అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించాలని నిర్ణయించి సన్వీర్‌కు ఛాన్సిచ్చాం. మా ప్లాన్ బెడిసికొట్టింది’ అని పేర్కొన్నారు.

News May 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 22, 2024

ఈవీఎంల ధ్వంసంపై కఠిన చర్యలకు ఈసీ ఆదేశాలు

image

AP: మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసంపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఈసీ ఆదేశించింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంది. మాచర్ల పరిధిలో మొత్తం 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్లు రికార్డయింది. ఆయనను కూడా నిందితుడి చేర్చినట్లు పోలీసులు ఈసీకి తెలియజేశారు.