India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లెబనాన్‌లో <<14129580>>పేజర్లు<<>> పేలిన ఘటన మరువకముందే మళ్లీ అక్కడ వాకీ టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఈ ఘటనపై హెజ్బొల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై హమాస్, హౌతీ రెబల్స్ దాడులు చేస్తుండగా హెజ్బొల్లా కూడా రంగంలోకి దిగనుంది.
టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో 80.90 యావరేజ్ కలిగిన రెండో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అగ్ర స్థానంలో బ్రాడ్‌మన్ (99.94) ఉన్నారు. మూడో స్థానంలో జైస్వాల్ (68.53) కొనసాగుతున్నారు. మెండిస్ తానాడిన తొలి 7 టెస్టుల్లోనే 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 809 రన్స్ సాధించారు. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గానూ నిలిచారు.
APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలో ఈ నెల 21 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
షార్జాలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బౌలర్లు చెలరేగిపోయారు. వారి ధాటికి సఫారీలు 106 పరుగులకే చాప చుట్టేశారు. వియాన్ ముల్డర్ 52 పరుగులతో రాణించడంతో ప్రోటీస్ జట్టు ఆమాత్రం స్కోరైనా చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరూకీ 4, ఘజన్‌ఫర్ 3, రషీద్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. అఫ్గాన్ బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది.
TG: కొత్తగూడెం కలెక్టరేట్ ఆఫీసులో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.1.14 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ ఏసీబీకి చిక్కాడు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ధ్రువీకరణ కోసం అధికారి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఎవరైనా లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి.
TG: జమిలి ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని ఆయన అన్నారు. ‘పార్టీ నేతలతో చర్చించాకే జమిలిపై తమ నిర్ణయం వెల్లడిస్తాం. రాష్ట్రంలో బలహీనవర్గాలను కాంగ్రెస్ దగా చేస్తోంది. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. రూ.25 నుంచి రూ.35 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
ఏర్పడి పదేళ్లే అయినా తెలంగాణ దేశంలోని ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం దక్కించుకుంది. ఇందులో సింహభాగం క్రెడిట్ హైదరాబాద్‌కు దక్కుతుంది. విభేదాలకు అతీతంగా ప్రజలందరూ సామరస్యంగా తమ పని తాము చేసుకుపోవడం, సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుత ప్రగతి, రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు ఇవన్నీ ఈ కోటి రతనాల వీణను ధనిక రాష్ట్రంగా నిలబెట్టాయి. త్వరలోనే రెండు తెలుగురాష్ట్రాలు అగ్రస్థానానికి చేరాలని కోరుకుందాం.
AP: వెనుకబడిన వర్గాల వారికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదలను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి రాజకీయపరంగా వారికి తగిన అవకాశాలు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తిస్తూ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
TG: 2050 నర్సింగ్ ఆఫీసర్స్(స్టాఫ్ నర్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 17న CBT విధానంలో పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి రూ.36,750-1,06,990 పేస్కేల్ విధానంలో జీతం చెల్లిస్తారు. GNM లేదా బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్న 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ <
AP: తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన <<14134836>>వ్యాఖ్యలు <<>>అత్యంత దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ‘కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. చంద్రబాబు సిద్దమా?’ అని సవాల్ విసిరారు.
Sorry, no posts matched your criteria.