news

News September 17, 2024

వినాయక నిమజ్జనంలో ప్రమాదం

image

మహారాష్ట్రలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడికో వెళ్లగా.. మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. అది రివర్స్ వెళ్లి ప్రజలపైకి దూసుకెళ్లడంతో 13, 6, 3 ఏళ్ల పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి, అసలైన డ్రైవర్ పారిపోగా, పోలీసులు వెతికి పట్టుకున్నారు. ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

News September 17, 2024

మీ ఫోన్ చోరీకి గురికాకుండా ఇలా చేయండి

image

మీ ఫోన్ చోరీకి గురైనా కూడా దాని లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. Track it EVEN if it is off అనే యాప్‌ను నచ్చిన ప్లాన్‌తో స‌బ్‌స్క్రైబ్‌ చేసుకొని అందులో ‘యాంటీ థెఫ్ట్’ సెల‌క్ట్ చేసుకొని ఫేక్ ష‌ట్‌డౌన్ ఆన్ చేసుకోవాలి. ఫోన్ చోరీకి గురైన‌ప్పుడు ఆగంతకులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాక డివైస్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ, ఫోన్ ఆన్‌లోనే ఉంటుంది. యాప్ వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ లోకేష‌న్‌ను ఈజీగా ట్రాక్‌ చేయ‌వ‌చ్చు.

News September 17, 2024

ఐదేళ్లూ YCP మాట్లాడలేదు.. ఇప్పుడు మాపై విమర్శలా: CM

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా సర్వవిధాలా ప్రయత్నిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘కేంద్రమంత్రులతో ఇప్పటికే మాట్లాడాను. ప్లాంట్‌కు కావాల్సిన నిధులు విడుదల చేయిస్తాం. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పని చేద్దాం. గతంలో స్టీల్ ప్లాంట్‌‌పై ఢిల్లీ వెళ్లి మాట్లాడుదాం రమ్మంటే జగన్ రాలేదు. ఐదేళ్లూ మాట్లాడని వైసీపీ ఇప్పుడు మాపై విమర్శలు చేస్తోంది’ అని ఫైర్ అయ్యారు.

News September 17, 2024

కేంద్రం నుంచి వరద సాయం.. చంద్రబాబు ఏమన్నారంటే?

image

AP: రాష్ట్రానికి కేంద్రం నుంచి వరద సాయంపై ఇప్పుడే చెప్పలేమని సీఎం చంద్రబాబు అన్నారు. ముందుగానే అంచనా వేయడం సరికాదని, వచ్చాక వెల్లడిస్తామని చెప్పారు. విద్యార్థులకు అన్ని పుస్తకాలు అందిస్తామని తెలిపారు. వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి తిరిగి అన్నీ అందిస్తామన్నారు. స్టడీ మాత్రమే కాకుండా ల్యాండ్, రేషన్ కార్డుల వంటివి కూడా అందజేస్తామని పేర్కొన్నారు.

News September 17, 2024

ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం-వివరాలు

image

* టూ వీలర్స్ దెబ్బతింటే-రూ.3 వేలు, త్రీవీలర్స్- రూ.10 వేలు
*తోపుడు బండ్లు దెబ్బతింటే కొత్త బండ్లు
* చేనేత కార్మికులకు- రూ.15 వేల నుంచి 25 వేలు
* ఫిషింగ్ బోట్స్(డ్యామేజీని బట్టి)-రూ.9 వేలు-రూ.25 వేలు
* గేదెలు మరణిస్తే-రూ.50 వేలు
* ఎద్దులు మరణిస్తే-రూ.40 వేలు
* పంట నష్టం వరి ఎకరాకు-రూ.10 వేలు
* మిరప హెక్టారుకు-రూ.35 వేలు

News September 17, 2024

‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభిస్తాం: సీఎం

image

AP: విజయవాడలో మళ్లీ వరదలు రాకుండా ‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. బుడమేరు వాగుపై అక్రమ కట్టడాలను క్లియర్ చేస్తే 95% సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి చట్టం తీసుకొస్తామని చెప్పారు.

News September 17, 2024

వైసీపీ వల్లే ఈ పరిస్థితి: చంద్రబాబు

image

AP: భవానీపురం రోడ్డు, బుడమేరులో ఊహించని వరద వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా పనులు వదిలేయడమే ఈ పరిస్థితికి కారణమని మీడియాతో చెప్పారు. 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో 40 మెట్రిక్ టన్నుల బరువున్న 3 బోట్లు బ్యారేజీ గేట్ కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టాయని చెప్పారు. ఇప్పటికీ వాటిని తీసేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. ఆ ప్రభుత్వమే ఉంటే ఇంకా కోలుకునే వాళ్లం కాదన్నారు.

News September 17, 2024

‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

image

‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ ప్రోగ్రామ్ ఉండే ఛాన్స్ ఉంది. పబ్లిక్ ఈవెంట్ కోసం ప్రయత్నించినా ఆ వారంలో వర్షసూచన ఉండటంతో వెనక్కి తగ్గినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇంకా అతిథులపై క్లారిటీ రాలేదు.

News September 17, 2024

చంద్రబాబు అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలి: VSR

image

AP: సీఎం చంద్రబాబు నివసించే అక్రమ కట్టడాన్ని మొదట కూలగొట్టడం సముచితం అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ‘చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది? పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే’ అని ట్వీట్ చేశారు.

News September 17, 2024

విమానాల్లో కన్నడ భాషలోనే మొదటి ప్రకటన చేయాలంటూ ప్రతిపాదన

image

బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో ల్యాండ్/టేకాఫ్ అయ్యే ప్ర‌తి విమానంలో మొద‌టి ప్ర‌క‌ట‌న‌ను క‌న్న‌డలోనే చేయాల‌ని క‌న్న‌డ సాహిత్య పరిష‌త్ కోరింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను సంస్థ ఛైర్మ‌న్ డా.మ‌హేశ్ జోషి సోమ‌వారం బెంగ‌ళూరు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ హ‌రి మ‌రార్ ముందుంచారు. అయితే, దీనికి కేంద్ర పౌర విమాన‌యాన శాఖ అనుమ‌తి త‌ప్ప‌నిస‌ర‌ని, ఆ మేరకు అనుమతి కోసం లేఖ రాస్తామని అధికారులు తెలిపారు.