news

News March 18, 2024

టాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం

image

ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఉబర్ అంగీకరించింది. దేశ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద సెటిల్‌మెంట్‌గా న్యాయ నిపుణులు వెల్లడించారు. తమ దేశంలోకి ఉబర్ ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ 8వేల మంది టాక్సీ డ్రైవర్లు 2019లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఎట్టకేలకు పరిహారం ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించడంతో వివాదానికి తెరపడింది.

News March 18, 2024

ఏప్రిల్ 8న పుష్ప-2 తొలి సింగిల్ రిలీజ్?

image

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్‌డే రోజున విడుదల చేసిన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

News March 18, 2024

కడప నుంచి షర్మిల పోటీ?

image

AP: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారట. కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలూ ఈసారి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈనెల 25న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని సమాచారం.

News March 18, 2024

‘ఎలక్టోరల్ బాండ్ల’పై డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు

image

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలక్టివ్‌గా ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ పార్టీకి ఎంత ఇచ్చారో తెలిపేలా యునిక్ నంబర్లను ఈసీకి అందజేయాలని ఇవాళ <<12876842>>ఆదేశించిన<<>> సుప్రీంకోర్టు.. ఇందుకోసం డెడ్‌లైన్ విధించింది. కచ్చితంగా ఈ నెల 21న సాయంత్రం 5లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. బాండ్ల విషయంలో ప్రతి సమాచారం బయటకు రావాలని, సందేహాలకు తావుండకూడదని తేల్చిచెప్పింది.

News March 18, 2024

ముంబైని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి RCB

image

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన IPL రెండో ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. నిన్న WPL-2024 ట్రోఫీని RCB ఉమెన్స్ జట్టు గెలవడంతో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ను అధిగమించింది. ప్రస్తుతం RCBకి 12.7M, MIకి 12.6M ఫాలోవర్లున్నారు. ప్రథమ స్థానంలో CSK జట్టు (14.1M) ఉంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో చాలా మంది MIని అన్‌ఫాలో చేశారు.

News March 18, 2024

హీరోయిన్‌కు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స

image

మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తిరువనంతపురంలోని ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని మరో నటి గోపికా అనిల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘పొంగి ఎజు మనోహర’ చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరుంధతి.. 7 సినిమాలు, 2 వెబ్‌సిరీస్‌లలో నటించారు.

News March 18, 2024

వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా!

image

AP: ఈనెల 20న జరగాల్సిన వైసీపీ మేనిఫెస్టో ప్రకటన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం’ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News March 18, 2024

బీజేపీకి అధికారమిస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ

image

BJPకి అధికారమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని PM మోదీ అన్నారు. ‘రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చాం. పంట ధరను క్వింటాల్‌కు ₹6వేల నుంచి ₹30వేలకు పెంచాం. ఇక్కడి ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మేము ₹6,400కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రగతిపై దృష్టి సారిస్తాం’ అని తెలిపారు.

News March 18, 2024

నావల్నీని విడిచిపెట్టాలనుకున్నాం: పుతిన్

image

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో కన్నుమూయడం పట్ల ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తాము నావల్నీని విడిచిపెట్టాలనుకున్నామని తెలిపారు. ‘ఆయన మృతి బాధాకరం. నిజానికి ఆయన్ను విడిచిపెట్టాలనుకున్నాం. విదేశీ జైళ్లలోని రష్యన్లతో ఖైదీల మార్పిడి పద్ధతిలో నావల్నీని పంపించాలనేది మా ప్రణాళిక. తిరిగి రష్యా రావొద్దనే షరతు విధించాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది’ అని వివరించారు.

News March 18, 2024

టీడీపీకి బిగ్ షాక్?

image

AP: విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. జనసేనకు సీట్లు కేటాయించిన ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్‌లోని TDP అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారట. వారందరితో కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. అటు బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.