India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్‌సెట్ 2024-25 పరీక్షలు ముగిశాయి. మొత్తం 10,050 మంది దరఖాస్తు చేసుకోగా, 8,651 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ తెలిపారు. ఈనెల 15న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించారు. ధర్మశాలలో ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ‘ధోనీలాంటి ఆటగాడు 9వ స్థానంలో రావడం చెన్నైకి మంచిది కాదు. బాధ్యత తీసుకుని మరింత ముందుగా వచ్చి నాలుగైదు ఓవర్లు ఆడాలి. ఒకట్రెండు ఓవర్లు ఆడితే అది జట్టుకు ఏమాత్రం లాభించదు’ అని స్పష్టం చేశారు.
తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళకు కోర్టు జైలుశిక్షతో పాటు రూ.5.88లక్షల జరిమానా విధించింది. యూపీకి చెందిన మహిళ తన కూతురిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని 2019లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చింది. కేసు పెండింగ్‌లో ఉండగా, నిందితుడు 4ఏళ్లు జైల్లో ఉన్నాడు. తాజాగా ఆ బాలిక తన వాంగ్మూలం తప్పని కోర్టులో అంగీకరించడంతో ఆమె తల్లికి కోర్టు జైలుశిక్ష విధించింది.
TG: సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫేక్ స్కైప్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ‘జాగ్రత్త! మీ పేరుతో డ్రగ్ పార్శిల్స్ వచ్చాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అలాంటి ఖాతాలకు స్పందించకండి. అప్రమత్తంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
బ్రెజిల్‌లోని దక్షిణ రియో గ్రాండీ డోసుల్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గడచిన వారంలో 75మందికి పైగా ప్రజలు వరదల ధాటికి మృతిచెందారు. మరో 103మంది గల్లంతయ్యారు. 88వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. 16వేలమందికి తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇది తాము మునుపెన్నడూ చూడని విపత్తు అని దేశాధ్యక్షుడు లూలా డ సిల్వ ప్రకటించారు.
AP: రాష్ట్రంలో అటు వైసీపీ, ఇటు కూటమి రెండూ బలంగానే కనిపిస్తున్నాయి. ఫలితాలపై ఇదీ అంచనా అని చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచే నియోజకవర్గాల్లో ప్రభుత్వోద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్‌కోసం ఉద్యోగులు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరం. వారు ఎటువైపు మొగ్గుతున్నారన్నదే పలు చోట్ల ఫలితాల్ని శాసించే అవకాశం ఉంది.
తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. పలు ప్రాంతాల్లో 46కు పైగా టెంపరేచర్ రికార్డు అయింది. నేడు నిర్మల్, ASF, మంచిర్యాల, NZB, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ రేపు జరగనుంది. 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుజరాత్‌లో ఒక స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 25స్థానాలకు, కర్ణాటకలో 14, మహారాష్ట్ర 11, UP 10, MP 8, ప.బెంగాల్ 4, అస్సాం 4, బిహార్ 5, ఛత్తీస్‌గఢ్‌లో 7 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అమిత్ షా, జ్యోతిరాధిత్య, దిగ్విజయ్ సింగ్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జుడీషియల్ కమిషన్ ఇవాళ్టి నుంచి రెండో దఫా విచారణ చేపట్టనుంది. ఈనెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, రేపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. అనంతరం ఈనెల 9న HYDలో నీటిపారుదల అధికారులతో భేటీ కానుంది. బ్యారేజీల వైఫల్యాలపై ఇంజినీర్లు, నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులిచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంతో పాటు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉ.11 నుంచి మ.12.30 వరకు పాణ్యంలో జరిగే సభకు హాజరవుతారు. మ.1.30 గంటలకు కర్నూలు నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు.
Sorry, no posts matched your criteria.