news

News March 18, 2024

నేడు బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

image

TG: బీఎస్పీకి గుడ్ బై చెప్పిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

News March 18, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 72.55% మంది హాజరు

image

AP: రాష్ట్రంలో 89 గ్రూప్-1 ఉద్యోగాలకు నిన్న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు APPSC వెల్లడించింది. 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా, 1,26,068 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 91,463 మంది(72.55 శాతం) మంది హాజరైనట్లు పేర్కొంది. త్వరలో కీ విడుదల చేస్తామంది.

News March 18, 2024

ఎన్నికల షెడ్యూల్ మార్చాలని ఈసీకి విజ్ఞప్తి

image

సార్వత్రిక ఎన్నికల కోసం ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళలో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని.. ఈ తేదీలు ముస్లింలకు ఎంతో పవిత్రమైన శుక్రవారం వస్తున్నాయని, ఆ రోజుల్లో పోలింగ్ వద్దని కోరింది. మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంటుందని.. అభ్యర్థులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది.

News March 18, 2024

ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు

image

AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయి. నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయి. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో ఏడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.

News March 18, 2024

గుజరాత్ టైటాన్స్‌లోకి సర్ఫరాజ్ ఖాన్?

image

టీమ్ ఇండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆయన ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.

News March 18, 2024

నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కవిత భర్త!

image

TS: MLC కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు KTR, హరీశ్‌రావు కలిశారు. ఇవాళ పలువురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది కలిసే అవకాశం ఉంది.

News March 18, 2024

నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ALL THE BEST

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,23,092 మంది విద్యార్థులు, తెలంగాణలో 5.08 లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు 5 నిమిషాల(ఉ.9.35 వరకు) గ్రేస్ పీరియడ్ ఇవ్వగా.. ఏపీలో లేదు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

News March 18, 2024

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

News March 18, 2024

రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్

image

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజార్టీతో గెలిచారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీ ఇచ్చారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్‌కు ఎదురు లేకుండా పోయింది. తాజా విజయంతో మరో ఆరేళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

News March 18, 2024

నేడు జగిత్యాలకు ప్రధాని మోదీ రాక

image

TG: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనుండగా.. సభ ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ పర్యవేక్షిస్తున్నారు.