India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే PM ఎవరు అవుతారో చెప్పాలని ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా విపక్షాలను ప్రశ్నించారు. ‘శరద్ పవార్‌ను చేస్తారా? లేక మమత, స్టాలిన్, రాహుల్ గాంధీని చేస్తారా? అక్కడ PM అభ్యర్థే లేరు. మూడోసారి PM అయ్యేది మోదీనే. దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, నక్సలైట్లు, ఉగ్రవాదులను అరికట్టడానికి మోదీని PM చేయాలి’ అని పిలుపునిచ్చారు.
AP: పవిత్ర హిందూపురానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ‘రాముడు, జఠాయువు కలిసిన పుణ్యభూమి లేపాక్షికి ప్రణామం చేస్తున్నా. లోక్‌సభ రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో మోదీ సెంచరీ కొడతారు. తర్వాతి దశల్లో మొత్తం 400కు పైగా సీట్లు సాధిస్తాం’ అని షా ధీమా వ్యక్తం చేశారు.
AP: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా హిందూపురం లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో కాసేపటి క్రితం ధర్మవరం చేరుకున్నారు. ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు, అమిత్ షా కలిసి ఒక వేదికపై కనిపించడం ఆరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా అమిత్ షాను చంద్రబాబు సత్కరించారు. ధర్మవరం నుంచి కూటమి తరఫున సత్యకుమార్ పోటీలో ఉన్నారు.
TG: HYDను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో BJP డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో BRSతో కలవబోమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని, ఆ పార్టీలో అంతర్గత కలహాల కారణంగా ప్రభుత్వం కూలితే తమకు సంబంధం లేదని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
AP: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై జరుగుతున్న ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. చంద్రబాబు, లోకేశ్‌పై FIR నమోదు చేసింది. A1గా చంద్రబాబు, A2గా నారా లోకేశ్ పేర్లను చేర్చింది. IVRS కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సీఐడీ విచారణ ప్రారంభించింది.
CBSE 10, 12వ తరగతి ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. విద్యార్థుల డిజిలాకర్ యాక్సెస్ కోడ్‌లను తాజాగా విడుదల చేసింది. డిజిలాకర్ ద్వారా విద్యార్థులకు బోర్డు మార్కుల షీట్లు, సర్టిఫికెట్ల డిజిటల్ కాపీలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు 6 అంకెల యాక్సెస్ కోడ్ కోసం తమ స్కూళ్లలో సంప్రదించాలని బోర్డు సూచించింది. ఈనెల 20 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
తనకు పనికి, విశ్రాంతికి మధ్య తేడా లేదని పీఎం మోదీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘రోజుకు ఎన్ని గంటలు పనిచేశాం అనే లెక్కలు నేను వేసుకోను. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడాన్ని చిన్నప్పుడే అలవాటు చేసుకున్నా. నేటికీ అదే పాటిస్తున్నా. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తుంటాను. గంటల తరబడి నిద్రపోలేను. పనిలోనే నాకు విశ్రాంతి’ అని వివరించారు.
AP: రాష్ట్రాన్ని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర వర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, ఐసర్, గిరిజన వర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, పెట్రోలియం వర్సిటీ, ఎయిమ్స్, వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ వంటి పలు పనుల్ని ఏపీ కోసం చేశాం. వైజాగ్-ఢిల్లీ-ముంబై తరహాలో చెన్నై కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని తెలిపారు.
రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సోనిపట్‌లో మార్చిలో జరిగిన ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ తన మూత్ర నమూనాను ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో నాడా అతనిపై చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తేసే వరకు అతను ఏ టోర్నమెంట్‌లో లేదా ట్రయల్స్‌లో పాల్గొనలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఇండియన్-2’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. జూన్‌లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీని జులై 11 లేదా 17న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.