news

News May 19, 2024

BREAKING: SRH ఘన విజయం

image

తన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై SRH 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 28 బంతుల్లో 66, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 33, నితీశ్ రెడ్డి 25 బంతుల్లో 37, క్లాసెన్ 26 బంతుల్లో 42 పరుగులతో అదరగొట్టారు. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ చెరో వికెట్ తీశారు.

News May 19, 2024

KKR Vs RR: టాస్ ఆలస్యం

image

రాజస్థాన్, కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న గుహవాటిలోని బార్సాపారా స్టేడియం వద్ద వాన పడుతోంది. దీంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు.

News May 19, 2024

ఇండోనేషియాలో ‘స్టార్‌లింక్’ ప్రారంభించిన మస్క్

image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇవాళ తొలిసారి ఇండోనేషియాలో పర్యటించి స్టార్‌లింక్ సర్వీసులను ప్రారంభించారు. దీంతో అక్కడి 17వేలకు పైగా దీవుల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందనుంది. అలాగే దేశ హెల్త్ సెక్టార్‌తోనూ మస్క్ ఒప్పందం చేసుకున్నారు. కాగా హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యంతో స్టార్‌లింక్ శాటిలైట్లను రూపొందించారు. ప్రస్తుతం 1,500కు పైగా ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి.

News May 19, 2024

రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలంలో రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మరణించారు. కాగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది.

News May 19, 2024

IPL-2024: అత్యధిక సిక్సర్లు బాదిన SRH ప్లేయర్

image

సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్‌గా నిలిచారు. అభిషేక్ ఈ సీజన్లో 41 సిక్సర్లు బాదారు. ఆ తర్వాతి స్థానంలో కోహ్లీ(37) ఉన్నారు. కాగా అభిషేక్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కావడం గమనార్హం. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచులో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు.

News May 19, 2024

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

image

TG: కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మ.3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం నిన్ననే భేటీ జరగాల్సి ఉండగా, ఈసీ తొలుత అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఇవాళ పలు షరతులతో ఓకే చెప్పింది. అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేసింది.

News May 19, 2024

సిట్ విచారణలో పోలీసులే దోషులుగా తేలుతారు: అంబటి

image

AP: కూటమి నాయకుల ఫిర్యాదుతో పోలీస్ ఉన్నతాధికారులను తప్పించిన చోటే హింస చెలరేగిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘ఇవాళ సిట్ బృందాన్ని కలిసి అన్ని అంశాలపై ఫిర్యాదు చేశా. TDP నుంచి డబ్బులు తీసుకున్న పోలీసులు పల్నాడులో సరిగ్గా పనిచేయలేదు. సిట్ విచారణలో వారే దోషులుగా తేలుతారు. నరసరావుపేట MLA ఇంటిపై TDP మూకలు రాళ్లు వేశాయి. మేం ఫిర్యాదుచేస్తే పోలీసులు పట్టించుకోలేదు’ అని మండిపడ్డారు.

News May 19, 2024

ఐదో విడత బరిలో అభ్యర్థులు ఎందరంటే?

image

రేపు దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూపీలో 14, మహారాష్ట్రలో 13, వెస్ట్ బెంగాల్‌లో 7, బిహార్‌లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 1, లద్దాక్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా ఐదో విడత ఎన్నికల్లో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News May 19, 2024

రేపటి నుంచి CISF పహారాలో పార్లమెంట్

image

నూతన పార్లమెంట్ భద్రత బాధ్యతలను రేపటి నుంచి CISF చేపట్టనుంది. 3,317 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు CRPF, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా పనిచేసేవి. గత డిసెంబర్‌లో ఆగంతకులు పార్లమెంటులో ప్రవేశించడంతో కలకలం చెలరేగింది. దీంతో భద్రత బాధ్యతలను CISFకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.

News May 19, 2024

90 ఏళ్ల వయసులో అంతరిక్షయానం

image

USకు చెందిన ఎడ్ డ్వైట్(90) అరుదైన ఘనత సాధించనున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన అతిపెద్ద వ్యక్తిగా నిలవనున్నారు. ఈయన 1961లోనే వ్యోమగామి శిక్షణ తీసుకున్న తొలి నల్లజాతి వ్యక్తి. అప్పట్లో పలు కారణాలతో నాసా ప్రోగ్రామ్‌కు ఎంపిక కాలేదు. 63 ఏళ్ల తర్వాత అతనికి బ్లూ ఆరిజిన్(జెఫ్ బెజోస్ కంపెనీ) అవకాశం కల్పించింది. ఇవాళ ఆయన మరో ఐదుగురితో కలిసి 11 నిమిషాలపాటు స్పేస్‌లోకి వెళ్లనున్నారు.