news

News March 21, 2024

కేజ్రీవాల్‌ను కవితతో కలిపి విచారిస్తారా?

image

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్‌, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 21, 2024

ఢిల్లీ సీఎం ఆయనే.. మంత్రి ప్రకటన

image

ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ తెలిపారు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని వ్యాఖ్యానించారు. సీఎంను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆమె చెప్పారు. దీనిపై ఈరోజు రాత్రే విచారణ జరపాలని కోరామన్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ను రెండు గంటల పాటు విచారించిన ఈడీ.. కాసేపటి క్రితం అరెస్టు చేసింది.

News March 21, 2024

ఐఆర్ఎస్ To ఉద్యమం To పాలిటిక్స్

image

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హరియాణాలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1999లో ఐఆర్ఎస్‌కి ఎంపికయ్యారు 1999-2000ల మధ్య పరివర్తన్ ఉద్యమాన్ని చేపట్టారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 2011లో అన్నా హజారేతో కలిసి జన లోక్‌పాల్ బిల్లు కోసం పోరాడి జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. 2012లో AAPని స్థాపించి రెండు సార్లు సీఎం అయ్యారు.

News March 21, 2024

కాంగ్రెస్ MP అభ్యర్థుల ప్రకటన

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

News March 21, 2024

విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారు: లోకేశ్

image

AP: వైజాగ్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరపరిచిందని నారా లోకేశ్ తెలిపారు. ‘ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే బినామీ కంపెనీ పేరుతో రూ.21వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చావు కదా జగన్?’ అని ట్వీట్ చేశారు.

News March 21, 2024

కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.

News March 21, 2024

BIG BREAKING: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ను ఈడీ ఆఫీస్‌కు తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

News March 21, 2024

‘ఆపరేషన్ ఇంద్రవతి’ చేపట్టిన భారత్

image

హైతీలో హింస చెలరేగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ ఇంద్రవతి’ చేపట్టింది. 12 మంది భారతీయులను హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్‌కు తరలించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

News March 21, 2024

ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల

image

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అదే రోజు ఉదయం 11 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.

News March 21, 2024

మహిళా టీ20 WC క్వాలిఫయర్ షెడ్యూల్ విడుదల

image

మహిళా టీ20 వరల్డ్ కప్ 2024 క్వాలిఫయర్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే నెల 25 నుంచి మే 7వరకు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో శ్రీలంక, థాయిలాండ్, స్కాట్లాండ్, ఉగాండా, యూఎస్ఏ ఉండగా.. గ్రూప్-Bలో ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, యూఏఈ, వనాటు ఉన్నాయి. ఫైనల్ చేరిన 2 జట్లు టీ20 WCకి అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది.