India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ‘గణేశ్ నిమజ్జనంలో ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సాహాలతో పాల్గొనాలి. ఎక్కడా గొడవలకు తావివ్వకూడదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. ఎవరైనా మీకు అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనిపిస్తే వెంటనే డయల్ 100కి లేదా దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
AP: కర్నూలు(D) తుగ్గలి(M) సూర్యతండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీకి వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. అది 8 క్యారెట్ల వజ్రం అని తేల్చారు. పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.5లక్షలకు దానిని కొనుగోలు చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని GSI గుర్తించిన నేపథ్యంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.
నిమజ్జనమే చేయకుండా గత 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని భద్రపరుస్తున్నారనే విషయం మీకు తెలుసా? నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లికి దగ్గరలో ఉన్న పాలజ్(MH)లో కర్ర వినాయకుడిని పూజిస్తారు. ప్రతి ఏటా చవితికి బీరువాలో భద్రపరిచిన కర్ర వినాయకుడిని బయటకు తీసి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల చివరిరోజు వాగుకు తీసుకెళ్లి నీళ్లు చల్లి మళ్లీ భద్రపరుస్తారు.
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘డిమోంటీ కాలనీ-2’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి జీ5లో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. 2015లో వచ్చిన తొలి పార్ట్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టులో WPI ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. జులైలోని 2.04 నుంచి 4 నెలల కనిష్ఠమైన 1.31 శాతానికి చేరింది. ఆహార ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నా తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడమే దీనికి కారణం. జులైలో 3.45% ఉన్న ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.11కి తగ్గింది. పప్పులు, బియ్యం, ఉల్లి ధరలు కాస్త తగ్గితే ఆలు, పళ్లు, నూనెలు పెరిగాయి. ప్యాకేజీ ఫుడ్స్, బెవరేజెస్, టెక్స్‌టైల్స్, ఫార్మా ఉత్పత్తుల ధరలు తగ్గాయని కామర్స్ మినిస్ట్రీ అంటోంది.
బుక్ మై షోలో ఇంట్రస్ట్‌ల విషయంలో పుష్ప-2ను ‘దేవర’ దాటేసింది. పుష్ప-2ను చూసేందుకు 334.6K మంది ఆసక్తి చూపిస్తుండగా, దేవర పార్ట్-1ను చూడటానికి ఆసక్తిగా ఉన్న వారి సంఖ్య 341.3Kకి పెరిగింది. దీంతో పుష్ప-2ను దేవర పార్ట్-1 అధిగమించింది. ఈనెల 27న దేవర విడుదలవుతుండగా, DEC 6న పుష్ప-2 రిలీజ్ కానుంది. అప్పటివరకు పుష్ప-2 చూడటానికి ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపుతారని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
AP: శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం పేరును రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా మార్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు నూతన మద్యం పాలసీపై క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను మంత్రులు, అధికారులు సీఎంకు వివరిస్తున్నారు.
టీటీడీ పద్మావతి గెస్ట్‌హౌస్‌లో టీడీపీ నేతలు చిందులు వేశారంటూ వైరలవుతోన్న వీడియోను AP FACTCHECK ఖండించింది. ‘తిరుమల అతిథి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 29న విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది. తిరుమల ప్రతిష్ఠ మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి’ అని పేర్కొంది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో CBI కీలక ఆధారాలు సేకరించిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఘటన తీవ్రత దృష్ట్యా ఛార్జిషీట్ దాఖలుకు త్వరపడొద్దని సూచించింది. ‘CBI స్టేటస్ రిపోర్టులోని అంశాలు బయటపెడితే దర్యాప్తుకు అంతరాయం కలగొచ్చు. క్రైమ్‌సీన్, సాక్ష్యాల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు జరుగుతోంది. వారేం నిద్రపోవడం లేదు. నిజం కనుగొనేందుకు తగిన సమయమిచ్చాం. పోలీసులు వారికి సహకరించాల’ని పేర్కొంది.
ప్రముఖ టెలికం కంపెనీ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్ సరిగా రాకపోవడంతో కాల్స్ కలవడం లేదని యూజర్లు సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు. ముంబైలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్‌లోనూ కాల్స్ కలుస్తున్నా వాయిస్ కట్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.