India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బీఆర్ఎస్ హయాంలో సాధించిన విజయాలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇలా గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. ‘BRS హయాంలోనే MSMEల అభివృద్ధి జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇవి మూతపడ్డా, ఇక్కడ మాత్రం సగర్వంగా ఎదిగింది. ఎంఎస్ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధి సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
AP: ఉమ్మడి నెల్లూరు(D) YCP అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని, పల్నాడు(D) అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని YCP నియమించింది. నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా అనిల్ కుమార్ యాదవ్‌ను నియమించింది. ఇటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో ప.గో(D) పాలకొల్లుకి చెందిన నేత మేకా శేషుబాబుని YCP సస్పెండ్ చేసింది.
భారత్‌లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం.. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా, తమిళనాడు దేశంలో తొలి ఐదు ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఇక బిహార్, ఝార్ఖండ్, యూపీ, మణిపుర్, అస్సాం రాష్ట్రాలు తొలి ఐదు పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. రాష్ట్రాల GDP ప్రామాణికంగా ఈ జాబితాను రూపొందించింది.
రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ అప్‌డేట్స్ సరిగ్గా లేకపోవడం పట్ల మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వారందరికీ ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘గేమ్‌ఛేంజర్ ఈవెంట్లకు వచ్చేవారం నుంచి అడ్డూఆపూ ఉండదు. డిసెంబరు 20న విడుదలయ్యే వరకు వెల్లువలా అప్‌డేట్స్ వస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీంతో త్వరగా అప్‌డేట్స్ ఇస్తే బ్రేక్ ఇస్తామంటూ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల సహచరులు అత్యంత గౌరవంగా వ్యవహరిస్తారని జట్టు కోచ్ గంభీర్ తెలిపారు. అతడి నాయకత్వంతో ఆ గౌరవాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ‘సిబ్బంది ఎంతమంది ఉన్నా జట్టు అనేది కెప్టెన్‌దే. అతడే ముందుండి నడిపించాలి. జట్టు సభ్యులందరితోనూ రోహిత్ బంధం బాగుంటుంది. నేను ఆడుతున్న రోజుల్లో మా ఇద్దరి మధ్య స్నేహం కూడా అద్భుతంగా ఉండేది. అతనో గొప్ప వ్యక్తి’ అని కొనియాడారు.
AP: వాలంటీర్లపై NDA శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు. వాళ్ల పేరోల్స్(జీతాల బిల్లులు) కూడా లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారు. కానీ మనం 3 నెలల జీతం ఇచ్చాం. కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్స్‌కు కూడా గడువు ముగిసింది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఎంపీగా పదవిలో ఉండగానే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దేవుడి దయ వల్ల అది జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 38 ఏళ్ల కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరోవైపు ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి టెస్టు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఓవరాల్ ఓటముల కన్నా గెలుపుల సంఖ్య పెంచాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరో వైపు పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులోనే భారత్‌పై కూడా గెలవాలని బంగ్లా తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.
వచ్చే సీజన్‌లో సరికొత్త పంజాబ్ కింగ్స్ టీమ్‌ను చూపేందుకు ప్రయత్నిస్తానని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. ‘పంజాబ్ కోచ్‌గా రావడం ఆనందంగా ఉంది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నేనెప్పుడూ సిద్ధమే’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ‘పాంటింగ్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా జట్టును పవర్‌ఫుల్‌గా మార్చేందుకు ఆయన శ్రమిస్తారని ఆశిస్తున్నాం’ అని పంజాబ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.
TG: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ ఆమెకు అందించారు. జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తన ప్రదర్శనల ద్వారా రాష్ట్రం, దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చినందుకు ఆమెకు ఈ ఉద్యోగం ఇచ్చారు. డీఎస్పీ ర్యాంకులోకి నేరుగా ప్రవేశం కల్పించారు.
Sorry, no posts matched your criteria.